Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ప్రకటన 4:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి: “గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు, రానున్నవాడైన, ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ ”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి–భూతవర్తమాన భవిష్యత్కాలములలోఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికీ ఆరు రెక్కలున్నాయి. వాటి చుట్టూ, లోపలా, రెక్కల లోపల కూడా కళ్ళతో నిండి ఉన్నాయి. అవి పగలూ రాత్రీ మానకుండా ఈ విధంగా చెబుతున్నాయి, “పూర్వం ఉండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అంతటినీ పరిపాలించే వాడూ, దేవుడూ అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు!”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి శరీరాలపైన, క్రింద కళ్ళతో పూర్తిగా కప్పబడి ఉన్నాయి. రెక్కల క్రింద కళ్ళతో కప్పబడి ఉన్నాయి. రాత్రింబవళ్ళు అవి విడువక: “భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్నవాడు, సర్వశక్తి సంపన్నుడును ప్రభువునైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు” అని పాడుతూ ఉన్నాయి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 ఈ నాలుగు ప్రాణుల్లో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్లతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం ఇలా అంటున్నాయి: “గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు, రానున్నవాడైన, ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు.’ ”

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

8 ఈ నాలుగు ప్రాణులలో ప్రతి ప్రాణికి ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ ఆ రెక్కల క్రింద కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు ఆపకుండా నిరంతరం: “ఉండినవాడు, ఉన్న వాడు, రానున్నవాడైన ‘సర్వశక్తిగల ప్రభువైన దేవుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు’ ” అని అంటున్నాయి.

Faic an caibideil Dèan lethbhreac




ప్రకటన 4:8
42 Iomraidhean Croise  

అబ్రాముకు తొంభై తొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, “నేను సర్వశక్తిగల దేవుడను, నా ఎదుట నీవు నమ్మకంగా నిందారహితునిగా జీవించాలి.


మహోన్నతుడైన దేవుని చాటున నివసించేవారు సర్వశక్తిమంతుని నీడలో స్థిరంగా ఉంటారు.


యెహోవా, దేవుళ్ళ మధ్యలో మీవంటి వారెవరు? పరిశుద్ధతలో ఘనమైనవారు మహిమలో భీకరమైనవారు, అద్భుతాలు చేసే మీవంటి వారెవరు?


అందుకు దేవుడు మోషేతో, “నేను నేనైయున్నాను. నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాలి: ‘నేనైయున్నాను అనేవాడు నన్ను మీ దగ్గరకు పంపాడు.’ ”


యెహోవా దినం దగ్గరలో ఉందని రోదించండి; అది సర్వశక్తుడు దేవుని దగ్గర నుండి వచ్చే నాశనంలా వస్తుంది.


సీయోను నీతి ఉదయకాంతిలా ప్రకాశించే వరకు, దాని రక్షణ కాగడాలా వెలిగే వరకు, సీయోను పక్షంగా నేను మౌనంగా ఉండను. యెరూషలేము పక్షంగా నేను ఊరుకోలేను.


వాటి అంచులు ఎత్తుగా భయంకరంగా ఉన్నాయి. నాలుగు అంచుల చుట్టూ కళ్లతో నిండి ఉన్నాయి.


దానిలో కరిగిన ఇత్తడిలా నాలుగు జీవుల్లాంటి ఒక రూపం కనిపించింది. వాటి రూపం మానవరూపంలా ఉంది.


కాని ప్రతి జీవికి నాలుగు ముఖాలు, నాలుగు రెక్కలు ఉన్నాయి.


వాటి వీపు, చేతులు రెక్కలతో సహా వాటి శరీరమంతా కళ్లు ఉన్నాయి; వాటికున్న నాలుగు చక్రాలు కూడా పూర్తిగా కళ్లతో నిండి ఉన్నాయి.


యెహోవా దినం దగ్గరపడింది; అయ్యో! ఆ దినం నాశనంలా సర్వశక్తుని నుండి వస్తుంది.


