Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




లేవీయకాండము 1:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 మీరు కోడెను యెహోవా ఎదుట వధించాలి, అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని తెచ్చి సమావేశ గుడారపు ద్వారం దగ్గర ఉన్న బలిపీఠం చుట్టూ చల్లుతారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారము ఎదుటనున్న బలిపీఠముచుట్టు ఆ రక్తమును ప్రోక్షింపవలెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 తరువాత అతడు యెహోవా సమక్షంలో ఆ కోడె దూడని వధించాలి. యాజకులైన అహరోను కొడుకులు దాని రక్తాన్ని తీసుకు వచ్చి ప్రత్యక్ష గుడారం ప్రవేశద్వారం దగ్గర ఉన్న బలిపీఠం పైన చిలకరిస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

5 “ఆ వ్యక్తి యొక్క గిత్తను యెహోవా ఎదుట వధించాలి. అప్పుడు అహరోను కుమారులైన యాజకులు ఆ గిత్త రక్తాన్ని తీసుకొని రావాలి. సన్నిధి గుడారపు ద్వారం దగ్గర బలిపీఠం చుట్టూ ఆ రక్తాన్ని వారు చిలకరించాలి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 మీరు కోడెను యెహోవా ఎదుట వధించాలి, అప్పుడు యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని తెచ్చి సమావేశ గుడారపు ద్వారం దగ్గర ఉన్న బలిపీఠం చుట్టూ చల్లుతారు.

Faic an caibideil Dèan lethbhreac




లేవీయకాండము 1:5
25 Iomraidhean Croise  

పస్కా గొర్రెపిల్లలు వధించబడ్డాయి, లేవీయులు జంతువుల చర్మం తీస్తూ ఉండగా, యాజకులు వాటి రక్తాన్ని బలిపీఠం మీద చల్లారు.


సమావేశ గుడారపు ద్వారం దగ్గర యెహోవా సన్నిధిలో ఆ ఎద్దును వధించాలి.


నీవు పొట్టేలును వధించి దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూ చల్లాలి.


“నీవు ప్రత్యక్ష గుడారపు ద్వారం ఎదుట దహనబలిపీఠాన్ని ఉంచాలి;


అతడు అనేక దేశాలను ఆశ్చర్యపడేలా చేస్తారు, అతన్ని బట్టి రాజులు నోళ్ళు మూసుకుంటారు. ఎందుకంటే తమకు తెలియజేయబడని సంగతులను వారు చూస్తారు. తాము వినని వాటిని వారు గ్రహిస్తారు.


నేను మీమీద శుద్ధ జలాన్ని చిలకరిస్తాను, మీరు శుద్ధులవుతారు; మీ విగ్రహాల నుండి, అపవిత్రతలన్నిటి నుండి నేను మిమ్మల్ని శుద్ధి చేస్తాను.


అప్పుడు అతడు నాతో ఇలా అన్నాడు, “మనుష్యకుమారుడా, యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ బలిపీఠం కట్టిన తర్వాత దాని మీద రక్తం చిలకరించి దహనబలులు అర్పించడానికి నియమాలు ఇవి:


మీరు దానిని బలిపీఠానికి ఉత్తర దిక్కున యెహోవా ఎదుట వధించాలి, యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చల్లుతారు.


యాజకుడు దానిని బలిపీఠం దగ్గరకు తెచ్చి, దాని తలను విరిచి బలిపీఠం మీద దానిని కాల్చాలి; దాని రక్తం బలిపీఠం ప్రక్కనే పిండాలి.


“తర్వాత అతడు ప్రజల పాపపరిహారబలి కోసం మేకపోతును వధించాలి, దాని రక్తాన్ని అడ్డతెర లోపలికి తెచ్చి కోడె రక్తాన్ని చేసినట్టు ప్రాయశ్చిత్త మూత మీద, దాని ముందు చిలకరించాలి.


ఎందుకంటే, ఒక జీవికి ప్రాణం రక్తంలో ఉంది, బలిపీఠం మీద మీ కోసం ప్రాయశ్చిత్తం చేయడానికి నేను దానిని మీకిచ్చాను. ఇది ఒకరి జీవితానికి ప్రాయశ్చిత్తం చేసే రక్తము.


మీరు దాని తలమీద చేయి పెట్టి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.


మీరు అర్పించిన పశువు మీద చేయి ఉంచి, సమావేశ గుడారపు ద్వారం దగ్గర దానిని వధించాలి. యాజకులైన అహరోను కుమారులు దాని రక్తాన్ని బలిపీఠం చుట్టూరా చిలకరించాలి.


మీరు దాని తలపై చేయి ఉంచి సమావేశ గుడారం ముందు దానిని వధించాలి. అప్పుడు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూరా దాని రక్తం చల్లాలి.


వారు పాపపరిహారబలి యొక్క తలపై చేయి ఉంచి, దహనబలి చేసిన స్థలంలో దానిని వధించాలి.


వారు దాని తలపై చేయి వేసి దహనబలిని వధించిన స్థలంలో దానిని పాపపరిహారబలిగా వధించాలి.


యాజకుడు అప్పుడు కొంచెం రక్తాన్ని సమావేశ గుడారంలో యెహోవా ఎదుట ఉన్న పరిమళ వాసనగల ధూపవేదిక కొమ్ములపై పూయాలి. మిగిలిన ఎద్దు రక్తం అతడు సమావేశ గుడార ద్వారం దగ్గర దహనబలి యొక్క బలిపీఠం అడుగున పోయాలి.


ఏమి తీసుకుని నేను యెహోవా సన్నిధిలోకి రావాలి, మహోన్నతుడైన దేవుని ఎదుట నమస్కరించాలి? నేను దహనబలులను, ఏడాది దూడలను ఆయన సన్నిధికి తీసుకురావాలా?


“ఆవులలో, గొర్రెలలో, మేకలలో తొలిచూలును విడిపించకూడదు. అవి పవిత్రమైనవి. వాటి రక్తం బలిపీఠం చుట్టూ ప్రోక్షించి యెహోవాకు సువాసనగా ఉండే హోమంగా వాటి క్రొవ్వును కాల్చివేయాలి.


ప్రతిదినం ప్రతి యాజకుడు నిలబడి మతపరమైన విధులు నిర్వర్తిస్తాడు; పాపాలను ఎన్నటికిని తీసివేయలేని అదే బలులను పదే పదే అర్పిస్తాడు.


క్రొత్త నిబంధనకు మధ్యవర్తియైన యేసు దగ్గరకు, హేబెలు రక్తంకంటే ఉత్తమంగా మాట్లాడే చిందించబడిన రక్తం దగ్గరకు మీరు వచ్చారు.


తండ్రియైన దేవుని భవిష్యత్ జ్ఞానాన్నిబట్టి, మీరు యేసు క్రీస్తుకు విధేయులు కావడానికి ఆయన రక్తం ప్రోక్షణకు ఆయన మిమ్మల్ని ఎన్నుకుని తన ఆత్మ చేత పవిత్రులు చేశారు: మీకు కృపా సమాధానాలు సమృద్ధిగా కలుగును గాక.


ఎద్దును బలి అర్పించిన తర్వాత, వారు ఆ బాలున్ని ఏలీ దగ్గరకు తీసుకెళ్లి,


Lean sinn:

Sanasan


Sanasan