Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 9:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

19 సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

19 మనము వలసబోతిమే సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసివచ్చెనే అని సీయోనులో రోదనధ్వని వినబడు చున్నది.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

19 “మనం నాశనమయ్యాం, చాలా అవమానానికి గురయ్యాం. వారు మన ఇళ్ళను కూలదోశారు. మనం దేశం విడిచి వెళ్ళాల్సివచ్చింది” అని సీయోనులో రోదన ధ్వని వినబడుతున్నది.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

19 “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన, ‘మేము నిజంగా నాశనమయ్యాము! మేము నిజంగా అవమానం పాలైనాము! మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

19 సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 9:19
20 Iomraidhean Croise  

ఆత్మసంతృప్తితో ఉన్న స్త్రీలారా, లేచి నా మాట వినండి; భద్రంగా ఉన్నారనే భావనలో ఉన్న కుమార్తెలారా, నేను చెప్పే మాట వినండి!


అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!


ఇశ్రాయేలు దాసుడా? పుట్టుకతోనే బానిసా? అలాంటప్పుడు అతడు దోపుడుసొమ్ము ఎందుకు అయ్యాడు?


చూడు! అతడు మేఘాల్లా ముందుకు సాగిపోతాడు, అతని రథాలు సుడిగాలిలా వస్తాయి, అతని గుర్రాలు గ్రద్దల కంటే వేగవంతమైనవి. అయ్యో మాకు శ్రమ! మేము నాశనం అయ్యాము!


విపత్తు తర్వాత విపత్తు వస్తున్నాయి; దేశం మొత్తం శిథిలావస్థలో ఉంది. వెంటనే నా గుడారాలు ధ్వంసమయ్యాయి, నా ఆశ్రయం క్షణంలో ధ్వంసమయ్యాయి.


మీ తోటి ఇశ్రాయేలీయులందరిని, ఎఫ్రాయిం ప్రజలందరినీ నేను నా దగ్గర నుండి తరిమివేసినట్టు మిమ్మల్ని తరిమివేస్తాను.’


కానీ వారు కోపం రెచ్చగొడుతుంది నన్నా? వారు తమకు అవమానం కలిగేలా, తమకు తాము హాని చేసుకోవడం లేదా? అని యెహోవా అడుగుతున్నారు.


“ ‘ప్రతిష్ఠించబడిన మీ వెంట్రుకలు కత్తిరించి పారవేయండి; బంజరు కొండలమీద విలపించండి, ఎందుకంటే యెహోవా తన ఉగ్రత క్రింద ఉన్న ఈ తరాన్ని తిరస్కరించారు, వదిలేశారు.


“వెళ్లిపొండి! మీరు అపవిత్రులు!” అని ప్రజలు గట్టిగా వారిమీద అరుస్తారు. “దూరం! దూరం! మమ్మల్ని తాకవద్దు!” అని వారు పారిపోయి, తిరుగులాడుతున్నప్పుడు, దేశాల్లో ఉన్న ప్రజలు, “వారు ఇకపై ఇక్కడ ఉండడానికి వీల్లేదు” అని అంటారు.


మా వారసత్వం అపరిచితులకు, మా ఇళ్ళను విదేశీయులకు అప్పగించారు.


“మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు:


ఆ దేశం కూడ అపవిత్రమైంది; కాబట్టి దాని పాపాన్ని బట్టి దాన్ని శిక్షించాను, ఆ దేశం తనలో నివసించేవారిని బయటికి వెళ్లగ్రక్కుతుంది.


మీరు దేశాన్ని అపవిత్రం చేస్తే, అది ముందున్న జనాలను బయటికి వెళ్లగ్రక్కినట్లు మిమ్మల్ని కూడ వెళ్లగ్రక్కుతుంది.


“ ‘నా శాసనాలను చట్టాలన్నిటిని పాటించండి, వాటిని అనుసరించండి, తద్వారా మీరు నివసించడానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తున్న దేశం మిమ్మల్ని వెళ్లగ్రక్కదు.


మీరు లేచి వెళ్లిపోండి! ఇది మీ విశ్రాంతి స్థలం కాదు, ఎందుకంటే అది అపవిత్రమైంది, అది పూర్తిగా నిర్మూలమైంది.


ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం; నా ప్రజల ఆస్తి విభజింపబడింది ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”


మధ్యాహ్న సమయంలో మీరు చీకటిలో గ్రుడ్డివానిలా తడుముకుంటారు. మీరు చేసే ప్రతీ పనిలో మీరు విఫలమవుతారు; రోజు రోజుకు మీరు అణచివేయబడతారు, దోచుకోబడతారు, మిమ్మల్ని రక్షించడానికి ఎవరూ ఉండరు.


Lean sinn:

Sanasan


Sanasan