లేవీయకాండము 13:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 యాజకుడు వారి చర్మం మీద ఉన్న పుండును పరీక్షించాలి. ఆ పుండులో వెంట్రుకలు తెల్లబారి ఆ పుండు చర్మంలో లోతుగా ఉంటే అది కుష్ఠువ్యాధి యొక్క లక్షణము. యాజకుడు ఆ వారిని పరీక్షించి వారు ఆచారరీత్య అపవిత్రులని ప్రకటించాలి. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 ఆయాజకుడు వాని దేహచర్మమందున్న ఆ పొడను చూడగా ఆ పొడయందలి వెండ్రుకలు తెల్లబారినయెడలను, ఆ పొడ అతని దేహచర్మము కంటె పల్లముగా కనబడినయెడలను అది కుష్ఠు పొడ. యాజకుడు వాని చూచి అపవిత్రుడని నిర్ణయింపవలెను. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 అప్పుడు ఆ యాజకుడు అతని చర్మంపై ఉన్న వ్యాధిని పరీక్ష చేస్తాడు. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంపైన వెంట్రుకలు తెల్లగా మారి, ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పిస్తే అది అంటువ్యాధి. యాజకుడు అతణ్ణి పరీక్ష చేసిన తరువాత అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. Faic an caibideilపవిత్ర బైబిల్3 ఆ వ్యక్తి చర్మంమీది మచ్చను యాజకుడు పరిశీలించాలి. ఆ మచ్చలోని వెంట్రుకలు తెల్లబడినా, ఆ మచ్చ అతని చర్మంకంటె లోతుకు ఉన్నా అది కుష్ఠురోగమే. యాజకుడు ఆ వ్యక్తిని పరిశీలించటం ముగించగానే ఆ వ్యక్తి కుష్ఠురోగి అని యాజకుడు ప్రకటించాలి. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 యాజకుడు వారి చర్మం మీద ఉన్న పుండును పరీక్షించాలి. ఆ పుండులో వెంట్రుకలు తెల్లబారి ఆ పుండు చర్మంలో లోతుగా ఉంటే అది కుష్ఠువ్యాధి యొక్క లక్షణము. యాజకుడు ఆ వారిని పరీక్షించి వారు ఆచారరీత్య అపవిత్రులని ప్రకటించాలి. Faic an caibideil |