Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ప్రకటన 1:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు, “ఆయనను చూసి దుఃఖిస్తూ విలపిస్తారు.” అలా జరుగును గాక! ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 ఇదిగో ఆయన మేఘా రూఢుడై వచ్చుచున్నాడు; ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచినవారును చూచెదరు; భూజనులందరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు; అవును ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 చూడండి! ఆయన మేఘంపై ఎక్కి వస్తున్నాడు. ఆయనను ప్రతి కన్నూ చూస్తుంది. ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. భూమిపై ఉన్న జనాలందరూ ఆయనను చూసి గుండెలు బాదుకుంటారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

7 చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు. ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు, “ఆయనను చూసి దుఃఖిస్తూ విలపిస్తారు.” అలా జరుగును గాక! ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac

తెలుగు సమకాలీన అనువాదము

7 “ఇదిగో! ఆయన మేఘాలలో వస్తున్నారు.” “ప్రతి కన్ను ఆయనను చూస్తుంది, ఆయనను పొడిచిన వారు కూడ ఆయనను చూస్తారు”; భూమి మీద ఉన్న జనులందరు “ఆయనను చూసి బిగ్గరగా విలపిస్తారు.” అలా జరుగును గాక! ఆమేన్.

Faic an caibideil Dèan lethbhreac




ప్రకటన 1:7
36 Iomraidhean Croise  

అప్పుడు వారు దేవునికి ప్రార్థించి ఆయన దయను పొందవచ్చు, వారు దేవుని ముఖం చూసి ఆనందంతో కేకలు వేస్తారు; ఆయన వారి నీతిని వారికి తిరిగి ఇస్తారు.


కుక్కలు నా చుట్టూ గుమికూడాయి, దుష్టుల మూక నా చుట్టూ మూగింది; వారు నా చేతుల్లో నా పాదాల్లో పొడిచారు.


దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక; ఆయన విరోధులు ఆయన ఎదుట నుండి పారిపోవుదురు గాక.


ఆయన చుట్టూరా మోఘాలు సాంద్రమైన చీకటితో ఆవరించి ఉన్నాయి; ఆయన సింహాసనానికి నీతి న్యాయాలు పునాదులు.


ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం: చూడండి, యెహోవా వేగంగల మేఘం ఎక్కి ఈజిప్టుకు వస్తున్నారు. ఈజిప్టు విగ్రహాలు ఆయన ఎదుట వణకుతాయి, ఈజిప్టు ప్రజల గుండెలు భయంతో కరిగిపోతాయి.


“రాత్రి దర్శనంలో నేను చూస్తుండగా మనుష్యకుమారునిలా ఉన్న ఒక వ్యక్తి మేఘాల మీద నా ముందుకు వచ్చాడు. అతడు మహా వృద్ధుని సముఖంలోకి వచ్చాడు.


యెహోవా త్వరగా కోప్పడరు, ఆయన గొప్ప శక్తిగలవారు; యెహోవా దోషులను శిక్షించకుండ విడిచిపెట్టరు. ఆయన మార్గం సుడిగాలిలోనూ తుఫానులోనూ ఉంది, మేఘాలు ఆయన పాద ధూళి.


“అప్పుడు దావీదు వంశీయుల మీద యెరూషలేము నివాసుల మీద కనికరంగల ఆత్మను విన్నపం చేసే ఆత్మను కుమ్మరిస్తాను. వారు తాము పొడిచిన నన్ను చూసి, ఒకరు తన ఒక్కగానొక్క బిడ్డ కోసం విలపించినట్లు, తన మొదటి కుమారుని కోసం దుఃఖపడునట్లు, ఆయన విషయంలో దుఃఖిస్తూ విలపిస్తారు.


ఆ రోజు, మెగిద్దో మైదానంలో హదద్-రిమ్మోనులో జరిగిన రోదన కంటే యెరూషలేములోని రోదన అధికంగా ఉంటుంది.


“అతన్ని చూస్తాను, కానీ ఇప్పుడు కాదు; అతన్ని కనిపెడతాను, కానీ సమీపంగా కాదు. యాకోబు నుండి నక్షత్రం వస్తుంది; ఇశ్రాయేలు నుండి రాజదండం లేస్తుంది. అతడు మోయాబు కణతలను నలగ్గొడతాడు, షేతు ప్రజల కపాలాలను చితకగొడతాడు.


ఎందుకంటే మనుష్యకుమారుడు తన తండ్రి మహిమతో తన దూతలతో కూడ రాబోతున్నాడు. అప్పుడు ఆయన ప్రతివానికి వాని పనుల ప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.


“ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొందరు మనుష్యకుమారుడు తన రాజ్యంతో రావడం చూడక ముందు చనిపోరు అని నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను” అన్నారు.


“అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశంలో కనిపిస్తుంది. భూప్రజలందరు మనుష్యకుమారుడు తన ప్రభావంతో, గొప్ప మహిమతో ఆకాశ మేఘాల మీద రావడం చూసి ప్రజలు రొమ్ము కొట్టుకొంటూ రోదిస్తారు.


మనుష్యకుమారుడు తన మహిమలో, దేవదూతలందరితో వచ్చేటప్పుడు, ఆయన తన మహిమగల సింహాసనం మీద కూర్చుని ఉంటాడు.


అందుకు యేసు, “నీవు చెప్పినట్లే. అయితే ఇప్పటినుండి మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారని మీ అందరికి చెప్తున్నాను.”


“అప్పుడు మనుష్యకుమారుడు గొప్ప శక్తితో మహిమతో మేఘాల మీద రావడం ప్రజలు చూస్తారు.


అందుకు యేసు, “అవును” అంతేకాదు, “మనుష్యకుమారుడు సర్వశక్తిగల దేవుని కుడిచేతి వైపున కూర్చుని ఉండడం ఆకాశ మేఘాల మీద ఆయన రావడం మీరు చూస్తారు” అని చెప్పారు.


అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావంతో గొప్ప మహిమతో మేఘాల మీద రావడం చూస్తారు.


కాని సైనికుల్లో ఒకడు బల్లెంతో యేసుని ప్రక్కలో పొడిచాడు. వెంటనే రక్తం నీరు కారాయి.


ఇతర లేఖనాల్లో, “వారు తాము పొడిచిన వానివైపు చూస్తారు” అని వ్రాయబడి ఉంది.


మరణం నుండి ఆయన లేపిన, రాబోయే ఉగ్రత నుండి మనల్ని కాపాడబోవుచున్న, పరలోకం నుండి రాబోతున్న ఆయన కుమారుడైన యేసు కోసం మీరు ఎంతగా ఎదురుచూస్తున్నారో వారే చెప్తున్నారు.


ఆ తర్వాత మిగతా బ్రతికి ఉన్న మనం వారితో పాటు కలసి, ప్రభువును కలుసుకోడానికి ఆకాశమండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము.


అలాంటప్పుడు దేవుని కుమారుని తమ పాదాల క్రింద త్రొక్కినవారు, తమను పరిశుద్ధపరచే నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదానిగా భావించినవారు, కృప గల ఆత్మను అవమానించినవారు ఎంత గొప్ప తీవ్రమైన శిక్షను పొందుతారో మీరు ఊహించగలరా?


తప్పిపోయినవారిని తిరిగి పశ్చాత్తాపం వైపుకు నడిపించడం అసాధ్యము. అలాంటివారు తమ నాశనానికే దేవుని కుమారుని మళ్ళీ సిలువవేస్తూ, ఆయనను బహిరంగంగా అవమానానికి గురిచేస్తున్నారు.


ప్రియ మిత్రులారా, మనం ఇప్పుడు దేవుని పిల్లలమే కాని, ఇక ఏమి కానున్నామో ఇంకా స్పష్టం కాలేదు. క్రీస్తు ప్రత్యక్షమైనపుడు, ఆయన యథార్థ రూపాన్ని మనం చూస్తాము కాబట్టి, ఆయన వలె ఉంటామని తెలుసుకుంటాము.


ఆదాము నుండి ఏడవ తరం వాడైన హనోకు వారి గురించి ఇలా ప్రవచించాడు: “చూడండి, వేవేలకొలది తన పరిశుద్ధ జనంతో ప్రభువు వస్తారు.


ఈ సంగతుల గురించి సాక్ష్యమిచ్చేవాడు, “నిజమే, నేను త్వరగా వస్తున్నాను!” అంటున్నాడు. ఆమేన్! రండి, ప్రభువైన యేసు!


వారు ఆయన ముఖాన్ని చూస్తారు, వారి నుదుటి మీద ఆయన పేరు ఉంటుంది.


“యెహోవా, మీ శత్రువులందరూ అలాగే నశించాలి! అయితే మిమ్మల్ని ప్రేమించే వారందరు తన బలంతో ఉదయించే సూర్యునిలా ఉండాలి.” తర్వాత దేశం నలభై సంవత్సరాలు ప్రశాంతంగా ఉంది.


Lean sinn:

Sanasan


Sanasan