Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




కీర్తన 127:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 చూడండి, పిల్లలు యెహోవా ప్రసాదించే వారసత్వం. గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 పిల్లలు యెహోవానుండి లభించే కానుక. వారు తల్లి గర్భమునుండి వచ్చే బహుమానం.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 పిల్లలు యెహోవా ఇచ్చే స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం.

Faic an caibideil Dèan lethbhreac




కీర్తన 127:3
22 Iomraidhean Croise  

దేవుడు వారితో, “మీరు ఫలించి, వృద్ధి చెంది, భూలోకమంతా విస్తరించి, దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, నేలపై ప్రాకే ప్రతి జీవిని ఏలండి” అని చెప్పి ఆశీర్వదించారు.


వారు రిబ్కాను దీవించి ఆమెతో ఇలా అన్నారు, “మా సోదరీ, నీవు వర్ధిల్లాలి, వేవేల మందికి తల్లివి కావాలి; నీ సంతానపు వారు తమ శత్రువుల పట్టణాలను స్వాధీనం చేసుకోవాలి.”


ఏశావు కళ్ళెత్తి స్త్రీలను, పిల్లలను చూశాడు. “నీతో ఉన్న వీరెవరు?” అని అడిగాడు. యాకోబు, “వీరు నీ సేవకునికి దేవుడు దయతో ఇచ్చిన పిల్లలు” అని జవాబిచ్చాడు.


అటు తర్వాత ఆదాము హవ్వను లైంగికంగా కలుసుకున్నప్పుడు ఆమె గర్భవతియై కయీనుకు జన్మనిచ్చింది. “యెహోవా సహాయంతో నేను కుమారున్ని సంపాదించుకున్నాను” అని ఆమె అన్నది.


‘నేను నిన్ను ఫలవంతం చేస్తాను, నీ సంఖ్యను పెంచుతాను. నేను నిన్ను ప్రజల సమాజంగా చేస్తాను, నీ తర్వాత నీ వారసులకు ఈ భూమిని నిత్య స్వాస్థ్యంగా ఇస్తాను’ అని అన్నారు.


దావీదు భార్య ఎగ్లా ద్వారా పుట్టిన ఇత్రెయాము ఆరవ కుమారుడు. వీరు దావీదుకు హెబ్రోనులో పుట్టిన కుమారులు.


యెహోవా నాకు అనేక కుమారులను ఇచ్చారు. వారందరి నుండి, ఇశ్రాయేలీయులపై యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చోడానికి ఆయన నా కుమారుడైన సొలొమోనును ఎన్నుకున్నారు.


ఊలాము కుమారులు పరాక్రమశాలులు, విల్లువిద్యలో ప్రవీణులు. వారికి నూటయాభైమంది కుమారులు, మనుమలు ఉన్నారు. వీరందరు బెన్యామీను వారసులు.


అతనికి ఏడుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు,


వారి విల్లులు యవ్వనస్థులను నలగ్గొడతాయి; పసిపిల్లలపై వారు జాలిపడరు. పిల్లలపై వారు దయ చూపరు.


ఇదిగో నేను, యెహోవా నాకిచ్చిన పిల్లలు, సీయోను కొండమీద నివసించే సైన్యాల యెహోవా వలన సూచనలుగా, గుర్తులుగా ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నాము.


యెహోవా మీకు ఇస్తానని మీ పూర్వికులకు ప్రమాణం చేసిన దేశంలో, మీ గర్భ ఫలంలో, మీ పశువుల పిల్లల్లో, మీ నేల పంటల్లో మీకు సమృద్ధిగా వృద్ధిని ఇస్తారు.


మీ గర్భఫలం దీవించబడుతుంది, భూ పంటలు, పశువుల మందల్లోని దూడలు గొర్రెల మందల్లోని గొర్రెపిల్లలు దీవించబడతాయి.


అతనికి ముప్పైమంది కుమారులు, ముప్పైమంది కుమార్తెలు ఉన్నారు. అతడు తన కుమార్తెలను వేరే గోత్రం వారికి ఇచ్చి పెళ్ళి చేశాడు, అలాగే తన కుమారులకు తన గోత్రానికి చెందని ముప్పైమంది యువతులతో పెళ్ళిళ్ళు చేశాడు. ఇబ్సాను ఏడు సంవత్సరాలు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉన్నాడు.


నేను ఈ బిడ్డ కోసం ప్రార్థించాను, నేను యెహోవాను ఏమి అడిగానో, ఆయన నాకు అదే ఇచ్చారు.


Lean sinn:

Sanasan


Sanasan