దిన్ని వందిఙ్ నాను దేవుణు గుడిఃదు సొహిమహిఙ్, సుబ్బరం ఆతి వెనుకానె యూదురు నఙి బాన్ సుడ్ఃతార్. అయావలె నావెట మంద లోకుర్ ఎయెర్ సిల్లెతార్. ఇని గొడఃబ జర్గిఏతాద్. గాని నాను బాన్ మహివలె ఆసియ దేసెమ్‌దాన్ వాతిమహి సెగొండార్ యూదురు, బాన్ మహారె నా ముస్కు గొడఃబ ఆతార్. నా ముస్కు వరిఙ్ ఇని నేరం మహిఙ వారె వాజి నీ వెట వర్గిదెఙ్.