Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 18:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోడానికి వెళ్లకుండా మీరు ఎంతకాలం వేచి ఉంటారు?

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను–మీపితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొన వెళ్లకుండ మీరెన్నాళ్లు తడవుచేసెదరు?

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు. “మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్లకుండా ఎంతకాలం వ్యర్థంగా గడుపుతారు?

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 కనుక ఇశ్రాయేలు ప్రజలతో యెహోషువ చెప్పాడు, “మీ దేశాన్ని తీసుకొనేందుకు మీరెందుకు ఇంత కాలం చూస్తూ ఊరుకున్నారు. మీ తండ్రుల దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకు ఇచ్చాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 కాబట్టి యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇలా అన్నాడు: “మీ పూర్వికుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశాన్ని స్వాధీనపరచుకోడానికి వెళ్లకుండా మీరు ఎంతకాలం వేచి ఉంటారు?

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 18:3
15 Iomraidhean Croise  

సోమరి చేతులు దరిద్రత తెస్తాయి, కాని శ్రద్ధగా పని చేసేవారి చేతులు ధనాన్ని తెస్తాయి.


సోమరి ఆకలి ఎన్నటికి తీరదు, కాని శ్రద్ధగా పని చేసేవారు తృప్తి చెందుతారు.


సోమరి వాని బాట ముండ్లకంచె, యథార్థవంతుల త్రోవ రహదారి.


మీ చేతికి వచ్చిన ఏ పనియైనా శక్తివంచన లేకుండా చేయండి. ఎందుకంటే మీరు వెళ్తున్న పాతాళంలో పని చేయడం గాని ప్రణాళిక వేయడం గాని లేదా తెలివి గాని జ్ఞానం గాని ఉండవు.


ఆ రోజున వారు యెరూషలేముతో, “సీయోనూ, భయపడకు; నీ చేతులను బలహీన పడనివ్వవద్దు.


దాదాపు అయిదు గంటలకు కూడా మరికొందరు ఏ పనిలేక ఖాళీగా సంతవీధిలో నిలబడి ఉన్నారని చూసి, ‘రోజంతా ఇక్కడ మీరు ఏ పనిలేక ఖాళీగా ఎందుకు నిలబడి ఉన్నారు?’ అని వారిని అడిగాడు.


మీరు పాడైపోయే ఆహారం కోసం కష్టపడకండి కానీ మనుష్యకుమారుడు మీకిచ్చే నిరంతరం నిలిచి ఉండే ఆహారం కోసం కష్టపడండి. ఎందుకంటే తండ్రియైన దేవుడు దానిని మీకు ఇవ్వడానికే ఆయనపై తన ఆమోద ముద్ర వేశారు” అని చెప్పారు.


దృఢంగా, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నేను వారసత్వంగా ఇస్తానని వారి పూర్వికులతో ప్రమాణం చేసిన దేశానికి నీవు వారిని నడిపిస్తావు.


యెహోషువ ముసలివాడయ్యాక, యెహోవా అతనితో, “నీవు ముసలివాడవయ్యావు, ఇంకా చాలా ప్రాంతాలు స్వాధీనం చేసుకోవలసి ఉంది.


కాని ఇంకా ఏడు ఇశ్రాయేలీయుల గోత్రాలకు వారి వారసత్వం కేటాయించబడలేదు.


ప్రతి గోత్రం నుండి ముగ్గురు వ్యక్తులను నియమించండి. ఒక్కొక్కరి వారసత్వం ప్రకారం భూమిని పరిశీలించి దాని వివరాలు వ్రాసి నా దగ్గరకు తీసుకురావడానికి నేను వారిని పంపుతాను. అప్పుడు వారు నా దగ్గరకు తిరిగి వస్తారు.


వారు జవాబిస్తూ, “పదండి, వారి మీద దాడి చేద్దాం! ఆ ప్రాంతాన్ని చూశాం, అది చాలా బాగుంది. ఇంకా వేచి ఉండడం ఎందుకు? వెళ్లి స్వాధీనం చేసుకోవడానికి ఆలస్యం చేయవద్దు,


Lean sinn:

Sanasan


Sanasan