Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




జెఫన్యా 2:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 దేశంలోని సమస్త దీనులారా, ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి. నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి; యెహోవా కోప్పడే దినాన బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 దేశములో సాత్వికులై ఆయన న్యాయవిధులననుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి; మీరు వెదకి వినయముగలవారై నీతిని అనుసరించినయెడల ఒకవేళ ఆయన ఉగ్రతదినమున మీరు దాచబడుదురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులు అనుసరించే దీనులారా, యెహోవాను వెదకండి. మీరు వెతికి వినయంతో నీతిని అనుసరిస్తే ఒకవేళ ఆయన ఉగ్రత దినాన మీరు భద్రంగా ఉంటారేమో.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 దీనులైన సర్వజనులారా, యెహోవా దగ్గరకు రండి! ఆయన చట్టాలకు విధేయులుగా ఉండండి. మంచి పనులు చేయటం నేర్చుకోండి. వినయంగా ఉండటం నేర్చుకోండి. ఒకవేళ అప్పుడు, యెహోవా తన కోపం చూపించేవేళ, మీరు క్షేమంగా ఉంటారేమో.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 దేశంలోని సమస్త దీనులారా, ఆయన ఆజ్ఞను పాటించేవారలారా, యెహోవాను వెదకండి. నీతిని వెదకండి, దీనత్వాన్ని వెదకండి; యెహోవా కోప్పడే దినాన బహుశ మీకు ఆశ్రయం దొరకవచ్చు.

Faic an caibideil Dèan lethbhreac




జెఫన్యా 2:3
44 Iomraidhean Croise  

అందుకతడు, “బిడ్డ ప్రాణాలతో ఉన్నప్పుడు ‘ఒకవేళ యెహోవా నా మీద జాలి చూపించి బ్రతకనిస్తాడేమో’ అనుకుని ఉపవాసముండి ఏడ్చాను.


యెహోవాను, ఆయన బలాన్ని చూడండి; ఆయన ముఖాన్ని ఎల్లప్పుడు వెదకండి.


యెహోవా తన ప్రజల్లో ఆనందిస్తారు; దీనులకు విజయాన్ని కిరీటంగా ధరింపజేస్తారు.


దీనులు తృప్తిగా భోజనం చేస్తారు; యెహోవాను వెదికేవారు ఆయనను స్తుతిస్తారు, మీ హృదయాలు నిత్యం ఆనందిస్తాయి.


మనుష్యుల కుట్రలకు గురికాకుండ మీ సన్నిధి గుడారంలో వారిని దాచిపెడతారు; నిందించే నాలుకల నుండి తప్పించి వారిని మీ నివాసంలో భద్రంగా ఉంచుతారు.


సత్యం, వినయం, న్యాయం కోసం మీ వైభవంతో విజయవంతంగా ముందుకు సాగిపోండి. మీ కుడిచేయి భీకరమైన క్రియలు సాధించాలి.


నా దేవా, నన్ను కరుణించండి, నన్ను కరుణించండి, ఎందుకంటే నేను మిమ్మల్ని ఆశ్రయించాను. విపత్తు గడిచేవరకు నేను మీ రెక్కల నీడలో ఆశ్రయం పొందుతాను.


ఎందుకంటే దేవా, దేశంలో అణగారిన వారినందరిని రక్షించడానికి, తీర్పు తీర్చడానికి మీరు లేచారు. సెలా


మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.


మీరు వారితో, ‘ఇది యెహోవాకు పస్కాబలి; ఆయన ఈజిప్టువారిని చంపుతున్నప్పుడు ఈజిప్టులో ఉన్న ఇశ్రాయేలీయుల ఇళ్ళను ఆయన ఏమీ చేయకుండా దాటి వెళ్లారు’ అని చెప్పాలి.” అప్పుడు ప్రజలు తలలు వంచి ఆరాధించారు.


యెహోవా నామం బలమైన కోట, నీతిమంతుడు అందులోకి పరుగెత్తి క్షేమంగా ఉంటాడు.


సరియైనది చేయడం నేర్చుకోండి; న్యాయాన్ని వెదకండి. అణచివేయబడుతున్న వారి పక్షాన ఉండండి. తండ్రిలేనివారికి న్యాయం తీర్చండి. విధవరాలి పక్షాన వాదించండి.


