Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




విలాపవాక్యములు 4:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 నక్కలు కూడా తమ పిల్లలకు పాలివ్వడానికి తమ రొమ్ములిస్తాయి, కానీ నా ప్రజలు ఎడారిలో నిప్పుకోడిలా హృదయం లేనివారయ్యారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 నక్కలైనను చన్నిచ్చి తమ పిల్లలకు పాలిచ్చును నా జనుల కుమారి యెడారిలోని ఉష్టపక్షులవలె క్రూరురాలాయెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 నక్కలైనా చన్నిచ్చి తమ పిల్లలకు పాలు ఇస్తాయి. కాని నా ప్రజల కుమారి ఎడారిలోని నిప్పు కోడి అంత క్రూరంగా ఉంది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 నక్క సహితం తన పిల్లలకు పొదుగు అందిస్తుంది. నక్క సహితం తన పిల్లలను పాలు తాగనిస్తుంది. కాని నా ప్రజల కుమార్తె (ఇశ్రాయేలు స్త్రీలు) మాత్రం కఠినాత్మురాలు. ఆమె ఎడారిలో నివసించే ఉష్ట్రపక్షిలా వుంది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 నక్కలు కూడా తమ పిల్లలకు పాలివ్వడానికి తమ రొమ్ములిస్తాయి, కానీ నా ప్రజలు ఎడారిలో నిప్పుకోడిలా హృదయం లేనివారయ్యారు.

Faic an caibideil Dèan lethbhreac




విలాపవాక్యములు 4:3
14 Iomraidhean Croise  

ప్రొద్దున నా కుమారునికి పాలు ఇవ్వడానికి చూస్తే వాడు చనిపోయి ఉన్నాడు! అయితే నేను ఉదయకాలపు వెలుగులో గమనించి చూస్తే, వాడు నేను జన్మనిచ్చిన వాడు కాదు.”


దాని కోటలలో హైనాలు, దాని విలాసవంతమైన భవనాలలో నక్కలు నివసిస్తాయి. దాని కాలం ముగిసిపోతుంది దాని రోజులు పొడిగించబడవు.


దాని కోటలలో ముళ్ళచెట్లు, దాని దుర్గాలలో దురదగొండ్లు గచ్చపొదలు పెరుగుతాయి. అది తోడేళ్లకు నివాసంగా గుడ్లగూబలకు ఇల్లుగా ఉంటుంది.


“తల్లి తన చంటిబిడ్డను మరచిపోతుందా? తాను కన్న బిడ్డ మీద జాలిపడకుండ ఉంటుందా? తల్లియైన మరచిపోవచ్చు కాని నేను నిన్ను మరవను!


వారు తమ కుమారుల, కుమార్తెల మాంసాన్ని తినేలా చేస్తాను, వారు ఒకరి మాంసాన్ని మరొకరు తింటారు, ఎందుకంటే వారి శత్రువులు వారిని నాశనం చేయడానికి వారిని పూర్తిగా ముట్టడిస్తారు.’


“చూడండి, యెహోవా, ఆలోచించండి: మీరు ఇంతకుముందు ఎవరితోనైనా ఇలా వ్యవహరించారా? స్త్రీలు తమ సంతానాన్ని తినాలా, తాము పెంచిన పిల్లలను తినాలా? యాజకుడు, ప్రవక్త ప్రభువు యొక్క పరిశుద్ధాలయంలో చంపబడాలా?


కనికరంగల స్త్రీలు తమ సొంత చేతులతో తమ పిల్లలను వండుకున్నారు, నా ప్రజలు నాశనమైనప్పుడు, వారికి ఆహారం అయ్యారు.


కాబట్టి మీ మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను తింటారు, పిల్లలు తమ తల్లిదండ్రులను తింటారు. నేను మీకు శిక్ష విధించి మీలో మిగిలిన వారినందరిని గాలికి చెదరగొడతాను.


మీరు మీ కుమారుల మాంసాన్ని, మీ కుమార్తెల మాంసాన్ని తింటారు.


వారికి ఏ తెలివిలేదు, నమ్మకత్వం లేదు, ప్రేమ లేదు, జాలి లేదు.


Lean sinn:

Sanasan


Sanasan