Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 23:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “దృఢంగా ఉండండి; మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా పాటించండి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించుటకు మనస్సు దృఢము చేసికొని, యెడమకుగాని కుడికిగాని దానినుండి తొలగిపోక

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 కాబట్టి మీరు నిలకడగా ఉండి మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసినదాన్నంతా పాటిస్తూ దాని ప్రకారం ప్రవర్తించండి. మనస్సు దృఢం చేసుకుని, దానినుండి ఎడమకు గాని కుడికి గాని తొలగిపోవద్దు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

6 “యెహోవా మనకు ఆజ్ఞాపించిన వాటన్నింటికీ విధేయులుగా ఉండేందుకు మీరు జాగ్రత్తపడాలి. మోషే ధర్మశాస్రంలో వ్రాయబడిన వాటన్నింటికీ విధేయులుగా ఉండండి. ఆ ధర్మశాస్త్రానికి విముఖులు కావద్దు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “దృఢంగా ఉండండి; మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా జాగ్రత్తగా పాటించండి.

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 23:6
14 Iomraidhean Croise  

నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి, ఆయన మార్గాలను అనుసరిస్తే అంటే మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడినట్లుగా, ఆయన శాసనాలు, ఆజ్ఞలు, చట్టాలు, నిబంధనలు అనుసరిస్తే నీవు ఏ పని మొదలుపెట్టినా ఎక్కడకు వెళ్లినా అన్నిటిలో వివేకంగా ప్రవర్తిస్తావు.


నీచమైన దేనినైనా సరే నేను నా కళ్లెదుట ఉంచను. విశ్వాసం లేనివారు చేసేది నాకు అసహ్యం; అందులో నేను పాలుపంచుకోను.


నేను మీ ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే మీరే నాకు బోధించారు.


“ఒక విలుకాడు బాణాలు వేయడానికి విల్లును సిద్ధం చేసుకున్నట్లు వారు అబద్ధాలు చెప్పడానికి తమ నాలుకను సిద్ధం చేసుకుంటారు; వారి అబద్ధం వల్లనే వారు దేశంలో బలవంతులయ్యారు కాని నాకు నమ్మకస్థులుగా ఉండి కాదు. వారు ఒక పాపం తర్వాత మరొక పాపం చేస్తారు; వారు నన్ను గుర్తించరు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


మెలకువగా ఉండండి; విశ్వాసంలో నిలకడగా ఉండండి; ధైర్యం కలిగి బలవంతులై ఉండండి.


నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మీరు పాటించేలా చూడండి; దానికి ఏది కలపవద్దు, దానిలో నుండి ఏది తీసివేయవద్దు.


తన తోటి ఇశ్రాయేలీయునికన్నా తాను గొప్పవాడినని భావించడు, ధర్మశాస్త్రం నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోడు. అప్పుడు అతడు, అతని సంతానం ఇశ్రాయేలు రాజ్యాన్ని ఎక్కువకాలం పరిపాలిస్తారు.


ఇతర దేవుళ్ళను అనుసరిస్తూ, వారిని సేవిస్తూ, ఈ రోజు నేను మీకు ఇచ్చే ఆజ్ఞల నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవద్దు.


కాబట్టి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేయడంలో జాగ్రత్త వహించండి; కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు.


మీరు పాపంతో పోరాడటంలో మీ రక్తం చిందేంతగా ప్రతిఘటించలేదు.


అయితే పిరికివారు, అవిశ్వాసులు, దుష్టులు, హంతకులు, లైంగిక నైతికత లేనివారు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరు అగ్ని గంధకాలతో మండుతున్న సరస్సు పాలవుతారు. ఇది వారికి రెండవ మరణం” అని చెప్పారు.


Lean sinn:

Sanasan


Sanasan