Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




సంఖ్యా 11:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను?

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 కాగా మోషే యెహోవాతో యిట్లనెను–నీవేల నీ సేవకుని బాధించితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జనులందరి భారమును నామీద పెట్టనేల?

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 అప్పుడు మోషే యెహోవాతో ఇలా అన్నాడు. “నేను నీ సేవకుణ్ణి. నాపై ఇంత నిర్దయగా వ్యవహరించావెందుకు? నాపై ఇంత కోపంగా ఉన్నావెందుకు? ఈ ప్రజల భారాన్ని నాపై మోపావు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

11 మోషే యెహోవాను అడిగాడు, “యెహోవా, నీ సేవకుడనైన నాకు ఇంత కష్టం ఎందుకు కలిగించావు? నేనేమి పొరబాటు చేసాను? నీకు సంతోషం లేకుండేటట్టు నేను చేసింది ఏమిటి? ఈ ప్రజలందరి బాధ్యత నీవు నాకెందుకు ఇచ్చావు?

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 మోషే యెహోవాతో, “మీ సేవకునిపై ఈ కష్టం ఎందుకు తెచ్చారు? వీరందరి భారం నా మీద వేయకుండ మీ దృష్టిలో నేనెందుకు దయను పొందలేకపోయాను?

Faic an caibideil Dèan lethbhreac




సంఖ్యా 11:11
16 Iomraidhean Croise  

నేను దేవునితో ఇలా అంటాను: నన్ను దోషిగా భావించకండి, కాని నా మీద మీకున్న ఆరోపణలు నాకు చెప్పండి.


యెహోవా, మీరు పాపాలను లెక్కిస్తే, ప్రభువా, ఎవరు నిలవగలరు?


మీ సేవకున్ని తీర్పులోనికి తీసుకురాకండి, ఎందుకంటే సజీవులెవ్వరూ మీ దృష్టిలో నీతిమంతులు కారు.


అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టి, “ఈ ప్రజలతో నేనేం చేయాలి? వీరు దాదాపు నన్ను రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు” అన్నాడు.


మోషే యెహోవా దగ్గరకు తిరిగివెళ్లి, “ప్రభువా, ఈ ప్రజలమీదికి ఎందుకు ఇబ్బంది రప్పించారు? నన్ను ఇందుకే పంపించారా?


అయ్యో, నా తల్లీ, దేశమంతటితో పోరాటాలు, కలహాలు పెట్టుకునేవానిగా, నీవు నాకు జన్మనిచ్చావు! నేను అప్పు ఇవ్వలేదు, అప్పు తీసుకోలేదు, అయినా ప్రతిఒక్కరు నన్ను శపిస్తున్నారు.


అలాంటప్పుడు నా బాధ ఎందుకు అంతం కావడం లేదు? నా గాయం ఎందుకు నయం చేయలేనిది? మీ సహాయం నమ్మలేని వాగులా, ఎండిపోయే ఊటలా వంటిది.


“మీరు ఇలా అంటారు, ‘దేవునికి సేవ చేయడం వ్యర్థం, ఆయన ఆజ్ఞ ప్రకారం ప్రవర్తిస్తూ సైన్యాలకు అధిపతియైన యెహోవా ఎదుట దుఃఖా క్రాంతులై తిరుగుతూ ఉండి ప్రయోజనం ఏంటి?


మోషే ప్రతి కుటుంబంలోని ప్రజలు వారి డేరాల దగ్గర ఏడుస్తూ ఉండడం విన్నాడు. యెహోవా చాలా కోప్పడ్డారు మోషే బాధపడ్డాడు.


ఒకవేళ నాతో మీరు ఇలా వ్యవహరించ తలిస్తే దయచేసి నన్ను చంపేయండి; నా మీద మీకు దయ కలిగితే నా దురవస్థను నేను చూడకుండ నన్ను చంపేయండి” అని చెప్పాడు.


అన్నిటికంటే మించి సంఘాలన్నిటి గురించిన చింత అనుదినం నాకు కలుగుతుంది.


అయితే నేనొక్కడినే మీ సమస్యలను మీ భారాలను మీ వివాదాలను ఎలా తీర్చగలను?


Lean sinn:

Sanasan


Sanasan