Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




సంఖ్యా 28:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నీవు వారికి ఇలా చెప్పు: ‘ఇది మీరు యెహోవాకు సమర్పించాల్సిన హోమబలి: ప్రతిరోజు లోపం లేని ఏడాది గొర్రెపిల్లలు రెండు దహనబలిగా అర్పించాలి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుము–మీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతిదినము నిర్దోషమైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱెపిల్లలను అర్పింపవలెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 ఇంకా నువ్వు వాళ్లకు ఈ విధంగా ఆజ్ఞాపించు. మీరు యెహోవాకు నిత్యం జరిగే దహనబలిగా ప్రతి రోజూ ఏ దోషం లేని ఒక సంవత్సరం వయస్సు ఉన్న రెండు మగ గొర్రెపిల్లలను అర్పించాలి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 వారు యెహోవాకు ఇవ్వవలసిన దహనబలులు ఇవే. ప్రతిరోజూ పుష్టిగల, ఒక సంవత్సరం వయసున్న రెండు మగ గొర్రె పిల్లలు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నీవు వారికి ఇలా చెప్పు: ‘ఇది మీరు యెహోవాకు సమర్పించాల్సిన హోమబలి: ప్రతిరోజు లోపం లేని ఏడాది గొర్రెపిల్లలు రెండు దహనబలిగా అర్పించాలి.

Faic an caibideil Dèan lethbhreac




సంఖ్యా 28:3
25 Iomraidhean Croise  

యెహోవా ఇశ్రాయేలీయులకు ఆదేశించిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రకారం, ప్రతిరోజు ఉదయ సాయంత్రాల్లో క్రమంగా బలిపీఠం మీద దహనబలి యెహోవాకు అర్పించడానికి దావీదు వారిని నియమించాడు.


మోషే ఇచ్చిన ఆజ్ఞ ననుసరించి ప్రతిరోజు పాటించవలసిన విధి ప్రకారం సబ్బాతు దినాల్లో, అమావాస్యలప్పుడు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ, గుడారాల పండుగ అనే మూడు వార్షిక పండుగలప్పుడు యెహోవాకు దహనబలులు అర్పించేవాడు.


దాని తర్వాత క్రమంగా దహనబలులు, అమావాస్య బలులు, యెహోవా యొక్క పరిశుద్ధ పండుగలకు అర్పించవలసిన బలులు, అదే విధంగా ఒక్కొక్కరు తీసుకువచ్చిన స్వేచ్ఛార్పణలు అర్పించారు.


“అతని సాయుధ దళాలు దేవాలయ కోటను అపవిత్రపరచి అనుదిన బలిని నిలిపివేయడానికి లేచి నాశనానికి కారణమైన హేయమైన దానిని నిలబెడతారు.


“అనుదిన నైవేద్యం నిలిపివేయడం, వినాశనం కలిగించే హేయమైనది స్థిరపరచబడడం జరిగే కాలం నుండి 1,290 రోజులు గడచిపోతాయి.


యెహోవా సైన్యం యొక్క అధిపతికి సమానంగా తనను తాను హెచ్చించుకుంది; యెహోవా నుండి అనుదిన అర్పణలను నిలిపివేసింది, ఆయన పరిశుద్ధాలయాన్ని పడద్రోసింది.


అప్పుడు ఒక పరిశుద్ధుడు మాట్లాడడం నేను చూశాను, మరో పరిశుద్ధుడు అతనితో, “అనుదిన అర్పణలు, నాశనానికి కారణమైన తిరుగుబాటు, పరిశుద్ధాలయాన్ని లోబరచుకోవడం, యెహోవా ప్రజలు పాదాల క్రింద త్రొక్కబడుతున్న ఈ దర్శనం నెరవేరడానికి ఎంతకాలం పడుతుంది?” అన్నాడు.


అహరోను కుమారులు బలిపీఠం మీద నిప్పుపై పేర్చిన కట్టెల మీద ఉన్న దహనబలితో పాటు వీటిని దహించాలి; అది యెహోవాకు ఇష్టమైన సువాసనగల హోమబలి.


“అహరోనుకు అతని కుమారులకు ఈ ఆజ్ఞ ఇవ్వు: ‘ఇది దహనబలికి సంబంధించిన నియమం: దహనబలి రాత్రి నుండి ఉదయం వరకు బలిపీఠం పొయ్యిపై ఉండాలి, బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండాలి.


“బేతేలుకు వెళ్లి పాపం చేయండి; గిల్గాలుకు వెళ్లి ఇంకా ఎక్కువ పాపం చేయండి. ప్రతి ఉదయం మీ బలులు తీసుకరండి, మూడు సంవత్సరాలకు ఒకసారి మీ దశమ భాగాల్ని తీసుకురండి.


ప్రతి సబ్బాతుకు క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, పానార్పణంతో పాటు ఈ దహనబలి కూడా అర్పించాలి.


క్రమం తప్పకుండ అర్పించే దహనబలి, దాని పానార్పణంతో పాటు, యెహోవాకు పాపపరిహారబలిగా ఒక మేకపోతును అర్పించాలి.


ఇవన్నీ ప్రతి ఉదయం దహన బలులతో పాటు అర్పించాలి.


ఈ విధంగా ఏడు రోజులపాటు యెహోవాకు ఇష్టమైన సువాసనగా ఉండే ఆహార అర్పణను అర్పించాలి; ప్రతిరోజు అర్పించే దహనబలి దాని పానార్పణంతో పాటు దీనిని అర్పించాలి.


దహనబలులు, ఆహార అర్పణలతో పాటు, వీటిని వీటి పానార్పణాలతో కలిపి అర్పించాలి. అర్పణ కోసం తెచ్చే ప్రతి జంతువు లోపం లేనిదై ఉండాలి.


ఒక గొర్రెపిల్లను ఉదయాన, మరొకదాన్ని సూర్యాస్తమయ వేళ అర్పించాలి,


అంతేకాక ప్రాయశ్చిత్తం కొరకైన పాపపరిహారబలి, క్రమంగా అర్పించే దహనబలి, భోజనార్పణ, వారి పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.


అంతేకాక, నిత్య దహనబలి, భోజనార్పణ, పానార్పణలతో పాటు పాపపరిహారబలిగా మేకపోతును అర్పించాలి.


ఇవి నిర్దేశించబడిన ప్రతి నెలనెలా అనుదినం దహనబలులకు అధనంగా వాటి భోజనార్పణలు, పానార్పణలు. ఇవి యెహోవాకు ఇష్టమైన సువాసన కలిగించే హోమబలులుగా తేవాలి.


మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!


ఇలా అన్ని ఏర్పాటు చేయబడిన తర్వాత, ప్రతిరోజు యాజకులు తమ పరిచర్యను చేయడానికి మొదటి గదిలోకి వెళ్తారు.


లోకం సృష్టించబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడని భూనివాసులందరు ఆ మృగాన్ని పూజిస్తారు.


Lean sinn:

Sanasan


Sanasan