Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




లేవీయకాండము 26:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 “ ‘మీ కోసం విగ్రహాలను తయారుచేసుకోవద్దు లేదా ఒక బొమ్మను గాని పవిత్రమైన రాయిని గాని నిలుపకూడదు, దాని ముందు తలవంచడానికి చెక్కిన రాయిని మీ భూమిలో పెట్టకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మీరు విగ్రహములను చేసికొనకూడదు. చెక్కిన. ప్రతిమనుగాని బొమ్మనుగాని నిలువపెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలుపకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 “మీరు విగ్రహాలను చేసుకోకూడదు. చెక్కిన ప్రతిమను గానీ దేవతా రాతి స్తంభాన్ని గానీ నిలబెట్టకూడదు. మీ దేశంలో మీరు మొక్కడానికి చెక్కిన రాతి బొమ్మను నిలబెట్టకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 “మీకోసం మీరు విగ్రహాల్ని చేసుకోవద్దు. విగ్రహాల్ని, జ్ఞాపక చిహ్నాల్ని నిలబెట్టవద్దు. మీరు మొక్కేందుకు మీ దేశంలో రాతి విగ్రహాలను నిలబెట్టవద్దు. ఎందుచేతనంటే, నేను మీ దేవుణ్ణి, యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 “ ‘మీ కోసం విగ్రహాలను తయారుచేసుకోవద్దు లేదా ఒక బొమ్మను గాని పవిత్రమైన రాయిని గాని నిలుపకూడదు, దాని ముందు తలవంచడానికి చెక్కిన రాయిని మీ భూమిలో పెట్టకూడదు. నేను మీ దేవుడనైన యెహోవాను.

Faic an caibideil Dèan lethbhreac




లేవీయకాండము 26:1
30 Iomraidhean Croise  

వారు ప్రతీ ఎత్తైన కొండమీద, ప్రతి పచ్చని చెట్టు క్రింద, పవిత్ర రాళ్లను, అషేరా స్తంభాలను నిలబెట్టారు.


తమ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలన్నీ విడిచిపెట్టి, తమ కోసం పోతపోసిన రెండు దూడలను, అషేరా స్తంభాన్ని చేసుకున్నారు. వారు నక్షత్రాలకు నమస్కరించి బయలును సేవించారు.


తమ ఎదుట నుండి యెహోవా వెళ్లగొట్టిన జనాల ఆచారాలను, ఇశ్రాయేలు రాజులు ప్రవేశపెట్టిన ఆచారాలను పాటించారు.


వారి క్షేత్రాలతో దేవునికి కోపం తెప్పించారు; వారు విగ్రహాలను పెట్టుకుని ఆయనకు రోషం పుట్టించారు.


వ్యర్థ విగ్రహాలనుబట్టి గొప్పలు చెప్తూ, చెక్కిన ప్రతిమలను పూజించేవారందరు సిగ్గుపడతారు సకల దేవుళ్ళారా, యెహోవా ఎదుట సాగిలపడండి!


“బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.


మీరు నాతో పాటు దేన్ని దేవుళ్ళుగా చేసుకోకూడదు; మీ కోసం వెండి దేవుళ్ళను గాని బంగారు దేవుళ్ళను గాని మీరు చేసుకోకూడదు.


మీరు వారి దేవుళ్ళ ముందు సాష్టాంగపడకూడదు వాటిని పూజించకూడదు, వారి ఆచారాలను పాటించకూడదు. మీరు వాటిని కూల్చివేసి వారి పవిత్ర రాళ్లను ముక్కలు చేయాలి.


“ఏ దేవుళ్ళ విగ్రహాలు చేసుకోకూడదు.


ఆ రోజున మనుష్యులు తాము పూజించడానికి తయారుచేసుకున్న వెండి విగ్రహాలను బంగారు విగ్రహాలను ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారు.


“ ‘విగ్రహాలవైపు తిరగకండి లేదా మీ కోసం అచ్చు వేసిన విగ్రహ దేవుళ్ళను చేసుకోకండి. నేను మీ దేవుడనైన యెహోవాను.


ఎందుకంటే ఇశ్రాయేలీయులు నా దాసులుగా ఉన్నారు, నేను ఈజిప్టు దేశం నుండి వారిని తీసుకువచ్చిన నా దాసులు. నేను మీ దేవుడనైన యెహోవాను.


అహరోను కుమారులలో ఎవరైతే సమాధానబలి రక్తాన్ని, క్రొవ్వును అర్పిస్తాడో అతడు ఆ కుడి తొడను తన వాటాగా తీసుకోవచ్చు.


ఆ దేశవాసులందర్నీ తరిమేయాలి. వారి రాతి విగ్రహాలను, కోట విగ్రహాలను నాశనం చేయాలి వారి క్షేత్రాలను పడగొట్టాలి.


“మనం దేవుని సంతానం కాబట్టి, మానవుడు తన నేర్పరితనంతో తయారుచేసి రూపమిచ్చిన బంగారు, వెండి లేదా రాయి బొమ్మలా దైవం ఉంటాడని మనం అనుకోవద్దు.


“శిల్పి చేతులతో చెక్కబడి పోతపోయబడిన యెహోవాకు అసహ్యమైన విగ్రహాలను రహస్య స్థలంలో దాచుకునే వారెవరైనా శాపగ్రస్తులు” అని అన్నప్పుడు ప్రజలంతా, “ఆమేన్!” అనాలి.


“బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.


అయితే మాంత్రికులు, వ్యభిచారులు, హంతకులు, విగ్రహాలను పూజించే వారు, అబద్ధాలు చెప్తూ వాటిని ప్రేమించే వారందరు ఆ పట్టణానికి బయట ఉండే కుక్కలు.


అక్కడ దానీయులు తమ కోసం ఆ విగ్రహాన్ని నిలుపుకున్నారు. దేశం చెరగా అయ్యేవరకు, మోషే కుమారుడు గెర్షోము యొక్క కుమారుడైన యోనాతాను, అతని కుమారులు దాను గోత్రానికి యాజకులుగా ఉన్నారు.


Lean sinn:

Sanasan


Sanasan