Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




సంఖ్యా 3:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 వారు సమావేశ గుడారపు సేవ చేస్తూ సమావేశ గుడారం దగ్గర అతని తరపున సమాజమంతటి తరపున విధులు నిర్వర్తిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 వారు ప్రత్యక్షపు గుడారము నెదుట మందిరపుసేవ చేయవలెను. తాము కాపాడ వలసినదానిని, సర్వసమాజము కాపాడ వలసినదానిని, వారు కాపాడవలెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 వారు సన్నిధి గుడారం ఎదుట అహరోను తరపునా, సమాజమంతటి తరపునా బాధ్యతలు నిర్వర్తించాలి. వారు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

7 అహరోను సన్నిధి గుడారంలో పరిచర్య చేసేటప్పుడు లేవీయులు అహరోనుకు సహాయం చేస్తారు. ఇశ్రాయేలు ప్రజలు పవిత్ర గుడారంలో ఆరాధించటానికి వచ్చినప్పుడు వాళ్లందరికి లేవీయులు సహాయం చేస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 వారు సమావేశ గుడారపు సేవ చేస్తూ సమావేశ గుడారం దగ్గర అతని తరపున సమాజమంతటి తరపున విధులు నిర్వర్తిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac




సంఖ్యా 3:7
13 Iomraidhean Croise  

అహీయా నాయకత్వంలో నడిపించబడిన ఇతర లేవీయులు, దేవుని మందిరంలోని ఖజానాలకు యెహోవాకు సమర్పించబడిన కానుకల ఖజానాలకు బాధ్యత వహించారు.


యెహీయేలీ కుమారులు, జేతాము అతని సోదరుడైన యోవేలు. వీరికి యెహోవా ఆలయ ఖజానాల బాధ్యత అప్పగించబడింది.


(రాజైన దావీదు, సహస్రాధిపతులు, శతాధిపతులు యైన కుటుంబ పెద్దలు ఇతర సైన్యాధిపతులు ప్రతిష్ఠించిన వస్తువులున్న ఖజానాలన్నిటి బాధ్యత షెలోమీతుకు, అతని బంధువులకు అప్పగించబడింది.


మీరు సమావేశ గుడారం యొక్క ద్వారం దగ్గర ఏడు రోజులు రాత్రింబగళ్ళు ఉండి యెహోవా ఏం చేయమంటారో అది చేయాలి, అప్పుడు మీరు చావరు; ఎందుకంటే నాకివ్వబడిన ఆజ్ఞ ఇదే” అని చెప్పాడు.


దానికి బదులుగా సాక్షి గుడారం లేదా సాక్షి గుడారం మీద, దాని ఉపకరణాల మీద, దానికి సంబంధించిన అన్నిటి మీద లేవీయులను నియమించు. వారు సమావేశ గుడారాన్ని, దాని ఉపకరణాలన్నిటిని మోయాలి; వారు దాని చుట్టూ ఉంటూ దానిని చూసుకోవాలి.


అయితే నా కోపం ఇశ్రాయేలీయుల సమాజం మీదికి రాకుండా లేవీయులు సాక్షి గుడారం చుట్టూ డేరాలు వేసుకోవాలి. సాక్షి గుడారాన్ని కాపాడే బాధ్యత లేవీయులదే.”


యాజకుడును అహరోను కుమారుడునైన ఎలియాజరు లేవీయుల ప్రధాన నాయకుడు. పరిశుద్ధాలయాన్ని కాపాడే వారి మీద ఇతడు ముఖ్య నాయకునిగా నియమించబడ్డాడు.


ప్రత్యక్ష గుడారపు పని చేయడం ద్వారా ఇశ్రాయేలీయుల బాధ్యతలను నెరవేరుస్తూ, వారు సమావేశ గుడారపు సామాగ్రి అంతా చూసుకోవాలి.


ఇశ్రాయేలీయుల మిగతా సగం వాటా నుండి, మనుష్యులైనా, పశువులైనా, గాడిదలైనా, గొర్రెలైనా, వీటిలో ఏవైనా సరే, ప్రతి 50 నుండి ఒకటి తీసుకుని, యెహోవా సమావేశ గుడారాన్ని చూసుకునే బాధ్యత కలిగిన లేవీయులకు ఇవ్వాలి.”


అహరోను తన చేతులు పైకెత్తి, ఇశ్రాయేలు ప్రజల నుండి ప్రత్యేక అర్పణగా లేవీయులను యెహోవాకు సమర్పించాలి, తద్వారా వారు యెహోవా సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు.


“లేవీయులను పవిత్రపరచిన తర్వాత, చేతులు పైకెత్తి వారిని ప్రత్యేక అర్పణగా సమర్పించిన తర్వాత, వారు సమావేశ గుడారంలో సేవ చేయడానికి రావాలి.


Lean sinn:

Sanasan


Sanasan