Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




లేవీయకాండము 5:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 లేదా మనుష్యులెవరైనా అనాలోచితంగా మంచి గాని చెడు గాని చేస్తానని పొరపాటున ప్రమాణం చేసి, దాని గురించి తెలిసిన తర్వాత వారు అపరాధులు అని గ్రహిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనినయెడల, అది తెలిసిన తరువాతవాడు అపరాధియగును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 అలాగే ఎవరైనా తెలియకుండా తొందరపడి మంచైనా, చెడైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా, తెలియకుండా తొందరపడి ఏదైనా చేస్తానని ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా ఆ తరువాత తెలుసుకుని చేయకుండా ఉంటే ఆ విషయంలో అతడు అపరాధి అవుతాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

4 “లేక ఒక వ్యక్తి మంచిగాని చెడుగాని ఒకటి చేస్తానని తొందరపడి వాగ్దానం చేయవచ్చు. మనుష్యులు తొందరపడి చాలా వాగ్దానాలు చేస్తూంటారు. ఒకడు అలాంటి వాగ్దానంచేసి, దానిని మరిచిపోయి, మరల ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొన్నప్పుడు అతను దానిని చేయక పోతే అపరాధి అవుతాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 లేదా మనుష్యులెవరైనా అనాలోచితంగా మంచి గాని చెడు గాని చేస్తానని పొరపాటున ప్రమాణం చేసి, దాని గురించి తెలిసిన తర్వాత వారు అపరాధులు అని గ్రహిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac




లేవీయకాండము 5:4
25 Iomraidhean Croise  

దావీదు సౌలు కుమారుడైన యోనాతానుతో యెహోవా ఎదుట చేసిన ప్రమాణం కారణంగా సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతును రాజు వారికి అప్పగించలేదు.


అతడు, “ఈ రోజు షాపాతు కుమారుడైన ఎలీషా మెడమీద అతని తల ఉంటే, దేవుడు నాకు చాలా కీడు చేయును గాక!” అన్నాడు.


వారు దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, అతని పెదవుల వెంట కాని మాటలు వచ్చాయి.


ఈ విధంగా యాజకుడు వారు చేసిన ఈ పాపాల్లో దేనికోసమైనా ప్రాయశ్చిత్తం చేస్తాడు, వారు క్షమించబడతారు. మిగిలిన అర్పణ, భోజనార్పణ మాదిరిగానే యాజకునికి చెందుతుంది.’ ”


లేదా ఒకవేళ వారు పొరపాటున మనుష్యులను అపవిత్రం చేసే దేనినైనా తాకితే, దాని గురించి తెలుసుకున్నా తర్వాత వారు అపరాధులు అవుతారు,


“ఆమె మ్రొక్కుబడి చేసుకున్న తర్వాత లేదా అవివేకంగా ప్రమాణం చేసిన తర్వాత ఆమె పెళ్ళి చేసుకుంటే,


కానీ ఆమె భర్త ఈ సంగతి తెలుసుకుని, అతడు ఆ మ్రొక్కుబడిని లేదా ఆమె అవివేకంగా చేసిన ప్రమాణాన్ని కానీ ఒప్పుకోక రద్దు చేస్తే యెహోవా ఆమెను క్షమిస్తారు.


కాబట్టి ఆమె ఏమి అడిగినా ఇస్తాను అని అతడు ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.


రాజు ఎంతో దుఃఖించాడు, కాని తనతో కూడ భోజనానికి కూర్చున్న అతిథులను బట్టి తాను చేసిన ప్రమాణం కోసం ఆమె కోరినట్లు చేయమని ఆదేశించాడు.


అతడు, “నీవు ఏది అడిగినా నేను ఇస్తాను, నా రాజ్యంలో సగం అడిగినా ఇచ్చేస్తాను!” అని ఆమెతో ఒట్టు పెట్టుకుని ప్రమాణం చేశాడు.


మరుసటిరోజు ఉదయం కొందరు యూదులు ఒక కుట్రపన్ని, తాము పౌలును చంపే అంతవరకు ఏమి తినకూడదు త్రాగకూడదని ఒట్టు పెట్టుకొన్నారు.


అందుకు వారు, “మేము ఏమి చేస్తున్నామో, నీవు చెప్పకుండా ఉంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడతాం! యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము మీ పట్ల దయతో నమ్మకంగా ఉంటాము” అని చెప్పారు.


తర్వాత యెహోషువ వారిని బ్రతకనివ్వడానికి వారితో సమాధాన ఒడంబడిక చేశాడు, దానిని సమాజ నాయకులు ప్రమాణం చేసి ఆమోదించారు.


నేను అమ్మోనీయుల దగ్గర నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు, నా ఇంటి నుండి నన్ను కలుసుకోడానికి మొదలు ఏది బయటకు వస్తే, అది యెహోవాకు చెందినది, దానిని నేను దహనబలిగా అర్పిస్తాను.”


వారికి మన కుమార్తెలను భార్యలుగా ఇవ్వలేం, ఎందుకంటే ఇశ్రాయేలీయులమైన మనం, ‘ఎవరైనా బెన్యామీనీయునికి తమ కుమార్తెను భార్యగా ఇస్తే వారు శాపగ్రస్తులు’ అని ప్రమాణం చేశాము.


వారికి మన కుమార్తెలను ఇవ్వవద్దని మనం యెహోవా పేరట శపథం చేశాం, మరి మిగిలిన వారికి భార్యలను ఎక్కడ చూడగలం?” అనుకున్నారు.


యెరుబ్-బయలు, అతని కుటుంబంపట్ల సత్యంగా యథార్థంగా ఉన్నారా? ఒకవేళ మీరు అలా ఉంటే, అబీమెలెకును బట్టి సంతోషించండి అతడు మిమ్మల్ని బట్టి సంతోషించును గాక!


ఆమె, “సైన్యాల యెహోవా, మీరు మీ సేవకురాలినైన కష్టాలను చూసి నన్ను గుర్తుంచుకుని, మీ సేవకురాలినైన నన్ను మరచిపోకుండా నాకు ఒక కుమారున్ని ఇస్తే, అతడు బ్రతికే దినాలన్ని యెహోవాకే ఇస్తాను, అతని తలపై క్షౌరపుకత్తి ఎప్పుడూ ఉపయోగించబడదు” అని అంటూ ఒక మ్రొక్కుబడి చేసింది.


రేపు ఉదయం తెల్లవారేసరికి అతని ఇంటివారిలో ఒక్కడు బ్రతికినా దేవుడు దావీదును తీవ్రంగా శిక్షించును గాక!” అని అన్నాడు.


Lean sinn:

Sanasan


Sanasan