Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




సంఖ్యా 23:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 బిలాము, “యెహోవా నా నోట పెట్టిన మాటను నేను మాట్లాడకూడదా?” అని అన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 అందుకతడు– యెహోవా నా నోట ఉంచినదాని నేను శ్రద్ధగా పలుక వద్దా? అని ఉత్తరమిచ్చెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 బిలాము జవాబిస్తూ “యెహోవా నా నోట ఉంచినదే నేను జాగ్రత్తగా పలకాలి కదా?” అన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

12 కానీ బిలాము, “నేను చెప్పాల్సింది దేవుడు నాకు చెప్పిన విషయాలు మాత్రమే” అని జవాబిచ్చాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 బిలాము, “యెహోవా నా నోట పెట్టిన మాటను నేను మాట్లాడకూడదా?” అని అన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac




సంఖ్యా 23:12
11 Iomraidhean Croise  

నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించాలి. నేను నీ నోటికి అతని నోటికి తోడుగా ఉంటాను. మీరు మాట్లాడడానికి సహాయం చేస్తాను, అలాగే మీరేమి చేయాలో నేను మీకు బోధిస్తాను.


వారి మాటలు ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ, వాటిని నమ్మవద్దు, వారి హృదయాలు ఏడు అసహ్యకరమైన వాటితో నిండి ఉంటాయి.


ఆ రాత్రి దేవుడు బిలాముతో, “ఈ మనుష్యులు నిన్ను పిలువడానికి వచ్చారు కాబట్టి నీవు వారితో వెళ్లు కానీ నేను చెప్పేది మాత్రమే చేయు” అని అన్నారు.


“ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను కదా” అని బిలాము జవాబిచ్చాడు. “కానీ నాకిష్టమైనది నేను చెప్పలేను. దేవుడు నా నోట్లో పెట్టిందే నేను చెప్పాలి” అని బాలాకుతో అన్నాడు.


అప్పుడు బాలాకు అతనితో, “వారు కనిపించే మరో చోటికి నాతో రా; వారందరిని చూడవు కానీ, వారి శిబిరం సరిహద్దులు చూస్తావు. అక్కడినుండి నా కోసం వారిని శపించు” అని అన్నాడు.


ఆశీర్వదించమని నేను ఆజ్ఞ పొందుకున్నాను; ఆయన వారిని ఆశీర్వదించారు, దాన్ని నేను మార్చలేను.


బిలాము బాలాకుతో, “యెహోవా ఏది చెప్తే నేను అదే చేయాలని నేను చెప్పలేదా?” అని జవాబిచ్చాడు.


అప్పుడు బిలాము బాలాకుతో, “నీవు నీ దహనబలి దగ్గర ఉండు. బహుశ యెహోవా నన్ను కలుసుకోడానికి రావొచ్చు. ఆయన నాకు ఏమి బయలుపరుస్తారో అది నీకు చెప్తాను” అని అన్నాడు. తర్వాత అతడు ఖాళీ కొండపైకి వెళ్లాడు.


‘బాలాకు తన రాజభవనంలో ఉన్న వెండి బంగారం అంతా నాకు ఇచ్చినా సరే, నా సొంతగా నేనేమి చెప్పలేను, మంచిదైనా, చెడ్డదైనా యెహోవా ఆజ్ఞ దాటి ఏమి చెప్పలేను యెహోవా చెప్పిందే నేను చెప్పాలి.’


ఎందుకంటే అలాంటివారు మన ప్రభువైన క్రీస్తును సేవించరు కాని తమ ఆకలినే తీర్చుకుంటారు. వారు మృదువైన మాటలతో పొగడ్తలతో అమాయకులైనవారి మనస్సులను మోసం చేస్తారు.


వారు దేవుని నమ్ముతున్నామని చెప్తున్నప్పటికి, తమ పనుల ద్వారా ఆయనను తిరస్కరిస్తారు. వారు హేయమైనవారు, అవిధేయులు, ఏ మంచిని చేయడానికైనా అనర్హులు.


Lean sinn:

Sanasan


Sanasan