Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యెహోషువ 1:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 యెహోవా మీకు సహాయం చేసినట్టు, ఆయన వారికి విశ్రాంతినిచ్చే వరకు, వారు కూడా మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకునే వరకు, మీరు కూడా వారికి సహాయం చేయాలి. ఆ తర్వాత, మీరు తిరిగివెళ్లి, యెహోవా సేవకుడైన మోషే యొర్దానుకు తూర్పున సూర్యోదయం వైపున మీకిచ్చిన మీ స్వాస్థ్యాన్ని మీరు ఆక్రమించుకోవచ్చు.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకును విశ్రాంతి దయచేయువరకు, అనగా మీ దేవుడైన యెహోవావారికిచ్చు దేశమును స్వాధీనపరచుకొనువరకు మీరును సహాయము చేయవలెను. అప్పుడు తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడైన మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశమునకు మీరు తిరిగి వచ్చి దాని స్వాధీనపరచుకొందురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 నది దాటి, యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకూ విశ్రాంతి దయచేసే వరకూ, అంటే మీ దేవుడైన యెహోవా వారికిచ్చే దేశాన్ని స్వాధీనపరచుకొనే వరకూ మీరూ సహాయం చేయాలి. ఆ తరువాతే తూర్పున యొర్దాను ఇవతల యెహోవా సేవకుడు మోషే మీకిచ్చిన మీ స్వాస్థ్యమైన దేశంలోకి మీరు తిరిగి వచ్చి దాన్ని స్వంతం చేసుకుంటారు.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

15 విశ్రాంతి కోసం యెహోవా మీకు ఒక స్థలం ఇచ్చాడు. మీ సోదరుల కోసం కూడా యెహోవా అలాగే చేస్తాడు. అయితే యెహోవా దేవుడు వారికి ఇస్తున్న దేశాన్ని మీ సోదరులు స్వాధీనం చేసుకొనేంతవరకు మీ సోదరులకు మీరు సహాయం చేయాలి. అప్పుడు యొర్దానుకు తూర్పున ఉన్న మీ దేశానికి మీరు వెళ్లిపోవచ్చు. యెహోవా సేవకుడు మోషే మీకు ఇచ్చిన దేశం అది.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 యెహోవా మీకు సహాయం చేసినట్టు, ఆయన వారికి విశ్రాంతినిచ్చే వరకు, వారు కూడా మీ దేవుడైన యెహోవా వారికి ఇస్తున్న దేశాన్ని స్వాధీనపరచుకునే వరకు, మీరు కూడా వారికి సహాయం చేయాలి. ఆ తర్వాత, మీరు తిరిగివెళ్లి, యెహోవా సేవకుడైన మోషే యొర్దానుకు తూర్పున సూర్యోదయం వైపున మీకిచ్చిన మీ స్వాస్థ్యాన్ని మీరు ఆక్రమించుకోవచ్చు.”

Faic an caibideil Dèan lethbhreac




యెహోషువ 1:15
15 Iomraidhean Croise  

ఒక్క అవయవం బాధపడితే దాంతో పాటు అన్ని అవయవాలు బాధపడతాయి. ఒక అవయవం గౌరవం పొందితే, దాంతో పాటు మిగిలిన అవయవాలన్ని ఆనందిస్తాయి.


అది ఇతరులను అగౌరపరచదు, స్వార్థం లేనిది, త్వరగా కోప్పడదు, తప్పులను జ్ఞాపకం ఉంచుకోదు.


నా సహోదరీ సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడ్డారు. అయితే మీ స్వాతంత్ర్యాన్ని శరీరాశలను నెరవేర్చడానికి ఉపయోగించకుండా, ప్రేమ కలిగి వినయంతో ఒకరికొకరు సేవ చేసుకోండి.


ఒకరి భారాలను ఒకరు మోయండి, ఈ విధంగా మీరు క్రీస్తు ధర్మాన్ని నెరవేరుస్తారు.


ఆ సమయంలో నేను యొర్దాను తూర్పున నివసిస్తున్న గోత్రాలకు మీకు ఇలా ఆజ్ఞాపించాను: “మీ దేవుడైన యెహోవా మీరు స్వాధీనం చేసుకోవడానికి మీకు ఈ దేశాన్ని ఇచ్చారు. అయితే మీలో ధృడమైనవారు, యుద్ధానికి సిద్ధపడినవారు ఇతర ఇశ్రాయేలీయులకు ముందుగా నది దాటాలి.


ఇశ్రాయేలూ, విను: ఇప్పుడు మీరు ఆకాశాన్నంటే ఎత్తైన గోడలున్న పెద్ద పట్టణాలు గల మీకన్నా గొప్ప బలమైన దేశాలను, స్వాధీనం చేసుకోవడానికి మీరు యొర్దాను దాటబోతున్నారు.


మీ సొంత పనులపై మాత్రమే ఆసక్తి చూపక, మీలో ప్రతి ఒక్కరు ఇతరుల పనులపై కూడా ఆసక్తి చూపించాలి.


యెహోవా సేవకుడైన మోషే చనిపోయిన తర్వాత యెహోవా నూను కుమారుడు, మోషే సహాయకుడైన యెహోషువతో ఇలా అన్నారు:


మీ భార్యలు, మీ పిల్లలు, మీ పశువులు యొర్దానుకు తూర్పున మోషే మీకిచ్చిన ప్రదేశంలో ఉండవచ్చు, అయితే యుద్ధానికి సిద్ధంగా ఉన్న మీ పోరాట పురుషులంతా, మీ తోటి ఇశ్రాయేలీయులకంటె ముందుగా దాటాలి.


అప్పుడు వారు యెహోషువకు ఇలా జవాబిచ్చారు, “నీవు మాకాజ్ఞాపించినదంతా మేము చేస్తాము. మమ్మల్ని ఎక్కడికి పంపితే అక్కడికి వెళ్తాము.


అప్పుడు యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రం వారిని పిలిపించి,


Lean sinn:

Sanasan


Sanasan