4 అతడు వారికిలా ఆజ్ఞాపించాడు. “ఈ పట్టణానికి పడమటి వైపున దాన్ని పట్టుకోడానికి మీరు పొంచి ఉండాలి, పట్టణానికి బాగా దూరం వెళ్ళిపోకుండా మీరు సిద్ధంగా ఉండాలి.
4 యెహోషువ వారికి ఇలా ఆజ్ఞాపించాడు: “నేను మీతో చెప్పేది జాగ్రత్తగా వినండి. పట్టణం వెనుక ప్రాంతంలో మీరు దాక్కోవాలి. దాడి చేయాల్సిన సమయంకోసం కనిపెట్టి ఉండాలి. పట్టణానికి మరీ దూరంగా వెళ్లకండి. కనిపెడ్తూ, సిద్ధంగా ఉండండి.
రాజు రాత్రివేళ లేచి తన అధికారులతో, “మనకు వ్యతిరేకంగా అరామీయులు చేసేది చెప్తాను వినండి, మనం ఆకలితో అలమటిస్తున్నామని వారికి తెలుసు; కాబట్టి ‘వారు ఖచ్చితంగా బయటకు వస్తారు, అప్పుడు వారిని ప్రాణాలతో పట్టుకుని, నగరంలో చొరబడదాం’ అని అనుకుని వారు శిబిరం విడిచిపెట్టి వెళ్లి పొలాల్లో దాక్కున్నారు” అని చెప్పాడు.
అయితే మీరు వారికి అనుమతి ఇవ్వకండి, ఎందుకంటే సుమారు నలభై కన్నా ఎక్కువ మంది అతని కోసం పొంచి ఉన్నారు. పౌలును చంపే వరకు ఏమి తినకూడదని వారు ఒట్టు పెట్టుకొన్నారు. ఇప్పుడు వారు మీ దగ్గర అనుమతి కోసం ఎదురుచూస్తూ, సిద్ధంగా ఉన్నారు” అని చెప్పాడు.
ఇశ్రాయేలు వారందరు తామున్న చోట్ల నుండి బయలుదేరి బయల్-తామారు దగ్గర బారులు తీరారు. అప్పుడు మాటున ఉన్న ఇశ్రాయేలీయులు తమ స్థలం నుండి గెబాకు పడమటి వైపు నుండి దాడి చేశారు.