Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 17:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 అందుకు యోసేపు సంతతివారు, “ఈ కొండసీమ మాకు సరిపోదు. మైదాన ప్రాంతంలో అంటే బేత్-షానులో దాని చుట్టూ ఉన్న స్థావరాలలో యెజ్రెయేలు లోయలో ఉంటున్న కనానీయులందరికీ ఇనుప రథాలున్నాయి” అన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 అందుకు యోసేపు పుత్రులు–ఆ మన్యము మాకుచాలదు; అదియుగాక పల్లపుచోటున నివసించు కనానీయులకందరికి, అనగా బేత్షెయానులోనివారికిని దాని పురములలోని వారికిని యెజ్రెయేలు లోయలోని వారికిని ఇనుప రథములున్నవనిరి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 అందుకు యోసేపు వంశం వారు “ఆ కొండ ప్రాంతం మాకు చాలదు, లోయ ప్రాంతంలో ఉంటున్న కనానీయులందరికీ అంటే బేత్ షెయానులో, దాని గ్రామాల్లో యెజ్రెయేలు లోయలో ఉన్న వాళ్లకు ఇనుప రథాలు ఉన్నాయి” అన్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

16 యోసేపు ప్రజలు, “నిజమే, ఎఫ్రాయిము కొండ దేశం మాకు చాలదు. కానీ కనానీ ప్రజలు నివసిస్తున్న ప్రదేశం ప్రమాదకరమయింది. వారు నైపుణ్యంగల యుద్ధ వీరులు. మరియు బెత్‌షియనులోను, ఆ ప్రాంతంలోని చిన్న పట్టణాలన్నింటిలోను వారికి బలమైన ఆయుధాలు, ఇనుప రథాలు ఉన్నాయి. పైగా యెజ్రెయేలు లోయలోకూడ వాళ్ళున్నారు” అని చెప్పారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 అందుకు యోసేపు సంతతివారు, “ఈ కొండసీమ మాకు సరిపోదు. మైదాన ప్రాంతంలో అంటే బేత్-షానులో దాని చుట్టూ ఉన్న స్థావరాలలో యెజ్రెయేలు లోయలో ఉంటున్న కనానీయులందరికీ ఇనుప రథాలున్నాయి” అన్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 17:16
20 Iomraidhean Croise  

అంతలో ఆకాశం మబ్బులతో చీకటిగా మారింది, గాలి వీచింది, భారీ వర్షం కురవడం మొదలయ్యింది. అహాబు రథమెక్కి యెజ్రెయేలుకు వెళ్లాడు.


యెహోవా హస్తం ఏలీయాను బలపరచగా అతడు తన నడుము బిగించుకుని, అహాబు కంటే ముందే పరుగెత్తుకొని వెళ్లి యెజ్రెయేలు చేరుకున్నాడు.


కొంతకాలం తర్వాత, యెజ్రెయేలు వాడైన నాబోతుకు చెందిన ద్రాక్షతోటకు సంబంధించి ఒక సంఘటన జరిగింది. యెజ్రెయేలులో సమరయ రాజైన అహాబు భవనానికి సమీపంగా ఒక ద్రాక్షతోట ఉంది.


“అంతేకాక యెజెబెలు గురించి యెహోవా ఇలా చెప్తున్నారు: ‘యెజ్రెయేలు ప్రాకారం దగ్గరే యెజెబెలును కుక్కలు తింటాయి.’


తానాకుకు, మెగిద్దోకు యెజ్రెయేలు దిగువన ఉన్న సారెతాను తర్వాత ఉన్న బేత్-షాను ప్రాంతం అంతా, బేత్-షాను నుండి ఆబేల్-మెహోలా యొక్మీము అవతలి వరకు అహీలూదు కుమారుడైన బయనా అధికారి;


యెజెబెలును యెజ్రెయేలు ప్రాంతంలో కుక్కలు తింటాయి, ఎవరూ ఆమెను సమాధి చేయరు.’ ” తర్వాత అతడు తలుపు తెరిచి పరుగెత్తాడు.


