Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 23:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లుగా మీ కోసం పోరాడుతున్నారు కాబట్టి మీలో ఒకడు వెయ్యిమందిని ఓడించాడు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటచొప్పున తానే మీకొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు వేయిమందిని తరుమును

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన మాటప్రకారం తానే మీ తరఫున యుద్ధం చేసేవాడు కాబట్టి మీలో ఒక్కడు వెయ్యిమందిని తరుముతాడు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

10 యెహోవా సహాయంతో ఇశ్రాయేలీయులలో ఒక్కడు వేయిమంది శత్రువులను ఓడించగలిగాడు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడటంవల్లనే ఇది జరిగింది. ఇలా చేస్తానని యెహోవా వాగ్దానం చేసాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 మీ దేవుడైన యెహోవా తాను వాగ్దానం చేసినట్లుగా మీ కోసం పోరాడుతున్నారు కాబట్టి మీలో ఒకడు వెయ్యిమందిని ఓడించాడు.

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 23:10
27 Iomraidhean Croise  

దావీదు దగ్గర ఉన్న పరాక్రమ యోధుల పేర్లు ఇవే: తక్మోనీయుడైన యోషేబ్-బష్షెబెతు ముగ్గురిలో మొదటివాడు. అతడు ఒకే యుద్ధంలో తన ఈటెతో ఎనిమిదివందల మందిని చంపాడు.


వారు యుద్ధ సమయంలో దేవునికి మొరపెట్టారు కాబట్టి దేవుడు వారికి సహాయం చేసి ఆ హగ్రీయీలను, వారితో ఉన్నవారందరిని వారి చేతికి అప్పగించారు. వారు ఆయన మీద నమ్మకముంచారు కాబట్టి ఆయన వారి ప్రార్థన అంగీకరించారు.


ఇంకా చాలామంది శత్రువులను చంపారు ఎందుకంటే ఆ యుద్ధం దేవునిది. చెరకు వెళ్లేవరకు వారు అక్కడే నివసించారు.


యెహోవా, నాతో వాదించే వారితో వాదించండి; నాతో పోరాడే వారితో పోరాడండి.


సైన్యాల యెహోవా మనతో ఉన్నారు; యాకోబు దేవుడు మనకు కోట. సెలా


యెహోవా మీ కోసం యుద్ధం చేస్తారు; మీరు మౌనంగా ఉంటే చాలు.”


పర్వతంపై ఉన్న ఒక జెండా కర్రలా కొండమీద ఉన్న జెండాలా మీరు మిగిలేవరకు ఒకరు గద్దించగా మీలో వెయ్యిమంది పారిపోతారు; అయిదుగురు గద్దించగా మీరందరు పారిపోతారు.”


శత్రువులను మీరు వెంటాడుతారు. వారు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు.


మీలో అయిదుగురు వందమందిని, వందమంది పదివేలమందిని తరుముతారు, మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గం ద్వార కూలుతారు.


ఆ రోజున, యెహోవా యెరూషలేములో నివసించేవారిని కాపాడతారు, అప్పుడు వారిలో బలహీనులు దావీదులా, దావీదు వంశీయులు దేవుని వంటివారిగా, వారి ముందు నడిచే యెహోవా దూతలా ఉంటారు.


అయితే ఈ విషయాల గురించి మనమేమి చెప్పాలి? ఒకవేళ దేవుడే మన వైపు ఉండగా, మనకు విరోధి ఎవడు?


అతడు వారితో ఇలా అంటారు: “ఇశ్రాయేలు విను: ఈ రోజు మీరు మీ శత్రువుల మీదికి యుద్ధానికి వెళ్తున్నారు. మీరు మూర్ఛపోవద్దు, భయపడవద్దు, జడియవద్దు, వారికి భయపడకండి.


శత్రువులతో యుద్ధం చేసేది, మిమ్మల్ని రక్షించేది మీ దేవుడైన యెహోవాయే! ఆయన మీతో ఉన్నాడు.”


శత్రువులు మీ మీదికి లేచినప్పుడు, యెహోవా వారిని మీ ముందు ఓడిపోయేలా చేస్తారు. వారు ఒకవైపు నుండి మీ దగ్గరకు వస్తారు కాని నీ దగ్గరి నుండి ఏడు వైపుల్లో పారిపోతారు.


వారికి నీవు భయపడకు; నీ దేవుడైన యెహోవా మీ పక్షంగా యుద్ధం చేస్తారు.”


“నేను వారి నుండి నా ముఖాన్ని దాచుకుంటాను, వారి అంతం ఎలా ఉంటుందో చూస్తాను; ఎందుకంటే వారొక దుర్బుద్ధి కలిగిన తరం, నమ్మకద్రోహులైన పిల్లలు.


తమ ఆశ్రయదుర్గం వారిని అప్పగిస్తేనే తప్ప, యెహోవా వారిని వదిలివేస్తేనే తప్ప, ఒక్కడు వేయిమందిని తరుమగలడా? ఇద్దరు పదివేలమందిని పారిపోయేలా చేయగలరా?


ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలు కోసం పోరాడారు కాబట్టి యెహోషువ ఈ రాజులందరినీ, వారి దేశాలను ఒకే దండయాత్రలో జయించాడు.


కాబట్టి మీ దేవుడైన యెహోవాను ప్రేమించడంలో చాలా జాగ్రత్తగా ఉండండి.


మీ దేవుడైన యెహోవా మీ కోసం ఈ దేశాలన్నిటికి చేసినదంతా మీరే చూశారు. మీ కోసం పోరాడినది మీ దేవుడైన యెహోవాయే.


అక్కడే అతనికి గాడిద పచ్చి దవడ ఎముక ఒకటి దొరికింది. అతడు దాన్ని చేతపట్టుకుని దానితో వేయిమందిని చంపేశాడు.


ఏహూదు తర్వాత అనాతు కుమారుడైన షమ్గరు వచ్చాడు, పశువులను తోలే ములుకోలుతో ఆరువందలమంది ఫిలిష్తీయులను హతం చేశాడు. అతడు కూడా ఇశ్రాయేలీయులను కాపాడాడు.


యోనాతాను తన ఆయుధాలను మోసే యువకునితో, “ఈ సున్నతిలేనివారి సైనిక స్థావరాల మీదికి వెళ్దాం రా, బహుశా యెహోవా మన కోసం కార్యం చేయవచ్చు. ఎక్కువ మంది నుండైనా కొద్దిమంది నుండైనా రక్షించడానికి యెహోవాకు ఏది అడ్డు కాదు” అని అన్నాడు.


Lean sinn:

Sanasan


Sanasan