Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




కీర్తన 13:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 యెహోవా నా దేవా, నామీద దృష్టియుంచి నాకు ఉత్తరమిమ్ము

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 యెహోవా నా దేవా, నాపై చూపు నిలిపి నాకు జవాబివ్వు. నా కళ్ళు వెలిగించు, లేకపోతే నేను నిద్రలోనే చనిపోతాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 నా దేవా, యెహోవా, నన్ను చూడుము. నా ప్రశ్నలకు జవాబిమ్ము. నన్ను ఆ జవాబు తెలుసుకోనిమ్ము. లేదా నేను చనిపోతాను!

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 యెహోవా నా దేవా, నన్ను చూసి జవాబివ్వండి, నా కళ్లకు వెలుగివ్వండి, లేకపోతే నేను మరణంలో నిద్రపోతాను.

Faic an caibideil Dèan lethbhreac




కీర్తన 13:3
15 Iomraidhean Croise  

“అయితే ఇప్పుడు, మా దేవుడైన యెహోవా ప్రార్థనకు జవాబుగా మా కళ్ళకు వెలుగిచ్చి మా బానిసత్వం నుండి కొంత ఉపశమనం కలిగేలా మాలో కొందరిని తప్పించి, తన పరిశుద్ధాలయంలో స్థిరమైన స్థలాన్ని ఇచ్చి, మా దేవుడు కొంతమట్టుకు మా పట్ల దయ చూపించారు.


యెహోవా, నా దీపాన్ని వెలిగించేది మీరే; నా దేవుడు నా చీకటిని వెలుగుగా మారుస్తారు.


అయితే వారు ఉత్సాహంగా ఉన్నప్పుడు, నేను వారికి విందు ఏర్పాటుచేసి, వారు సంతోషించేలా, మద్యంతో వారికి మత్తు ఎక్కేలా చేస్తాను అప్పుడు వారు శాశ్వతంగా నిద్రపోతారు, తిరిగి మేలుకోరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


యెహోవా, నా మాటలు ఆలకించండి, నా నిట్టూర్పు గురించి ఆలోచించండి.


అందుకు యోనాతాను, “దేశం కష్టపడడానికి నా తండ్రి కారణమయ్యాడు. నేను ఈ తేనె కొంచెం తినగానే నా కళ్లు ఎంత ప్రకాశిస్తున్నాయో చూడు.


అయితే యోనాతాను తన తండ్రి ప్రజలతో చేయించిన ప్రమాణాన్ని వినలేదు కాబట్టి తన చేతిలో ఉన్న కర్రను చాపి దాని అంచును తేనెతెట్టెలో ముంచి తన చేయి నోటిలో పెట్టుకున్నప్పుడు అతని కళ్లు ప్రకాశించాయి.


అందుకే వాక్యంలో, “నిద్రిస్తున్నవాడా, మేల్కో, మృతులలో నుండి లే, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు” అని వ్రాయబడింది.


యెహోవా, మాకు ఏమి జరిగిందో జ్ఞాపకముంచుకోండి; మా వైపు తిరిగి, మాకు కలిగిన అవమానాన్ని చూడండి.


నేను దాని ఉన్నతాధికారులు, జ్ఞానులు, దాని అధిపతులు, అధికారులు, యోధులు కూడా మద్యం త్రాగి మత్తెక్కేలా చేస్తాను. వారు శాశ్వతంగా నిద్రపోతారు ఇక మేలుకోరు,” అని సైన్యాల యెహోవా అనే పేరుగల రాజు ప్రకటిస్తున్నారు.


నా శ్రమను చూసి నన్ను విడిపించండి, ఎందుకంటే నేను మీ ధర్మశాస్త్రాన్ని మరవలేదు.


మీ మారని ప్రేమలో నేను ఆనందించి సంతోషిస్తాను, నా బాధను మీరు చూశారు నా వేదన మీకు తెలుసు.


నా శత్రువులు ఎంతమంది ఉన్నారో చూడండి వారు ఎంత తీవ్రంగా నన్ను ద్వేషిస్తున్నారో చూడండి!


యెహోవా, నా శత్రువులు నన్ను ఎలా హింసించారో చూడండి! నన్ను కరుణించి మరణ ద్వారాల నుండి నన్ను తప్పించండి,


ఆ పట్టణంపై సూర్యుడు గాని చంద్రుడు గాని ప్రకాశించాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుని మహిమ దానికి వెలుగు ఇస్తుంది గొర్రెపిల్ల దానికి దీపము.


Lean sinn:

Sanasan


Sanasan