‘ఈమె యెజెబెలు’ అని ఎవరూ అనుకోకుండ ఈమె శవం యెజ్రెయేలు పొలంలో నేలమీది పేడలా అవుతుంది.”


అయితే ఆ రోజులు రాబోతున్నాయి” అంటూ యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “అమ్మోనీయుల రబ్బాకు వ్యతిరేకంగా నేను యుద్ధధ్వని చేసినప్పుడు; అది శిథిలాల దిబ్బ అవుతుంది, దాని చుట్టుప్రక్కల గ్రామాలు అగ్నికి ఆహుతి అవుతాయి. అప్పుడు ఇశ్రాయేలు దాన్ని వెళ్లగొట్టిన వారిని వెళ్లగొడుతుంది,” అని యెహోవా అంటున్నారు.


యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ


ఇశ్శాఖారు, ఆషేరులలో మనష్షేకు బేత్-షాను, ఇబ్లెయాము, దోరు, ఎన్-దోరు, తానాకు, మెగిద్దో ప్రజలు, వారి చుట్టూ ఉన్న స్థావరాలు కూడా ఉన్నాయి (జాబితాలో మూడవది నఫోతా).


యెహోషువ, “ఒకవేళ మీరు చాలామంది ఉండి ఎఫ్రాయిం కొండ ప్రాంతం మీకు ఇరుకుగా అనిపిస్తే అడవిలోకి వెళ్లి, పెరిజ్జీయులు రెఫాయీయుల దేశంలో మీ కోసం భూమిని ఖాళీ చేసుకోండి” అని వారికి చెప్పాడు.


యెహోషువ యోసేపు గోత్రాలతో అనగా ఎఫ్రాయిం మనష్షేలతో, “మీరు చాలామంది ఉన్నారు, మీరు చాలా బలవంతులు. మీకు ఒక్క భాగమే కాదు,


అడవులతో ఉన్న ఆ కొండ మీదే. కాబట్టి దానిని నరకండి; అప్పుడు ఆ ప్రదేశం మీది అవుతుంది. కనానీయులకు ఇనుప రథాలు ఉన్నా వారు బలవంతులైనా మీరు వారిని వెళ్లగొట్టగలరు” అన్నాడు.


వారి భూభాగంలో ఇవి ఉన్నాయి: యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము


యెహోవా యూదా మనుష్యులతో ఉన్నారు కాబట్టి వారు కొండ సీమను స్వాధీనం చేసుకున్నారు, కానీ మైదాన ప్రాంతాల్లో ఉన్న వారి దగ్గర ఇనుప రథాలు ఉండినందుకు వారిని తరుమలేకపోయారు.


సీసెరా హరోషెత్-హగ్గోయిము నుండి కీషోను వాగువరకు తన సైన్యమంతటిని, తన తొమ్మిది వందల ఇనుప రథాలను పిలిపించుకున్నాడు.


అతనికి తొమ్మిది వందల ఇనుప రథాలున్నాయి, అతడు ఇరవై సంవత్సరాలు ఇశ్రాయేలీయులను క్రూరంగా హింసించాడు, కాబట్టి వారు సహాయం కోసం యెహోవాను వేడుకొన్నారు.


మిద్యానీయులందరు, అమాలేకీయులందరు, ఇతర తూర్పున ఉన్న ప్రజలందరూ కలిసివచ్చి యొర్దాను దాటి యెజ్రెయేలు లోయలో బస చేశారు.


ఫిలిష్తీయులు తమ సైన్యాన్నంతా సమకూర్చుకొని ఆఫెకులో దిగారు; ఇశ్రాయేలీయులు యెజ్రెయేలులోని నీటి ఊట ప్రక్కన బసచేశారు.


Lean sinn:

Sanasan


Sanasan