కాబట్టి మీరు మెలకువగా ఉండండి! నేను మూడు సంవత్సరాలు రాత్రింబగళ్ళు ఎలా కన్నీరు కార్చుతూ మీలో అందరిని మానకుండా హెచ్చరించానో జ్ఞాపకం చేసుకోండి.


ఇంకా, “నేను మీకు తండ్రిగా ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలుగా ఉంటారు, అని సర్వశక్తిగల ప్రభువు చెప్తున్నాడు.”


సహోదరీ సహోదరులారా! మేము పడ్డ మా ప్రయాసాన్ని మా కష్టాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మేము ఎవరికి భారంగా ఉండకూడదని దేవుని సువార్తను మీ మధ్య ప్రకటించినప్పుడు, మేము రాత్రింబవళ్ళు పని చేసి మమ్మల్ని మేము పోషించుకున్నాము.


నీ జీవితాన్ని ఉపదేశాన్ని జాగ్రత్తగా చూసుకో. ఈ విధంగా చేస్తే, నిన్ను నీ బోధలు వినేవారిని కూడా నీవు రక్షించుకుంటావు.


ఆతురత కలిగి అనుకూల సమయంలోను అనుకూలంగా లేని సమయంలోను సిద్ధంగా ఉండాలి; ఎంతో సహనంతో, సరియైన సూచనలతో ప్రజలను సరిదిద్దుతూ, గద్దిస్తూ, ప్రోత్సహిస్తూ వాక్యాన్ని ప్రకటించు.


యేసు క్రీస్తు నిన్న, నేడు, నిరంతరం ఒకే విధంగా ఉన్నాడు.


యోహాను, ఆసియా ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు వ్రాయునది: గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడు రానున్నవాడైన దేవుని సింహాసనం ముందు ఉన్న ఏడు ఆత్మల నుండి మీకు కృపా సమాధానాలు కలుగును గాక


“అల్ఫా ఒమేగాను నేనే, గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడను రానున్నవాడను నేనే” అని సర్వశక్తిగల ప్రభువైన దేవుడు చెప్తున్నారు.


“గతంలో ప్రస్తుతంలో ఉన్నవాడవైన సర్వశక్తిగల ప్రభువైన దేవా, నీ మహాశక్తిని బట్టి నీవు పరిపాలిస్తున్నావు, కాబట్టి మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము.


ఆ మృగాన్ని దాని విగ్రహాన్ని పూజించిన లేదా దాని పేరు ముద్రను వేయించుకొన్నవారు విశ్రాంతి లేకుండా రాత్రింబగళ్ళు వేదన పొందుతారు. ఆ వేదన పొగ ఎల్లప్పుడు లేస్తూనే ఉంటుంది” అని బిగ్గరగా చెప్పాడు.


వారు సింహాసనం ముందు, నాలుగు ప్రాణుల ముందు, పెద్దల ముందు ఒక క్రొత్త పాట పాడారు. భూలోకం నుండి విమోచన పొందిన ఈ 1,44,000 మంది తప్ప ఆ పాటను ఎవరు నేర్చుకోలేరు.


వారు దేవుని సేవకుడైన మోషే పాట, వధించబడిన గొర్రెపిల్ల పాడిన పాట పాడుతూ, “మా ప్రభువైన సర్వశక్తిగల దేవా! నీవు చేసిన క్రియలు గొప్పవి, ఆశ్చర్యకరమైనవి! సకల రాజ్యాలకు రాజా! నీ మార్గాలు యథార్థంగా న్యాయంగా ఉన్నాయి!


అప్పుడు నాలుగు ప్రాణులలోని ఒక ప్రాణి నిరంతరం జీవించే దేవుని ఉగ్రతతో నింపబడిన ఏడు బంగారు పాత్రలను ఆ ఏడుగురు దేవదూతలకు ఇచ్చాడు.


అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.


అప్పుడు బలిపీఠం ఈ విధంగా బదులిచ్చింది: “అవును, ఓ సర్వశక్తిమంతుడా ప్రభువైన దేవా, నీ తీర్పులు సత్యమైనవి న్యాయమైనవి.”


