Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




విలాపవాక్యములు 2:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 ప్రభువు తన కోపంతో సీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు! ఆయన ఇశ్రాయేలు వైభవాన్ని ఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు; ఆయన తన కోప్పడిన దినాన తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 ప్రభువు కోపపడి సీయోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు ఆయన ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశమునుండి భూమిమీదికి పడవేసెను కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసికొనకపోయెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 ప్రభువు తన కోపంతో సీయోను కుమారిని నల్లటి మేఘంతో పూర్తిగా కప్పేశాడు. ఆయన ఇశ్రాయేలు అందాన్ని ఆకాశం నుంచి భూమి మీదికి పడేశాడు. తాను కోపగించిన దినాన ఆయన తన పాదపీఠాన్ని గుర్తు చేసుకోలేదు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 సీయోను కుమార్తెను (యెరూషలేము) యెహోవా మేఘముతో కప్పి ఎలా మరుగు పర్చినాడో చూడుము. ఇశ్రాయేలు వైభవాన్ని ఆయన ఆకాశాన్నుండి భూమికి త్రోసివేశాడు. యెహోవాకు కోపం వచ్చిన రోజున ఇశ్రాయేలు ఆయన కాలిపీట అని కూడా ఆయన గుర్తు పెట్టు కోలేదు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 ప్రభువు తన కోపంతో సీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు! ఆయన ఇశ్రాయేలు వైభవాన్ని ఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు; ఆయన తన కోప్పడిన దినాన తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.

Faic an caibideil Dèan lethbhreac




విలాపవాక్యములు 2:1
28 Iomraidhean Croise  

“ఇశ్రాయేలూ, నీ ఉన్నతస్థలాల మీద నీ వైభవం గలవారు చంపబడ్డారు. బలవంతులు ఎలా పడిపోయారు కదా!


రాజైన దావీదు లేచి నిలబడి ఇలా అన్నాడు: “నా తోటి ఇశ్రాయేలీయులారా, నా ప్రజలారా, వినండి. మన దేవునికి పాదపీఠంగా యెహోవా నిబంధన మందసాన్ని ఉంచే మందిరాన్ని నేను నిర్మించాలని నా హృదయంలో అనుకున్నాను, దాన్ని కట్టడానికి సన్నాహాలు చేశాను.


“ఆయన నివాసస్థలానికి వెళ్దాం రండి, ఆయన పాదపీఠం ఎదుట ఆరాధిద్దాం రండి.


అతని యవ్వన దినాలను తగ్గించారు; అవమానంతో అతన్ని కప్పారు. సెలా


మన దేవుడైన యెహోవాను మహిమపరచండి ఆయన పాదపీఠం దగ్గర ఆరాధించండి; ఆయన పవిత్రులు.


మా పూర్వికులు మిమ్మల్ని స్తుతించిన సుందరమైన మా కీర్తిగల మందిరం అగ్నితో కాల్చబడింది, మా ఆహ్లాదకరమైనవన్నీ నాశనమైపోయాయి.


నీ స్నేహితులందరు నిన్ను మరచిపోయారు; వారు నీ గురించి ఏమీ పట్టించుకోరు. శత్రువు కొట్టినట్లుగా నేను నిన్ను కొట్టి, క్రూరమైనవానిలా నిన్ను శిక్షించాను, ఎందుకంటే నీ అపరాధం చాలా పెద్దది, నీ పాపాలు చాలా ఎక్కువ.


పట్టణం ఎలా నిర్జనమై ఉంది, ఒకప్పుడు జనంతో నిండి ఉండేది! ఆమె ఒక విధవరాలిలా ఎలా ఉంది, ఒకప్పుడు దేశాల మధ్య గొప్పదిగా ఉండేది! ఆమె రాజ్యాల మధ్య రాణిగా ఉండేది, కాని ఇప్పుడు బానిసగా మారింది.


