Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 10:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

12 యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు: “సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో, చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

12 యెహోవా ఇశ్రాయేలీయుల యెదుట అమోరీయులను అప్పగించిన దినమున, ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను– సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువులమీద పగతీర్చుకొనువరకు సూర్యుడు నిలిచెను చంద్రుడు ఆగెను. అను మాట యాషారు గ్రంథములో వ్రాయబడి యున్నది గదా.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

12 యెహోవా ఇశ్రాయేలీయులకు అమోరీయులను అప్పగించిన ఆ రోజున, ఇశ్రాయేలీయులు వింటుండగా యెహోషువ యెహోవాకు ఈ విధంగా ప్రార్థన చేశాడు, “సూర్యుడా, నీవు గిబియోనులో నిలిచిపో. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలిచిపో.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

12 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు: “ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు, ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

12 యెహోవా అమోరీయులను ఇశ్రాయేలీయులకు అప్పగించిన రోజున, యెహోషువ ఇశ్రాయేలీయుల సమక్షంలో యెహోవాతో ఇలా అన్నాడు: “సూర్యుడా, గిబియోనుపై నిలిచిపో, చంద్రుడా, అయ్యాలోను లోయ పైగా ఆగిపో.”

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 10:12
29 Iomraidhean Croise  

నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్-బోషెతు మనుష్యులతో కలిసి మహనయీములో నుండి బయలుదేరి గిబియోనుకు వెళ్లారు.


హిజ్కియా, “నీడ పది అంకెలు ముందుకు వెళ్లడం సులభమే. కాబట్టి నీడ పది అంకెలు వెనుకకు వెళ్లునట్లు చేయండి” అన్నాడు.


అప్పుడు యెషయా ప్రవక్త యెహోవాకు ప్రార్ధించాడు. ఆహాజు చేయించిన గడియారపు పలక మీద నీడ పది అంకెలు వెనుకకు పోయేటట్టు యెహోవా చేశారు.


అందుకు యెషయా, “యెహోవా చెప్పిన మాట నెరవేరుస్తారని ఆయన నీకు ఇచ్చిన సూచన ఇదే: గడియారం మీద నీడ పది అంకెలు ఇప్పుడు ముందుకు వెళ్లాలా లేదా వెనుకకు వెళ్లాలా?” అన్నాడు.


బెరీయా, షెమ. వీరు అయ్యాలోనులో నివసిస్తున్నవారి కుటుంబాలకు పెద్దలు, గాతు పట్టణస్థులను వెళ్లగొట్టారు.


జోరహు, అయ్యాలోను, హెబ్రోను. ఇవన్నీ యూదా, బెన్యామీనులో కోటగోడలు గల పట్టణాలు ఉన్నాయి.


ఆయన సూర్యుని ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాల కాంతిని కనబడకుండ చేస్తారు.


సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించండి. మెరిసే నక్షత్రాల్లారా, మీరంతా ఆయనను స్తుతించండి.


అయినా వాటి స్వరం భూమి అంతటికి, వాటి మాటలు భూదిగంతాలకు వెళ్తాయి. దేవుడు ఆకాశంలో సూర్యునికి డేరా వేశారు.


పగలు మీదే. రాత్రి కూడా మీదే. వెలిగే నక్షత్రాలు మీవే! సూర్యున్ని మీరే చేశారు.


నిజంగా తన పనిని తన ఆశ్చర్యకరమైన పనిని అపూర్వమైన తన పని చేయడానికి ఆయన పెరాజీము అనే కొండమీద లేచినట్లుగా యెహోవా లేస్తారు. గిబియోను లోయలో ఆయన రెచ్చిపోయినట్లు రెచ్చిపోతారు.


ఆహాజు ఎండ గడియారం మీద సూర్యకాంతి వలన ముందుకు జరిగిన నీడ మళ్ళీ పది మెట్లు వెనుకకు వెళ్లేలా నేను చేస్తాను.’ ” కాబట్టి సూర్యకాంతి ముందుకు జరిగిన మెట్లలో పది మెట్లు మరలా వెనుకకు జరిగింది.


నీ సూర్యుడికపై అస్తమించడు. నీ చంద్రుడు క్షీణించడు. యెహోవా నీకు నిత్యమైన వెలుగుగా ఉంటారు, నీ దుఃఖ దినాలు అంతమవుతాయి.


అదే సంవత్సరం అంటే, యూదారాజు సిద్కియా ఏలుబడిలో నాల్గవ సంవత్సరం అయిదవ నెలలో, గిబియోనుకు చెందిన అజ్జూరు కుమారుడైన హనన్యా ప్రవక్త యెహోవా మందిరంలో యాజకులు ప్రజలందరి సమక్షంలో నాతో ఇలా అన్నాడు,


“దేవదారు వృక్షమంత ఎత్తుగా, అయినా నేను వారి సింధూర వృక్షమంత బలంగా ఉన్న, అమోరీయులను వారి ఎదుట ఉండకుండా నేను నాశనం చేశాను. నేను పైనున్న వారి ఫలాన్ని, క్రిందున్న వారి వేరును నాశనం చేశాను.


“ఆ రోజున,” అంటూ ప్రభువైన యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, మధ్యాహ్నమే సూర్యుడు అస్తమించేలా, పట్ట పగటివేళ భూమికి చీకటి కమ్మేలా చేస్తాను.


కాని, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు; ఆయన ఎదుట లోకమంతా మౌనం వహించాలి.


ఎగిరే నీ బాణాల కాంతికి నీ ఈటె తళతళ మెరుపుకు సూర్యచంద్రులు తమ ఆకాశంలో స్థానాల్లో నిలిచిపోతాయి.


సర్వజనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసం విడిచి వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”


నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే,


మీరు ఆకాశం వైపు కళ్ళెత్తి ఆకాశ సైన్యాలైన సూర్యచంద్ర నక్షత్రాలను చూసిన వాటిచే ఆకర్షించబడి, మీ దేవుడైన యెహోవా ఆకాశం క్రింద సమస్త దేశాల కోసం పంచి ఇచ్చిన వాటికి నమస్కరించి వాటికి సేవచేయకుండ మీరు జాగ్రత్తపడండి.


ప్రజలు తమ శత్రువులపై పూర్తి విజయం సాధించే వరకు, సూర్యుడు నిలిచిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు, అని యాషారు వ్రాసిన వీరుల గ్రంథంలో వ్రాయబడినట్లుగా జరిగింది. సూర్యుడు ఆకాశం మధ్యలో ఆగి, దాదాపు ఒక రోజు ఆలస్యమయ్యాడు.


షయల్బీను, అయ్యాలోను, ఇత్లా,


అయ్యాలోను, గాత్-రిమ్మోను వాటి పచ్చికబయళ్లతో పాటు మొత్తం నాలుగు పట్టణాలు.


తర్వాత ఎలోను చనిపోయాడు, జెబూలూను ప్రదేశంలో అయ్యాలోనులో పాతిపెట్టబడ్డాడు.


నక్షత్రాలు ఆకాశం నుండి పోరాడాయి, తమ ఆకాశమార్గాల్లో నుండి సీసెరాతో విరుద్ధంగా పోరాడాయి.


సమూయేలు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా ఆ రోజే ఉరుములను వర్షాన్ని పంపారు. అప్పుడు ప్రజలందరు యెహోవాకు సమూయేలుకు ఎంతో భయపడ్డారు.


ఆ రోజు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు చంపి చాలా అలసిపోయారు.


Lean sinn:

Sanasan


Sanasan