Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యోనా 1:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

2 “నీవు లేచి నీనెవె మహా పట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటించు, ఎందుకంటే దాని చెడుతనం నా దృష్టిలో ఘోరంగా ఉంది.”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

2 –నీనెవెపట్ట ణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నీనెవె మహా పట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

2 “నువ్వు లేచి నీనెవె మహాపట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటన చెయ్యి. ఆ నగరవాసుల దుర్మార్గం నా దృష్టికి ఘోరంగా ఉంది.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

2 “నీనెవె ఒక మహానగరం. అక్కడి ప్రజలు చేస్తున్న అనేక నీచ కార్యాలను గురించి నేను విన్నాను. కనుక నీవు ఆ నగరానికి వెళ్లి, వారు చేసే చెడు పనులు మానుకోమని చెప్పు.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

2 “నీవు లేచి నీనెవె మహా పట్టణానికి వెళ్లి దానికి వ్యతిరేకంగా ప్రకటించు, ఎందుకంటే దాని చెడుతనం నా దృష్టిలో ఘోరంగా ఉంది.”

Faic an caibideil Dèan lethbhreac




యోనా 1:2
24 Iomraidhean Croise  

అక్కడినుండి అతడు అష్షూరుకు వెళ్లి అక్కడ నీనెవె, రెహోబోత్-ఇర్, కలహు,


అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు.


అయితే యెహోవా ప్రవక్తయైన ఓదేదు అనే ఒకడు అక్కడ ఉన్నాడు. అతడు సమరయకు వస్తున్న సైన్యాన్ని కలుసుకోడానికి వెళ్లి వారితో ఇలా చెప్పాడు, “మీ పూర్వికుల దేవుడైన యెహోవాకు యూదా వారి మీద కోపం వచ్చి, వారిని మీ చేతికి అప్పగించారు. కానీ మీరు ఆకాశాన్నంటే క్రోధంతో వారిని చంపేశారు.


ఇలా ప్రార్థించాను: “నా దేవా, నా ముఖాన్ని మీ వైపు ఎత్తడానికి నాకు చాలా సిగ్గుగా, అవమానంగా ఉంది. మా పాపాలు మా తల కన్న ఎత్తుగా ఉన్నాయి, మా అపరాధం ఆకాశాన్ని అంటింది.


అప్పుడు అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగి వెళ్లిపోయాడు, నీనెవెకు తిరిగివెళ్లి అక్కడ ఉండిపోయాడు.


“గట్టిగా కేకలు వేయండి, ఆపకండి. బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి. నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి, యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.


“దేవుని పేరు నేనెత్తను, ఆయన నామాన్ని బట్టి ప్రకటించను” అని అనుకుంటే, అప్పుడది నా హృదయంలో అగ్నిలా మండుతుంది. నా ఎముకల్లో మూయబడిన అగ్ని! ఎంత కాలమని ఓర్చుకోను? విసుగొస్తుంది, చెప్పకుండా ఉండలేను.


వారిది తిరుగుబాటు స్వభావం కాబట్టి వారు విన్నా వినకపోయినా నేను చెప్పిన మాట వారికి తెలియజేయి.


అయితే వారి చెడు పనులన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటానని వారు గ్రహించరు. వారి పాపాలు వారిని చుట్టుముట్టాయి; అవి ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.


“నీవు మహా పట్టణమైన నీనెవెకు వెళ్లి నేను నీకు ఇచ్చే సందేశాన్ని ప్రకటించు.”


యోనా యెహోవా మాటకు లోబడి నీనెవెకు వెళ్లాడు; నీనెవె చాలా పెద్ద పట్టణం కాబట్టి దానిగుండా వెళ్లడానికి మూడు రోజుల పట్టింది.


అలాంటప్పుడు కుడి ఎడమలు తెలియని లక్ష ఇరవై వేలమంది మనుష్యులు ఎన్నో జంతువులు ఉన్న గొప్ప పట్టణమైన నీనెవె గురించి నేను చింతించకూడదా?” అన్నారు.


నేనైతే, యాకోబుకు అతని అతిక్రమాన్ని ఇశ్రాయేలుకు అతని పాపాన్ని తెలియజేయడానికి, యెహోవా ఆత్మను పొంది శక్తితో నింపబడి ఉన్నాను, న్యాయబుద్ధితో, బలంతో ఉన్నాను.


నీనెవెను గురించిన ప్రవచనం; ఎల్కోషీయుడైన నహూముకు ఇవ్వబడిన దర్శనాన్ని వివరించే గ్రంథమిది.


ఏదీ నిన్ను స్వస్థపరచలేదు; మీ గాయం ప్రాణాంతకమైనది. మీ గురించిన వార్త విన్నవారందరు మీ పతనాన్ని చూసి చప్పట్లు కొడతారు, ఎందుకంటే ప్రజలందరూ మీ అంతులేని క్రూరత్వాన్ని నీ క్రూరమైన హింసను అనుభవించిన వారే.


అయితే వారికి, అలాగే యూదేతరులకు మీరు సాక్షులుగా ఉండడానికి నన్ను బట్టి మీరు అధికారుల ఎదుటకు రాజుల ఎదుటకు కొనిపోబడతారు.


నీనెవె ప్రజలు యోనా ప్రకటించినప్పుడు అతని మాటలను విని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగారు. అయితే ఇప్పుడు యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నా ఆయన మాటలను వినని ఈ తరం వారి మీద నీనెవె న్యాయతీర్పు దినాన నేరం మోపుతారు.”


చూడండి మీ పొలాలను కోసిన పనివారికి ఇవ్వకుండా మోసంతో మీరు దాచిపెట్టిన వారి జీతాలు మొరపెట్టాయి. కోతపనివారి మొరలు సర్వశక్తిమంతుడైన ప్రభుని చెవులకు చేరాయి.


ఆమె చేసిన పాపాలు ఆకాశమంత ఎత్తుగా ఉన్నాయి కాబట్టి, దేవుడు ఆమె అతిక్రమాలను జ్ఞాపకం చేసుకున్నారు.


Lean sinn:

Sanasan


Sanasan