“దారిన పోయే మీకందరికి, ఏమీ అనిపించడం లేదా? చుట్టూ తిరిగి చూడండి. యెహోవా నా మీదికి తన కోపాగ్ని దినాన తెచ్చిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?


యెహోవా తాను సంకల్పించింది చేశారు, చాలా కాలం క్రితం ఆయన శాసించిన, తన మాట ఆయన నెరవేర్చారు. ఆయన దయ లేకుండా నిన్ను పడగొట్టారు, శత్రువు నీ మీద సంతోషించేలా చేశారు, ఆయన నీ శత్రువుల కొమ్మును హెచ్చించారు.


బంగారం తన మెరుపును ఎలా కోల్పోయింది, మంచి బంగారం ఎలా మొద్దుబారిపోయింది! ప్రతి వీధి మూలలో ప్రశస్తమైన రాళ్ల వంటి రత్నాలు చెల్లాచెదురుగా ఉన్నాయి.


యెహోవా తన కోపాన్ని పూర్తిగా చల్లార్చారు. ఆయన తన తీవ్రమైన కోపాన్ని కుమ్మరించాడు. ఆయన సీయోనులో అగ్నిని రప్పించారు, అది దాని పునాదులను దహించివేసింది.


“ ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: నేను ఉగ్రతతో బలమైన గాలిని, కోపంతో వడగండ్లు కుండపోత వర్షాన్ని పంపి దానిని పడగొడతాను.


అయితే మహా కోపంతో అది పెరికి వేయబడి నేల మీద పారవేయబడింది. తూర్పు గాలి వీచగా దాని పండ్లు వాడిపోయాయి; బలమైన దాని కొమ్మలు అగ్నిలో పడి కాలిపోయాయి.


ఇశ్రాయేలు ప్రజలకు ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: మీకు గర్వకారణంగా, మీ కళ్ళకు ఆనందాన్ని ఇచ్చేదిగా, మీరు అభిమానించే నా పరిశుద్ధాలయాన్ని నేను అపవిత్రం చేయబోతున్నాను. మీరు వెనుక విడిచిపెట్టిన మీ కుమారులు, కుమార్తెలు కత్తివేటుకు కూలిపోతారు.


ఈజిప్టు కాడిని నేను విరిచినప్పుడు తహ్పన్హేసులో పగలే చీకటి కమ్ముతుంది; దాని బల గర్వం అణచివేయబడుతుంది. దానిని మబ్బులు క్రమ్ముతాయి దాని కుమార్తెలు బందీగా వెళ్తారు.


అది దట్టమైన చీకటి ఉండే దినం, అది కారు మబ్బులు గాఢాంధకారం ఉండే దినం, పర్వతాలమీద ఉదయకాంతి ప్రసరించినట్టు, బలమైన మహా గొప్ప సైన్యం వస్తుంది, అలాంటివి పూర్వకాలంలో ఎన్నడూ లేవు, ఇకమీదట రాబోయే తరాలకు ఉండవు.


ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు. నీలో జరిగిన అద్భుతాలు సొదొమలో జరిగి ఉంటే అది ఈనాటి వరకు నిలిచి ఉండేది.


ఓ కపెర్నహూమా, నీవు ఆకాశానికి ఎత్తబడతావా? లేదు, నీవు పాతాళంలోనికి దిగిపోతావు.


దానికి ఆయన, “సాతాను ఆకాశం నుండి మెరుపులా పడడం చూశాను.


ఆమె దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకున్నారని, తన మామ, తన భర్త చనిపోయారని తెలుసుకొని, “ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని అంటూ తన కుమారునికి ఈకాబోదు అని పేరు పెట్టింది.


“దేవుని మందసాన్ని శత్రువులు స్వాధీనం చేసుకోవడం వలన, ఇశ్రాయేలీయులలో నుండి మహిమ వెళ్లిపోయింది” అని ఆమె చెప్పింది.


Lean sinn:

Sanasan


Sanasan