Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




సంఖ్యా 18:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 “యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 వారు యెహోవాకు అర్పించు వారి ప్రథమ ఫలములను, అనగా నూనెలో ప్రశస్తమైనదంతయు, ద్రాక్షారస ధాన్యములలో ప్రశస్తమైనదంతయు నీకిచ్చితిని.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 వారు యెహోవాకు అర్పించే మొదటి ఫలాలు, అంటే, నూనెలో ప్రశస్తమైనది, ద్రాక్షారసం, ధాన్యాల్లో ప్రశస్తమైనవన్నీ నీకిచ్చాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

12 “శ్రేష్ఠమైన ఒలీవ నూనె అంతయు, శ్రేష్ఠమైన కొత్త ద్రాక్షారసం అంతయు, ధాన్యం అంతయు నేను నీకిస్తున్నాను. ఇవన్నీ యెహోవానైన నాకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చేవి. ఇవన్నీ వారి పంట కోతలో ప్రథమ ఫలాలు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 “యెహోవాకు ఇశ్రాయేలీయులు వారి కోతలో నుండి ప్రథమ ఫలంగా అర్పించే ధాన్యము, ద్రాక్షరసము, నూనె అంతటిని మీకు ఇస్తున్నాను.

Faic an caibideil Dèan lethbhreac




సంఖ్యా 18:12
19 Iomraidhean Croise  

దేవుడు నీకు ఆకాశపు మంచును, భూమి యొక్క సారాన్ని, సమృద్ధికరమైన ధాన్యాన్ని, నూతన ద్రాక్షరసాన్ని ఇచ్చును గాక.


ఒక రోజు ఓ వ్యక్తి బయల్-షాలిషా నుండి దైవజనుని దగ్గరకు వస్తూ, ఒక సంచిలో తన ప్రథమ పంటలో యవల పిండితో చేసిన ఇరవై రొట్టెలు, క్రొత్త ధాన్యం కంకులు కొన్ని తెచ్చాడు. అయితే ఎలీషా, “ప్రజలకు తినడానికి ఇవ్వు” అని చెప్పాడు.


అలా ఆజ్ఞ జారీచేయడంతోనే ఇశ్రాయేలు ప్రజలు కానుకలు ధారాళంగా ఇచ్చారు. ధాన్యంలో మొదటి పంట, క్రొత్త ద్రాక్షరసంలో, నూనెలో, తేనెలో, పొలంలో పండే వాటిలో, కలిగిన వాటన్నిటిలో పదవ భాగాన్ని వారు తెచ్చారు. అది చాలా పెద్ద మొత్తము.


ఆయన మీ పొలిమేరల్లో సమాధానం అనుగ్రహిస్తారు మంచి గోధుమలతో పంటనిచ్చి మిమ్మల్ని తృప్తిపరుస్తారు.


కానీ మిమ్మల్ని నేను శ్రేష్ఠమైన గోధుమలతో పోషిస్తాను; బండ నుండి తీసిన తేనెతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను.”


“మీ ధాన్యాగారాల నుండి, తొట్టెల నుండి అర్పణలు చెల్లించడం ఆలస్యం చేయకూడదు. “ఖచ్చితంగా మీ కుమారులలో మొదటి సంతానాన్ని నాకు అర్పించాలి.


“మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. “మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.


“మీ పొలంలో పండిన ప్రథమ ఫలాల్లో శ్రేష్ఠమైన వాటిని మీ దేవుడైన యెహోవా మందిరానికి తీసుకురావాలి. “మేకపిల్లను దాని తల్లిపాలతో వండకూడదు.”


మీ ప్రథమ ఫలాల్లో మీ ప్రత్యేక కానుకలన్నిటిలో శ్రేష్ఠమైనవి యాజకులకు చెందుతాయి. మీ కుటుంబం మీద ఆశీర్వాదం ఉండేలా మీరు మొదట పిసికిన పిండిముద్దను యాజకులకు ఇవ్వాలి.


వాటిని ప్రథమ ఫలంగా యెహోవాకు అర్పించవచ్చు కాని, బలిపీఠం మీద ఇష్టమైన సువాసనగల దానిగా వాటిని అర్పించకూడదు.


“ ‘మీరు ప్రథమ ఫలాల భోజనార్పణ యెహోవా దగ్గరకు తీసుకువస్తే, క్రొత్త ధాన్యాన్ని దంచి అగ్నిలో వేయించి అర్పించాలి.


మీరు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడినుండి, రెండు ఓమెర్ల నాణ్యమైన పిండితో రెండు రొట్టెలను పులిసిన దానితో కాల్చి, యెహోవాకు అర్పించే ప్రథమ ఫలాల ప్రత్యేక అర్పణగా తీసుకురండి.


యాజకుడు రెండు గొర్రెపిల్లలను ప్రథమ ఫలాల రొట్టెలతో పాటు యెహోవా ఎదుట పైకెత్తి ప్రత్యేక అర్పణగా అర్పించాలి. అవి యాజకుని కోసం యెహోవాకు అర్పించే పరిశుద్ధ అర్పణలు.


ప్రజలు అర్పణలుగా తీసుకువచ్చే పశువులు, గొర్రెలు మేకల నుండి యాజకులకు చెందవలసిన వాటా: భుజం, లోపలి అవయవాలు, చెంపలు.


మీ ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం, ఒలీవ నూనెలలో ప్రథమ ఫలాలు, అలాగే గొర్రెబొచ్చు కత్తిరించినప్పుడు మొదటి నూలు వారికే ఇవ్వాలి.


మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న భూమి నేల నుండి మీరు ఉత్పత్తి చేసే అన్ని ఫలాలను తీసుకుని వాటిని బుట్టలో ఉంచండి, తర్వాత మీ దేవుడైన యెహోవా తన నామానికి నివాసంగా ఎన్నుకునే ప్రదేశానికి వెళ్లి,


ఆవు పెరుగును, గొర్రెల, మేకల పాలను, గొర్రెపిల్లల క్రొవ్వును, మేకపోతులను, పశువుల మంద, గొర్రెల మంద నుండి పెరుగు, పాలతో క్రొవ్విన గొర్రెపిల్లలను, మేకలను, బాషాను శ్రేష్ఠమైన పొట్టేళ్లను నాణ్యమైన గోధుమలను మీకిచ్చారు. మీరు ద్రాక్షరసంతో చేసిన మద్యాన్ని త్రాగారు.


Lean sinn:

Sanasan


Sanasan