Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 9:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

10 నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, పశువుల అరుపులు వినబడవు. పక్షులన్నీ పారిపోయాయి జంతువులు వెళ్లిపోయాయి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

10 పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలా పము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశపక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

10 పర్వతాల గురించి ఏడుస్తాను, విలాప గీతం ఆలపిస్తాను. వాటి మేతస్థలాల గురించి రోదిస్తాను. ఎందుకంటే అవి పాడైపోయాయి. వాటిగుండా ఎవరూ వెళ్ళడం లేదు. వాటిలో పశువుల అరుపులు వినబడడం లేదు. ఆకాశ పక్షులు, జంతువులు అన్నీ పారిపోయాయి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను. వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను. ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి. ఎవ్వడూ అక్కడ పయనించడు. ఆ ప్రదేశాలలో పశువుల అరుపులు వినరావు. పక్షులు ఎగిరి పోయాయి: పశువులు పారిపోయాయి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

10 నేను పర్వతాల కోసం ఏడుస్తాను, రోదిస్తాను, అరణ్య పచ్చగడ్డి ఉన్న స్థలాల గురించి విలపిస్తాను. అవి నిర్జనమైనవి, ప్రయాణం చేయలేనివి, పశువుల అరుపులు వినబడవు. పక్షులన్నీ పారిపోయాయి జంతువులు వెళ్లిపోయాయి.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 9:10
30 Iomraidhean Croise  

“చూడు, నేను నిన్ను పదునుగా ఉండి, అనేకమైన పళ్ళు కలిగిన క్రొత్త నూర్చే పలకగా చేస్తాను. నీవు పర్వతాలను నూర్చి నలగ్గొడతావు, కొండలను పొట్టులా చేస్తావు.


“నీవు నాశనమై నిర్మానుష్యంగా చేయబడినా నీ దేశం పాడుబడినా నీ భూమి నీ ప్రజలకు ఇరుకుగా ఉంటుంది, నిన్ను మ్రింగివేసినవారు దూరంగా ఉంటారు.


చాలామంది కాపరులు నా ద్రాక్షతోటను నాశనం చేశారు నా పొలాన్ని త్రొక్కివేశారు; వారు నాకు ఇష్టమైన పొలాన్ని నిర్జనమైన బంజరు భూమిలా మార్చారు.


అది నా ఎదుట బంజరు భూమిలా, ఎండిపోయి పాడైపోయింది; పట్టించుకునే వారు లేక దేశమంతా వృధా అవుతుంది.


ఎంతకాలం భూమి ఎండిపోయి ఉండాలి? ఎంతకాలం పొలంలో గడ్డి ఎండిపోతూ ఉండాలి? అందులో నివసించేవారు దుర్మార్గులు కాబట్టి జంతువులు, పక్షులు నశించాయి. “మనకు ఏమి జరుగుతుందో యెహోవా చూడడు” అని ప్రజలు అంటున్నారు.


అడవి గాడిదలు బంజరు కొండలమీద నిలబడి నక్కల్లా రొప్పుతాయి. మేత లేకపోవడంతో వాటి కళ్లు క్షీణిస్తున్నాయి.”


సింహాలు గర్జించాయి; అవి అతని మీదికి గుర్రుమన్నాయి. వారు అతని దేశాన్ని పాడుచేశారు; అతని పట్టణాలు కాలిపోయి నిర్జనమయ్యాయి.


వారు, ‘ఈజిప్టు నుండి మమ్మల్ని రప్పించి, నిర్జన అరణ్యం గుండా, ఎడారులు, కనుమలు ఉన్న భూమి గుండా, కరువు, చీకటి నిండిన భూమి గుండా, ఎవరూ ప్రయాణించని, ఎవరూ నివసించని భూమి గుండా మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ?’ అని అడిగారు.


దేశమంతా వ్యభిచారులతో నిండిపోయింది; శాపం కారణంగా భూమి ఎండిపోయింది అరణ్యంలో పచ్చికబయళ్లు ఎండిపోయాయి. ప్రవక్తలు చెడు మార్గం అనుసరిస్తారు తమ అధికారాన్ని అన్యాయంగా ఉపయోగిస్తారు.


ఉత్తర దిక్కునుండి ఒక దేశం దానిపై దాడి చేసి దాని దేశాన్ని పాడుచేస్తుంది. దానిలో ఎవరూ నివసించరు; మనుష్యులు పారిపోతారు జంతువులు పారిపోతాయి.


“ ‘ప్రతిష్ఠించబడిన మీ వెంట్రుకలు కత్తిరించి పారవేయండి; బంజరు కొండలమీద విలపించండి, ఎందుకంటే యెహోవా తన ఉగ్రత క్రింద ఉన్న ఈ తరాన్ని తిరస్కరించారు, వదిలేశారు.


దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది.


“అందుకే నేను ఏడుస్తున్నాను నా కళ్ల నుండి కన్నీరు పొర్లి పారుతున్నాయి. నన్ను ఓదార్చడానికి నాకు దగ్గరగా ఎవరూ లేరు, నా ఆత్మను ఉత్తేజపరచడానికి ఎవరూ లేరు. శత్రువు నన్ను జయించాడు కాబట్టి నా పిల్లలు నిరుపేదలయ్యారు.”


ఏడ్వడం వల్ల నా కళ్లు క్షీణిస్తున్నాయి, నా లోపలి భాగాలు వేదనను అనుభవిస్తున్నాను. నా హృదయం నేలమీద కుమ్మరించబడింది, ఎందుకంటే నా ప్రజలు నాశనమయ్యారు, పిల్లలు, పసిపిల్లలు నగర వీధుల్లో మూర్ఛపోయారు.


సీయోను పర్వతం నిర్జనంగా పడి ఉంది, నక్కలు దాని మీద విహరిస్తున్నాయి.


“ఆ దేశం పిల్లలు లేనిదై నిర్మానుష్యంగా మారేలా దాని మీదికి అడవి మృగాలను పంపుతాను. వాటి కారణంగా దానిగుండా ఎవరూ ప్రయాణించరు.


“మనుష్యకుమారుడా, తూరు పట్టణం గురించి విలాప గీతం పాడు:


దానిలో మనుష్యులు నడవరు పశువులు తిరగరు. నలభై సంవత్సరాలు దానిలో ఎవరూ నివసించరు.


నేను ఆ దేశాన్ని నిర్మానుష్యంగా చేస్తాను. దాని బల గర్వం ముగిసిపోతుంది, వాటి గుండా ఎవరూ వెళ్లకుండా ఇశ్రాయేలీయుల పర్వతాలు నిర్జనమవుతాయి.


మీరు ఎక్కడ నివసించినా, ఆ పట్టణాలు నిర్జనమవుతాయి, క్షేత్రాలు పడగొట్టబడతాయి, తద్వారా మీ బలిపీఠాలు అపవిత్రమవుతాయి, మీ విగ్రహాలు పగిలి శిథిలమవుతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి, మీరు తయారుచేసినవి తుడిచివేయబడతాయి.


ఈ కారణంచేత దేశం ఎండిపోతుంది, అందులో నివసించేవారు నీరసించి పోతున్నారు; అడవి జంతువులు, ఆకాశపక్షులు, సముద్రపు చేపలు నశించిపోతున్నాయి.


యాజకులారా, మీరు గోనెపట్ట కట్టుకుని ఏడవండి; బలిపీఠం దగ్గర సేవ చేసేవారలారా, మీరు రోదించండి. నా దేవుని ఎదుట సేవ చేసేవారలారా, రండి, రాత్రంత గోనెపట్ట కట్టుకుని గడపండి; ఎందుకంటే దేవుని మందిరంలోకి భోజనార్పణలు పానార్పణలు రాకుండ నిలిచిపోయాయి.


యెహోవా మీకు నేను మొరపెడుతున్నాను, ఎందుకంటే అరణ్యంలో పచ్చికబయళ్లను అగ్ని కాల్చివేసింది పొలం లోని చెట్లన్నిటిని మంటలు కాల్చివేశాయి.


ఇశ్రాయేలూ! ఈ మాట విను, ఇది మిమ్మల్ని గురించి విలాప వాక్కు:


కాబట్టి ప్రభువు, సైన్యాల యెహోవా దేవుడు చెప్పే మాట ఇదే: “వీధులన్నిటిలో విలాపం ఉండబోతుంది ప్రతి రాజ మార్గంలో వేదనతో కూడిన ఏడ్పులు. ఏడ్వడానికి రైతులను దుఃఖపడడానికి విలపించేవారిని పిలుస్తారు.


ఆ రోజు ప్రజలు మీ గురించి ఒక సామెత చెప్తారు; మీ గురించి ఈ విషాద గీతం పాడుతూ ఎగతాళి చేస్తారు: ‘మేము పూర్తిగా పాడైపోయాం; నా ప్రజల ఆస్తి విభజింపబడింది ఆయన దాన్ని నా నుండి తీసుకుంటారు! ఆయన మా భూములను దేశద్రోహులకు అప్పగించారు.’ ”


కాబట్టి మీ కారణంగా, సీయోను ఒక పొలంలా దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగా మారుతుంది ఆలయమున్న కొండ దట్టమైన పొదలతో మట్టి దిబ్బగా మారుతుంది.


Lean sinn:

Sanasan


Sanasan