కాని నీతిగా పేదలకు తీర్పు తీరుస్తాడు, భూమిపై ఉన్న పేదల కోసం న్యాయంతో నిర్ణయాలు తీసుకుంటాడు. అతడు తన నోటి దండంతో భూమిని కొడతాడు; తన పెదవుల ఊపిరిచేత దుష్టులను చంపుతాడు.


ప్రభువైన యెహోవా ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించారు. విరిగిన హృదయం గలవారిని బలపరచడానికి బందీలకు విడుదలను ఖైదీలకు చీకటి నుండి విముక్తిని ప్రకటించడానికి,


నేను నిన్ను రక్షిస్తాను; నీవు నన్ను నమ్మావు కాబట్టి నీవు ఖడ్గానికి బలి కాకుండ, నీవు ప్రాణంతో తప్పించుకుంటావు అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


‘అలాంటప్పుడు నీకోసం నీవు గొప్ప వాటిని వెదుక్కోవాలా? వాటిని వెదకవద్దు. నేను ప్రజలందరికి విపత్తు తెస్తాను, కానీ నీవు ఎక్కడికి వెళ్లినా నీవు ప్రాణాలతో తప్పించుకునేలా చేస్తాను, అని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”


ఇశ్రాయేలు ప్రజలు యెహోవా రోజున జరిగే యుద్ధంలో స్థిరంగా నిలబడేలా మీరు గోడ పగుళ్ల దగ్గరకు వెళ్లి వాటిని బాగుచేయలేదు.


మీ కోసం నీతిని విత్తండి, మారని ప్రేమ అనే పంట కోయండి. దున్నబడని భూమిని చదును చేయండి; ఎందుకంటే, యెహోవా మీ దగ్గరకు వచ్చి, నీతి వర్షం మీపై కురిపించే వరకు, యెహోవాను వెదికే సమయం ఇదే.


ఇశ్రాయేలు అహంకారం అతనికి విరుద్ధంగా సాక్ష్యం ఇస్తుంది, కాని ఇదంతా జరిగినా కూడా అతడు తన దేవుడైన యెహోవా వైపు తిరగడం లేదు, ఆయనను వెదకడం లేదు.


దేవుని మనస్సు మార్చుకుని కనికరంతో తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి మనం నశించకుండా చేస్తారేమో ఎవరికి తెలుసు?”


సైన్యాల యెహోవా చెప్పే మాట ఇదే: “నాలుగు, అయిదు, ఏడు పదవ నెలల్లో మీరు చేసే ఉపవాసాలు యూదా వారికి ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగించే సంతోషకరమైన పండుగలుగా మారుతాయి. కాబట్టి సత్యాన్ని సమాధానాన్ని ప్రేమించండి.”


సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు.


సహోదరీ సహోదరులారా, చివరిగా, దేవునికి ఇష్టులుగా ఎలా జీవించాలో మేము మీకు బోధించిన ప్రకారం మీరు కూడా అలాగే జీవిస్తున్నారు. మీరు ఇలాగే ఇకముందు కూడా జీవించాలని ప్రభువైన యేసులో మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము.


నిజానికి, మాసిదోనియ అంతటా ఉన్న దేవుని కుటుంబమంతటికి ప్రేమ చూపిస్తున్నారు. అయినా సహోదరీ సహోదరులారా, మీరు ఇంకా అధికంగా ప్రేమించాలని చెప్తున్నాము.


ఇప్పుడు సత్యానికి విధేయులై మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకుంటున్నారు. తద్వారా తోటి విశ్వాసులపై నిజమైన ప్రేమ కలిగి ఉండి, ఒకరినొకరు హృదయపూర్వకంగా అధికంగా ప్రేమించుకోండి.


మృదువైన, సాధు స్వభావమనే అక్షయమైన అలంకారం గల హృదయపు సౌందర్యాన్ని కలిగి ఉండాలి. అదే దేవుని దృష్టిలో అమూల్యమైనది.


అయితే, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపలో జ్ఞానంలో వర్ధిల్లండి. ఆయనకు ఇప్పుడు ఎల్లప్పుడు మహిమ కలుగును గాక! ఆమేన్.


Lean sinn:

Sanasan


Sanasan