Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 2:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

14 అందుకు వారు, “మేము ఏమి చేస్తున్నామో, నీవు చెప్పకుండా ఉంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడతాం! యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము మీ పట్ల దయతో నమ్మకంగా ఉంటాము” అని చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

14 అందుకు ఆ మనుష్యులు ఆమెతో–నీవు మా సంగతి వెల్లడి చేయనియెడల మీరు చావకుండునట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమిచ్చెదము, యెహోవా ఈ దేశమును మాకిచ్చునప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసెదమనిరి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

14 అందుకు వారు ఆమెతో “నీవు మా సంగతి వెల్లడి చేయకపోతే మీరు చావకుండా ఉండేలా మీ ప్రాణాలకు బదులు మా ప్రాణాలిస్తాం, యెహోవా ఈ దేశాన్ని మాకిచ్చేటప్పుడు నిజంగా మేము నీకు ఉపకారం చేస్తాం” అన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

14 ఆ మనుష్యలు ఒప్పుకున్నారు. “మీ ప్రాణాల కోసం మా ప్రాణాలు ఇస్తాము. మేము చేస్తున్న పని గూర్చి ఎవ్వరితో చెప్పకు. తర్వాత మీ దేశాన్ని యెహోవా మాకు ఇచ్చినప్పుడు మేము నీకు దయ చూపిస్తాము. నీవు మా మాట నమ్ము” అని వాళ్లు చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

14 అందుకు వారు, “మేము ఏమి చేస్తున్నామో, నీవు చెప్పకుండా ఉంటే మీ ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డుపెడతాం! యెహోవా ఈ దేశాన్ని మాకు ఇచ్చినప్పుడు మేము మీ పట్ల దయతో నమ్మకంగా ఉంటాము” అని చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 2:14
18 Iomraidhean Croise  

ఇప్పుడు మీరు నా యజమాని పట్ల దయను, నమ్మకత్వాన్ని చూపాలనుకున్నా, ఒకవేళ లేదు అనుకున్నా చెప్పండి. అప్పుడు నేను ఏ మార్గంలో వెళ్లాలో తెలుసుకుంటాను” అని అన్నాడు.


ఇశ్రాయేలు చనిపోయే సమయం సమీపించినప్పుడు, తన కుమారుడైన యోసేపును పిలిపించి, “నీ దృష్టిలో నేను దయ పొందినవాడనైతే, నా తొడ క్రింద చేయి పెట్టి, నా పట్ల మంచితనాన్ని, నమ్మకత్వాన్ని చూపుతావని ప్రమాణం చేయి. ఈజిప్టులో నన్ను పాతిపెట్టకు,


దావీదు యాబేషు గిలాదు ప్రజల దగ్గరకు దూతను పంపి, “మీ ప్రభువైన సౌలును పాతిపెట్టి అతని పట్ల మీకున్న దయ చూపించారు కాబట్టి యెహోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు.


యెహోవా మీకు తన దయను నమ్మకత్వాన్ని చూపించును గాక, మీరు చేసిన ఈ పనిని బట్టి నేను కూడా మీమీద అదే దయను చూపిస్తాను.


ఒకసారి దావీదు, “యోనాతాను బట్టి నేను దయ చూపించడానికి సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా?” అని అడిగాడు.


రాజు దారిన వెళ్తుండగా, ప్రవక్త రాజును పిలిచి, “మీ సేవకుడనైన నేను యుద్ధం మధ్యలోకి వెళ్లాను. అక్కడ ఒకడు ఒక బందీని తీసుకుని నా దగ్గరకు వచ్చి, ‘ఈ వ్యక్తిని చూసుకోండి. ఒకవేళ అతడు తప్పిపోతే, వాడి ప్రాణానికి బదులుగా నీ ప్రాణం పెట్టాలి. లేదా నీవు ఒక తలాంతు వెండి ఇవ్వాలి’ అని చెప్పాడు.


కీడు తలపెట్టేవారు తప్పిపోతారు? మేలు చేసేవారు, కృపా సత్యములను పొందుతారు.


నమ్మదగని స్నేహితులను కలిగి ఉన్నవాడు త్వరలోనే పతనానికి సమీపిస్తాడు, కాని ఒక స్నేహితుడు ఉన్నాడు సోదరుడి కంటే దగ్గరగా అంటిపెట్టుకుని ఉండేవాడు.


కనికరం చూపేవారు ధన్యులు, వారు కనికరం పొందుతారు.


ఆ అధిపతి, “ఈ సంగతిని నాకు చెప్పావని ఎవరికి చెప్పవద్దు” అని హెచ్చరించి ఆ యువకుడిని పంపించాడు.


రాహాబు ఇల్లు పట్టణ గోడమీద ఉంది కాబట్టి, ఆమె వారిని కిటికీ నుండి త్రాడుతో క్రిందకు దింపింది.


పట్టణం, దానిలో ఉన్నవన్నీ యెహోవా వలన శపించబడ్డాయి. అయితే మనం పంపిన దూతలను దాచిపెట్టిన వేశ్యయైన రాహాబును, ఆమెతో పాటు ఆమె ఇంట్లో ఉన్నవారిని మాత్రం మనం విడిచిపెట్టాలి.


ఆ దేశాన్ని వేగు చూసిన ఇద్దరు వ్యక్తులతో యెహోషువ ఇలా అన్నాడు: “మీరు వేశ్య ఇంటికి వెళ్లి మీరు ఆమెతో చేసిన ప్రమాణం ప్రకారం ఆమెను, ఆమెకు చెందిన వారందరినీ బయటకు తీసుకురండి.”


అయితే యెరికోకు వేగులవారిగా యెహోషువ పంపిన వారిని దాచిపెట్టింది కాబట్టి, వేశ్యయైన రాహాబును ఆమె కుటుంబంతో పాటు ఆమెకు సంబంధించిన వారందరినీ విడిచిపెట్టాడు; ఆమె ఈనాటికీ ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తుంది.


నీ దాసుడైన నా మీద దయ చూపించు, ఏంటంటే యెహోవా ఎదుట నీతో నిబంధన చేయడానికి నీవు నీ సేవకుడైన నన్ను రప్పించావు. నన్ను నీ తండ్రి చేతికి ఎందుకు అప్పగిస్తావు? నాలో తప్పు ఉంటే నీవే నన్ను చంపు!” అన్నాడు.


Lean sinn:

Sanasan


Sanasan