Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 9:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 నా తల జలమయంగా నా కళ్ళు కన్నీటి ఊటగా ఉండు గాక. ఎందుకంటే హతమైన నా ప్రజలను గూర్చి నేను రాత్రింబగళ్ళూ విలపించాలని కోరుతున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

1 నా తల నీటితో నిండియున్నట్లయితే, నా నేత్రాలు కన్నీటి ఊటలైతే హతులైన నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్లు దుఃఖిస్తాను!

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 అయ్యో, నా తల నీటి బావి నా కళ్లు కన్నీటి ఊట అయి ఉంటే బాగుండేది! చంపబడిన నా ప్రజల కోసం నేను పగలు రాత్రి ఏడ్చే వాన్ని.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 9:1
20 Iomraidhean Croise  

ప్రజలు మీ ధర్మశాస్త్రానికి లోబడకపోవడం చూసి, నా కళ్ల నుండి కన్నీరు ప్రవహిస్తుంది.


“మీ దేవుడు ఎక్కడున్నాడు?” అని నా శత్రువులు నాతో అంటూ ఉంటే రాత్రింబగళ్ళు, నా కన్నీరే నాకు ఆహారం అవుతున్నాయి.


నేను దూరంగా ఎగిరిపోయి ఎడారిలో ఉండేవాన్ని. సెలా


అందువల్ల యాజెరు ఏడ్చినట్లు నేను షిబ్మా ద్రాక్షతీగెల కోసం ఏడుస్తాను. హెష్బోనూ ఎల్యాలెహు, నా కన్నీటి చేత మిమ్మల్ని తడుపుతాను. నీ పండిన ఫలాల కోసం నీ పంటల కోసం వేసే సంతోషపు కేకలు ఆగిపోయాయి.


అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; నన్ను గట్టిగా ఏడవనివ్వండి. నా ప్రజలకు కలిగిన నాశనం గురించి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను.


మీరు వినకపోతే మీ గర్వాన్ని బట్టి నేను రహస్యంగా ఏడుస్తాను; యెహోవా మంద చెరగా కొనిపోబడుతుంది కాబట్టి నా కళ్లు ఎంతగానో ఏడుస్తాయి, కన్నీరు కారుస్తాయి.


“వారితో ఈ మాట చెప్పు: “ ‘నా కళ్లలో కన్నీరు రాత్రింబగళ్ళు ఆగకుండా పొంగిపారును గాక; ఎందుకంటే, కన్యయైన నా ప్రజల కుమార్తెకు, తీవ్రమైన గాయం తగిలింది, అది ఆమెను నలిపివేస్తుంది.


ఇంత జరిగినా, నమ్మకద్రోహియైన తన సహోదరి యూదా తన పూర్ణహృదయంతో నా వైపు తిరగలేదు, కేవలం నటించింది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


అయ్యో, నా వేదన, నా వేదన! నేను నొప్పితో విలపిస్తున్నాను. అయ్యో, నా హృదయ వేదన! నా గుండె నాలో కొట్టుకుంటుంది, నేను మౌనంగా ఉండలేను. నేను బూరధ్వని విన్నాను; నేను యుద్ధ కేకలు విన్నాను.


“నేను నిన్ను ఎందుకు క్షమించాలి? మీ పిల్లలు నన్ను విడిచి, దేవుళ్ళు కాని దేవుళ్ళపై ప్రమాణం చేశారు. వారి అవసరాలన్నీ నేను తీర్చాను, అయినప్పటికీ వారు వ్యభిచారం చేశారు వేశ్యల ఇళ్ళకు గుమికూడారు.


నా ప్రజలారా, గోనెపట్ట కట్టుకుని బూడిదలో దొర్లండి. ఒక్కగానొక్క కుమారుని కోసం తీవ్ర రోదనతో దుఃఖించండి, ఎందుకంటే హఠాత్తుగా నాశనం చేసేవాడు మన మీదికి వస్తాడు.


దుఃఖంలో నాకు ఆదరణకర్తవు నీవే, నా హృదయం నాలో నీరసించి ఉంది.


వారు త్వరగా వచ్చి మన కళ్ల నుండి కన్నీరు పొర్లిపారే వరకు మా కనురెప్పల నుండి నీటి ధారలు వచ్చేవరకు మనల్ని చూసి ఏడుస్తారు.


ఏడ్వడం వల్ల నా కళ్లు క్షీణిస్తున్నాయి, నా లోపలి భాగాలు వేదనను అనుభవిస్తున్నాను. నా హృదయం నేలమీద కుమ్మరించబడింది, ఎందుకంటే నా ప్రజలు నాశనమయ్యారు, పిల్లలు, పసిపిల్లలు నగర వీధుల్లో మూర్ఛపోయారు.


నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.


వారంతా వ్యభిచారులు, పొయ్యిలా మండుతూ ఉంటారు, వంటమనిషి ముద్ద పిసికిన తర్వాత అది పొంగే వరకు వేడి చేసిన పొయ్యివంటి వారు.


Lean sinn:

Sanasan


Sanasan