యెహోషువ 18:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 మనుష్యులు భూమిని పరిశీలించడానికి బయలుదేరేటప్పుడు యెహోషువ వారికి, “మీరు వెళ్లి భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను” అని చెప్పాడు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఆ మనుష్యులు లేచి ప్రయాణముకాగా యెహోషువ దేశ వివరమును వ్రాయుటకు వెళ్లబోవు వారితో–మీరు ఆ దేశములోబడి నడుచుచు దాని వివరమును వ్రాసి నాయొద్దకు తిరిగి రండి; అప్పుడు నేను షిలోహులో మీకొరకు యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేయించెద ననగా Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఆ మనుషులు బయలుదేరి వెళ్ళిపోయారు. దేశ వివరాలు రాయడానికి వెళ్తున్న వారితో యెహోషువ “మీరు వెళ్లి దేశమంతా తిరిగి దాని వివరం రాసి నా దగ్గరికి తిరిగి రండి, అప్పుడు నేను షిలోహులో యెహోవా సమక్షంలో మీకోసం చీట్లు వేస్తాను” అన్నాడు. Faic an caibideilపవిత్ర బైబిల్8 కనుక ఏర్పాటు చేయబడిన మనుష్యులు ఆ దేశంలో ప్రవేశించటం మొదలు పెట్టారు. ఆ దేశం యొక్క వివరాలను తయారు చేసి, వాటిని యెహోషువ దగ్గరకు తీసుకొని రావాలి అనేది వారి పథకం. కనుక యెహోషువ, “వెళ్లి దేశాన్ని పరిశీలించి, దాని వివరాలు తయారు చేయండి. అప్పుడు తిరిగి నా దగ్గరకు రండి. అప్పుడు మీకు ఏ భూమి రావాలి అనేది నేను నిర్ణయించేందుకు సహాయం చేయాల్సిందిగా యెహోవాను అడుగుతాను. ఇది మనం ఇక్కడ షిలోహులో చేద్దాం” అని వారితో చెప్పాడు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 మనుష్యులు భూమిని పరిశీలించడానికి బయలుదేరేటప్పుడు యెహోషువ వారికి, “మీరు వెళ్లి భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తిరిగి రండి. అప్పుడు నేను షిలోహులో యెహోవా సన్నిధిలో మీ కోసం చీట్లు వేస్తాను” అని చెప్పాడు. Faic an caibideil |
అప్పుడు సౌలు, “ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా, ఈ రోజు మీ దాసునికి నీవెందుకు సమాధానం చెప్పలేదు? ఒకవేళ నాలోగాని నా కుమారుడైన యోనాతానులో గాని లోపం ఉంటే ఊరీముతో, ఇశ్రాయేలు ప్రజల్లో దోషం ఉంటే తుమ్మీముతో జవాబు చెప్పండి” అని ప్రార్థించాడు. అప్పుడు సౌలు పేరిట యోనాతాను పేరిట చీటి వచ్చింది, ఇశ్రాయేలు ప్రజలు నిర్దోషులుగా తప్పించుకున్నారు.