Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 6:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 వారు మానకుండా చేస్తున్న బూరధ్వని మీరు విన్నప్పుడు, సైన్యమంతా పెద్దగా కేకలు వేయాలి; అప్పుడు ఆ పట్టణపు గోడ కూలిపోతుంది, సైన్యంలో ప్రతి ఒక్కరు పైకి ఎక్కి నేరుగా లోపలికి వెళ్తారు.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరలధ్వని వినునప్పుడు జనులందరు ఆర్భాటముగా కేకలు వేయవలెను, అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ యెదుటికి చక్కగా ఎక్కుదురు అనెను.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేస్తూండగా మీరు ఆ బూరల ధ్వని విన్నప్పుడు ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి, అప్పుడు ఆ పట్టణ ప్రాకారం కూలిపోతుంది. యోధులు ప్రతి ఒక్కరూ ఎవరి ముందు వారు చక్కగా ఎక్కుతూ దాని మీద దాడి చెయ్యాలి” అన్నాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

5 యాజకులు బూరలతో పెద్ద శబ్దం చేయాలి. ఆ శబ్దం నీవు వినగానే ప్రజలందర్నీ కేకలు వేయమని చెప్పు. మీరు ఇలా చేయగానే పట్టణం యొక్క గోడలు కూలిపోతాయి. అప్పుడు మీ ప్రజలు సరాసరి పట్టణం లోనికి వెళ్లిపోవాలి.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 వారు మానకుండా చేస్తున్న బూరధ్వని మీరు విన్నప్పుడు, సైన్యమంతా పెద్దగా కేకలు వేయాలి; అప్పుడు ఆ పట్టణపు గోడ కూలిపోతుంది, సైన్యంలో ప్రతి ఒక్కరు పైకి ఎక్కి నేరుగా లోపలికి వెళ్తారు.”

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 6:5
17 Iomraidhean Croise  

బూరధ్వని అంతకంతకు అధికమయ్యింది, మోషే మాట్లాడుతుండగా దేవుని స్వరం అతనికి జవాబిస్తున్నది.


మోయాబూ, నీ ఎత్తైన కోటలను ఆయన పడగొడతారు. వాటిని నేలకు అణగద్రొక్కి ధూళిలో పడవేస్తారు.


గోపురాలు కూలిపోయే గొప్ప వధ జరిగే రోజున, ఎత్తైన ప్రతి పర్వతం మీద, ఎత్తైన ప్రతి కొండమీద నీటి వాగులు ప్రవహిస్తాయి.


అన్ని వైపుల నుండి దానిమీద కేకలు వేయండి! అది లొంగిపోతుంది, దాని బురుజులు పడిపోయాయి, దాని గోడలు కూలిపోయాయి. ఇది యెహోవా ప్రతీకారం కాబట్టి, దాని మీద ప్రతీకారం తీర్చుకోండి; అది ఇతరులకు చేసినట్లు దానికి చేయండి.


విశ్వాసం ద్వారానే ఇశ్రాయేలు సైన్యం యెరికో గోడల చుట్టూ ఏడు రోజులు తిరుగగా, యెరికో గోడలు కూలిపోయాయి.


ఏడవసారి తిరుగుతూ ఉండగా, యాజకులు బూరధ్వని చేయగానే యెహోషువ, “అరవండి! యెహోవా మీకు ఈ పట్టణాన్ని ఇచ్చారు!


బూరలు ఊదగానే సైన్యం కేకలు వేసింది. బూర శబ్దానికి పురుషులు పెద్దగా అరవడంతో గోడ కూలిపోయింది; కాబట్టి అందరు నేరుగా లోపలికి ప్రవేశించి వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు.


మందసం ముందు ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరలు పట్టుకుని నడవాలి. ఏడవ రోజున యాజకులు బూరలు ఊదుతూ పట్టణం చుట్టూ ఏడుసార్లు తిరగాలి.


కాబట్టి నూను కుమారుడైన యెహోషువ యాజకులను పిలిచి వారితో, “మీరు యెహోవా నిబంధన మందసాన్ని ఎత్తుకుని దాని ముందు ఏడుగురు యాజకులు బూరలు పట్టుకుని నడవాలి” అని ఆజ్ఞ ఇచ్చాడు.


మాటులో ఉన్నవారు గిబియాలో అకస్మాత్తుగా చొరబడి వారు పట్టణంలోని వారందరిని ఖడ్గంతో చంపారు.


దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెష్షయి తనకు చెప్పిన ప్రకారం బయలుదేరి వెళ్లాడు. అయితే అతడు యుద్ధభూమి దగ్గరకు వచ్చేసరికి సైన్యమంతా బారులు తీరి నినాదాలు చేస్తూ యుద్ధభూమికి వస్తున్నారు.


అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యూదా ప్రజలు లేచి జయధ్వనులు చేస్తూ లోయవరకు ఎక్రోను ద్వారాల వరకు ఫిలిష్తీయులను వెంటాడారు. చనిపోయిన ఫిలిష్తీయులు షరాయిము దారిలో గాతు ఎక్రోను పట్టణాల వరకు పడి ఉన్నారు.


యెహోవా నిబంధన మందసం శిబిరంలోనికి రాగానే ఇశ్రాయేలీయులందరు భూమి దద్దరిల్లేంత పెద్దగా కేకలు వేశారు.


Lean sinn:

Sanasan


Sanasan