Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 2:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

5 చీకటి పడుతుండగా పట్టణ ద్వారం మూసివేసే సమయంలో వారు వెళ్లిపోయారు. వారు ఏ మార్గాన వెళ్లారో నాకు తెలియదు. మీరు త్వరగా వెళ్తే వారిని పట్టుకోవచ్చు” అని చెప్పింది.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

5 వారెక్కడనుండి వచ్చిరో నేనెరుగను; చీకటిపడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుష్యులు వెలుపలికి వెళ్లిరి, వారెక్కడికిపోయిరో నేనెరుగను; మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా పట్టుకొందురు

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

5 వాళ్ళెక్కడ నుండి వచ్చారో నాకు తెలీదు, చీకటి పడేటప్పుడు కోట తలుపులు మూసే వేళ వాళ్ళు బయటికి వెళ్లిపోయారు, వాళ్ళెక్కడికి వెళ్ళారో నాకు తెలీదు, మీరు వాళ్ళను తొందరగా తరిమితే పట్టుకుంటారు” అని చెప్పింది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

5 సాయంకాలం, పట్టణ ద్వారాలు మూసివేసే వేళ వాళ్లు వెళ్లిపోయారు. వాళ్లు ఎక్కడికి వెళ్లిందీ నాకు తెలియదు. కానీ ఒకవేళ మీరు త్వరగా వెళ్తే మీరు వాళ్లను పట్టుకోవచ్చేమో.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

5 చీకటి పడుతుండగా పట్టణ ద్వారం మూసివేసే సమయంలో వారు వెళ్లిపోయారు. వారు ఏ మార్గాన వెళ్లారో నాకు తెలియదు. మీరు త్వరగా వెళ్తే వారిని పట్టుకోవచ్చు” అని చెప్పింది.

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 2:5
11 Iomraidhean Croise  

సబ్బాతుకు ముందు రోజు యెరూషలేము గుమ్మాలపై సాయంకాలపు నీడలు పడగానే యెరూషలేము తలుపులు మూసివేసి విశ్రాంతి దినం గడిచేవరకు తలుపులు తెరవకూడదని నేను ఆజ్ఞాపించాను. సబ్బాతు దినాన ఏ బరువులు లోపలికి రాకుండా నా మనుష్యుల్లో కొందరిని కాపలా ఉంచాను.


నీ దగ్గరకు దేశాల సంపద తీసుకురావడానికి, జయోత్సవంతో వారి రాజులను నడిపించడానికి, నీ ద్వారాలు రాత్రింబగళ్ళు మూసివేయకుండా నిత్యం తెరిచే ఉంటాయి.


యెహోవా ప్రకటిస్తున్నదేంటంటే, “ఆ రోజుల్లో, ఆ సమయంలో, ఇశ్రాయేలీయుల అపరాధాల కోసం వెదకుతారు, కానీ అవి కనబడవు, అలాగే యూదా కోసం వెదకుతారు, కానీ అవి దొరకవు, మిగిలి ఉన్నవారిని నేను క్షమిస్తాను.


నదికి ఇరువైపులా అన్ని రకాల పండ్లచెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు గోధుమ రంగులోకి మారవు, వాడిపోతాయి వాటి కొమ్మలపై ఎల్లప్పుడూ పండ్లు ఉంటాయి. దేవాలయం నుండి ప్రవహించే నది ద్వారా వాటికి నీరు అందుతుంది కాబట్టి ప్రతి నెల క్రొత్త పంట ఉంటుంది. పండ్లు ఆహారంగా ఆకులు ఔషధంగా ఉపయోగపడతాయి.”


అయితే ఆమె ఆ ఇద్దరిని తీసుకెళ్లి దాచిపెట్టి, వారి కోసం వచ్చిన వారితో, “అవును, నా దగ్గరకు మనుష్యులు వచ్చారు, కానీ వారెక్కడి నుండి వచ్చారో నాకు తెలియదు.


(కాని నిజానికి ఆమె వారిని మిద్దె మీదికి తీసుకెళ్లి అక్కడ వరుసగా పేర్చి ఉన్న జనపకట్టెల్లో దాచిపెట్టింది.)


కాబట్టి రాజు మనుషులు ఆ గూఢచారులను పట్టుకోడానికి యొర్దాను రేవులకు వెళ్లే మార్గంలో వెళ్లారు. వారు బయటకు వెళ్లిన వెంటనే ద్వారం మూసివేశారు.


ఏ రోజు దాని ద్వారాలు మూయబడవు ఎందుకంటే అక్కడ రాత్రి ఉండదు.


సౌలు దావీదును పట్టుకోడానికి దూతలను పంపినప్పుడు మీకాలు, “అతడు అనారోగ్యంగా ఉన్నాడు” అని చెప్పింది.


Lean sinn:

Sanasan


Sanasan