Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 9:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

22 ఇలా చెప్పు, “యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “ ‘మృతదేహాలు బహిర్భూమిలో పెంటలా, కోత కోసేవాని వెనుక పడి ఉన్న పనల్లా, వాటిని సేకరించడానికి ఎవరూ ఉండరు.’ ”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

22 యెహోవా వాక్కు ఇదే–నీవీమాట చెప్పుము–చేలమీద పెంటపడునట్లు పంట కోయు వాని వెనుక పిడికిళ్లు పడునట్లు ఎవడును సమకూర్చకుండ మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

22 యెహోవా చెప్పేదేమంటే “పొలాల్లో పేడ పడేలా, కోతపనివారి వెనక పనలు పడేలా మనుషుల శవాలు కూలుతాయి. వాటిని పోగు చేయడానికి ఎవరూ ఉండరు.”

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

22 “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము, పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి. పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.’”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

22 ఇలా చెప్పు, “యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “ ‘మృతదేహాలు బహిర్భూమిలో పెంటలా, కోత కోసేవాని వెనుక పడి ఉన్న పనల్లా, వాటిని సేకరించడానికి ఎవరూ ఉండరు.’ ”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 9:22
17 Iomraidhean Croise  

హిజ్కియా రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు.


“నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ మరుగు చేయక అన్నీ వారికి చూపించాను” అన్నాడు.


‘ఈమె యెజెబెలు’ అని ఎవరూ అనుకోకుండ ఈమె శవం యెజ్రెయేలు పొలంలో నేలమీది పేడలా అవుతుంది.”


జ్ఞానులను వారి యుక్తిలోనే ఆయన పట్టుకుంటారు, వంచకుల ఆలోచనలు తుడిచివేయబడతాయి.


ఎవరు మరొకరి ప్రాణాన్ని విడిపించలేరు వారి కోసం దేవునికి క్రయధనం చెల్లించలేరు.


వారు ఎన్-దోరు దగ్గర నశించారు నేల మీద పేడలా అయ్యారు.


ధనవంతుల ఆస్తి వారి యొక్క కోటగోడలు గల పట్టణం; వాని కళ్ళకు అది ఎక్కలేనంత ఎత్తైన గోడ.


సంపదను పొందడానికి ప్రయాసపడకండి; నీ స్వంత తెలివిని నమ్ముకోవద్దు.


కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద మండుతుంది; ఆయన వారి మీదికి తన చేయి చాచి వారిని కొడతారు. పర్వతాలు వణుకుతాయి, వీధుల్లో వారి శవాలు పెంటలా పడి ఉన్నాయి. ఇంత జరిగినా ఆయన కోపం చల్లారలేదు, ఆయన చేయి ఇంకా ఎత్తి ఉంది.


“వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.”


ఆ సమయంలో యెహోవాచేత చంపబడినవారు భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు ప్రతిచోటా ఉంటారు. వారి కోసం ఎవరూ దుఃఖించరు, వారి మృతదేహాలను సేకరించి పాతిపెట్టరు, అవి నేలమీద పెంటలా పడి ఉంటాయి.


కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “ఈ ప్రజల ముందు నేను అడ్డురాళ్లు వేస్తాను. తల్లిదండ్రులు పిల్లలు ఒకే విధంగా వారిపై పొరపాట్లు చేస్తారు; పొరుగువారు స్నేహితులు నశిస్తారు.”


అప్పుడు ఈ ప్రజల కళేబరాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి వాటిని భయపెట్టడానికి ఎవరూ ఉండరు.


వారు ప్రేమించి సేవించిన వారు అనుసరించిన, సంప్రదించిన పూజించిన సూర్యునికి చంద్రునికి ఆకాశమండలం లోని అన్ని నక్షత్రాలకు బహిర్గతమవుతారు. వారు పోగుచేయబడక, పాతిపెట్టబడక, నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటారు.


గాలికి కొట్టుకుపోయినట్లుగా కొట్టుకుపోతూ అపరాధులవుతారు, తమ బలాన్నే తమ దేవునిగా భావిస్తారు.”


“ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేశారు, కాబట్టి మనుష్యులందరి మీదికి నేను బాధను రప్పించగా వారు గ్రుడ్డివారిలా తడుముకుంటారు. వారి రక్తం దుమ్ములా, వారి మాంసం పెంటలా పారవేయబడుతుంది.


“నా శక్తి, నా చేతుల బలం ఈ సంపదను నాకు సంపాదించాయి” అని మీలో మీరు అనుకోవచ్చు.


Lean sinn:

Sanasan


Sanasan