దేశాలను నరకడానికి ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గం బయటకు వస్తుంది. “ఆయన ఒక ఇనుపదండంతో వారిని పరిపాలిస్తారు.” ఆయన సర్వశక్తిగల దేవుని తీవ్రమైన ఉగ్రత అనే ద్రాక్ష గానుగ తొట్టిని త్రొక్కుతారు.


అప్పుడు ఆ ఇరవైనలుగురు పెద్దలు ఆ నాలుగు ప్రాణులు సింహాసనంపై కూర్చున్న దేవుని ముందు సాగిలపడి బిగ్గరగా ఇలా అన్నారు: “ఆమేన్! హల్లెలూయా!” అంటూ ఆరాధించారు.


ఆ పట్టణంలో ఏ దేవాలయం నాకు కనిపించలేదు ఎందుకంటే సర్వశక్తిగల ప్రభువైన దేవుడును గొర్రెపిల్ల ఆ పట్టణానికి దేవాలయంగా ఉన్నారు.


“ఫిలదెల్ఫియలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: దావీదు తాళపు చెవిని కలిగి ఉన్న సత్యవంతుడైన పరిశుద్ధుడు ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన తెరచిన దాన్ని ఎవరూ మూయలేరు, ఆయన మూసిన దాన్ని ఎవరూ తెరవలేరు.


ఆ సింహాసనం చుట్టూ మరో ఇరవైనాలుగు సింహాసనాలు, వాటి మీద ఇరవైనలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారు. వారు తెల్లని వస్త్రాలు ధరించుకొని తలల మీద బంగారు కిరీటాలు కలిగి ఉన్నారు.


ఆ సింహాసనం ముందు స్ఫటికం లాంటి ఒక గాజు సముద్రం ఉంది. మధ్యభాగంలో, ఆ సింహాసనం చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులకు ముందు వెనుక కళ్లు ఉన్నాయి.


ఆ ప్రాణులు సింహాసనం మీద ఆసీనుడై ఎల్లకాలం జీవిస్తున్న దేవాది దేవునికి మహిమ, ఘనత కృతజ్ఞతలు అర్పిస్తుండగా,


అప్పుడు సింహాసనం మధ్య, ఆ నాలుగు ప్రాణులు, పెద్దల మధ్య వధించబడినట్లు ఉన్న ఒక గొర్రెపిల్లను చూశాను. ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ల ఉన్నాయి, అవి దేవుడు భూలోకమంతటి మీదికి పంపిన దేవుని ఏడు ఆత్మలు.


వధించబడిన గొర్రెపిల్ల ఆ ఏడు ముద్రలలో మొదటి దానిని విప్పుతున్నప్పుడు నేను చూశాను. ఆ నాలుగు ప్రాణుల్లో ఒక ప్రాణి ఉరుముతున్న స్వరంతో, “వచ్చి చూడు!” అని చెప్పడం నేను విన్నాను.


ఆ నాలుగు ప్రాణుల మధ్య నుండి ఒక స్వరం, “ఒక రోజు జీతానికి ఒక కిలో గోధుమలు, ఒక రోజు జీతానికి మూడు కిలోల యవల గింజలు. అయితే ఒలీవల నూనెను ద్రాక్షారసాన్ని పాడుచేయవద్దు!” అని చెప్పడం విన్నాను.


అప్పుడు దేవదూతలు అందరు సింహాసనం చుట్టూ పెద్దల చుట్టూ నాలుగు ప్రాణుల చుట్టూ నిలబడ్డారు; వారు సింహాసనం ముందు తమ ముఖాలను నేలకు ఆనిస్తూ సాగిలపడి దేవుని ఆరాధిస్తూ,


అందుకే, “వీరు దేవుని సింహాసనం ముందు ఉండి, ఆయన మందిరంలో రాత్రింబగళ్ళు ఆయనను ఆరాధిస్తున్నారు, కాబట్టి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు తన సన్నిధితో వారిని సంరక్షిస్తాడు.


Lean sinn:

Sanasan


Sanasan