Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




లేవీయకాండము 3:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 మీరు దాని తలపై చేయి ఉంచి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 తాను అర్పించుదాని తలమీద అతడు తన చెయ్యి ఉంచి ప్రత్యక్షపు గుడారము నెదుట దానిని వధింపవలెను. అహరోను కుమారులు బలిపీఠము చుట్టు దాని రక్తమును ప్రోక్షింపవలెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 తాను అర్పించబోయే దాని తల మీద అతడు తన చేతినుంచాలి. తరువాత దాన్ని ప్రత్యక్ష గుడారం ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కొడుకులు బలిపీఠం చుట్టూ దాని రక్తాన్ని చిలకరిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 సన్నిధి గుడారం ఎదుట అతడు దాని తలమీద చేయి పెట్టి, దానిని వధించాలి. దాని రక్తాన్ని అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ చిలకరిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 మీరు దాని తలపై చేయి ఉంచి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.

Faic an caibideil Dèan lethbhreac




లేవీయకాండము 3:8
17 Iomraidhean Croise  

మనమందరం గొర్రెల్లా దారి తప్పిపోయాము. మనలో ప్రతి ఒక్కరూ తనకిష్టమైన దారిలో తిరిగిపోయారు. యెహోవా మనందరి దోషాన్ని అతని మీద మోపారు.


మీరు దానిని బలిపీఠానికి ఉత్తర దిక్కున యెహోవా ఎదుట వధించాలి, యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చల్లుతారు.


దహనబలి పశువు యొక్క తలపై మీరు చేయి ఉంచాలి, అప్పుడు అది మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి మీ తరపున అంగీకరించబడుతుంది.


మీరు కోడెను యెహోవా ఎదుట వధించాలి, అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని తెచ్చి సమావేశ గుడారపు ద్వారం దగ్గర ఉన్న బలిపీఠం చుట్టూ చల్లుతారు.


మీరు దాని తలమీద చేయి పెట్టి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.


సమాజపెద్దలు యెహోవా ఎదుట కోడె తలమీద చేతులు ఉంచి యెహోవా ఎదుట కోడెను వధించాలి.


అతడు మేక తలపై చేయి ఉంచి, యెహోవా ఎదుట దహనబలిని వధించిన స్థలంలో దానిని వధించాలి. ఇది పాపపరిహారబలి.


ఆ కోడెను యెహోవా ఎదుట సమావేశ గుడారపు ద్వారం దగ్గరకు తీసుకురావాలి. దాని తలపై చేయి పెట్టి యెహోవా ఎదుట దానిని వధించాలి.


పరలోకం నుండి ఒక స్వరం ఇలా చెప్పడం వినపడింది: “ఈయన నా ప్రియ కుమారుడు; ఈయనయందు నేను ఎంతో ఆనందిస్తున్నాను.”


ఆ పరిచర్య ఏంటంటే: దేవుడు ప్రజల పాపాలను వారి మీద మోపకుండా క్రీస్తు ద్వారా లోకాన్ని తనతో సమాధానపరచుకున్నారు. ఆ సమాధాన సందేశాన్ని బోధించే పని మాకు అప్పగించారు.


మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా, పాపమెరుగని ఆయనను మన కోసం పాపంగా చేశారు.


ఆయన ద్వారానే మనం ఇద్దరం ఒక్క ఆత్మలో తండ్రి సన్నిధికి చేరగలుగుతున్నాము.


ఈ విధంగా ఇప్పుడు ఆయనలో ఉంచిన విశ్వాసం ద్వారా స్వేచ్ఛగా ధైర్యంగా దేవుని సమీపించగలము.


మనం పాపాల విషయంలో మరణించి నీతి కోసం జీవించేలా ఆయన, “మన పాపాలను తనపై ఉంచుకుని సిలువను మోసారు. ఆయన పొందిన గాయాల వల్ల మీరు స్వస్థత పొందారు.


Lean sinn:

Sanasan


Sanasan