Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 8:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 “ ‘శాస్త్రుల అబద్ధాల కలం, దాన్ని అబద్ధాలతో మార్చినప్పుడు, “మేము జ్ఞానులం, ఎందుకంటే మాకు యెహోవా ధర్మశాస్త్రం ఉంది” అని మీరు ఎలా అనగలరు?

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 –మేము జ్ఞానులమనియు, యెహోవా ధర్మశాస్త్రము మాయొద్దనున్నదనియు మీరేల అందురు? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 “మేము జ్ఞానులం, యెహోవా ధర్మశాస్త్రం మాతో ఉంది” అని మీరెందుకు అంటున్నారు? నిజమే గానీ శాస్త్రులు మోసంతో దానికి పెడర్థాలు రాశారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 “‘యెహోవా ధర్మశాస్త్రం (ఉపదేశములు) మావద్ద ఉన్నది! అందువల్ల మేము తెలివిగలవారము! అని మీరు చెప్పుకుంటూ వుంటారు. కాని అది నిజం కాదు. ఎందువల్లనంటే లేఖకులు (వ్రాత గాండ్రు) వారి కలాలతో అబద్ధమాడారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 “ ‘శాస్త్రుల అబద్ధాల కలం, దాన్ని అబద్ధాలతో మార్చినప్పుడు, “మేము జ్ఞానులం, ఎందుకంటే మాకు యెహోవా ధర్మశాస్త్రం ఉంది” అని మీరు ఎలా అనగలరు?

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 8:8
18 Iomraidhean Croise  

అడవి గాడిదపిల్ల మనిషిగా పుడుతుందేమో కాని, తెలివిలేనివాడు తెలివైనవానిగా మారడం కష్టము.


నమ్మకమైన సలహాదారుల మాటలను నిరర్థకం చేస్తారు, పెద్దల వివేచనను తీసివేస్తారు.


ఆయన యాకోబుకు తన వాక్కును, ఇశ్రాయేలుకు తన న్యాయవిధులను శాసనాలను బయలుపరచారు.


పిల్లల పిల్లలు ముసలివారికి కిరీటం, తల్లిదండ్రులు వారి పిల్లలకు అలంకారము.


నీ మూలపురుషుడు పాపం చేశాడు; నీకు బోధించమని నేను పంపినవారు నా మీద తిరుగుబాటు చేశారు.


వారు, “రండి, యిర్మీయా మీద కుట్ర చేద్దాం; యాజకుడు ధర్మశాస్త్రాన్ని బోధించక మానడు, జ్ఞానులు సలహాలు ఇవ్వడం మానరు, ప్రవక్తలు వాక్కును ప్రకటింపక మానరు. కాబట్టి రండి, అతడు చెప్పేదేదీ పట్టించుకోకుండా మన మాటలతో అతనిపై దాడి చేద్దాం” అంటారు.


“ ‘ఈ స్థలంలో నేను యూదా, యెరూషలేము ప్రణాళికలను నాశనం చేస్తాను. వారిని చంపాలనుకునే శత్రువుల చేతిలో వారు కత్తివేటుకు గురయ్యేలా చేస్తాను, వారి శవాలను పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను.


యాజకులు ‘యెహోవా ఎక్కడ ఉన్నారు?’ అని అడగలేదు. ధర్మశాస్త్రాన్ని బోధించే వారికి నేను తెలియదు; నాయకులు నా మీదికి తిరుగబడ్డారు. ప్రవక్తలు పనికిరాని విగ్రహాలను పూజిస్తూ, బయలు పేరిట ప్రవచించారు.


“నా ప్రజలు మూర్ఖులు; వారికి నేను తెలియదు. వారు బుద్ధిలేని పిల్లలు; వారికి వివేచన లేదు. వారు కీడు చేయడంలో నేర్పరులు; మంచి చేయడం ఎలాగో వారికి తెలియదు.”


“ ‘మేము యోధులం, యుద్ధంలో పరాక్రమవంతులం’ అని మీరు ఎలా చెప్పగలరు?


నేను వారి కోసం నా ధర్మశాస్త్ర విషయాలు ఎన్నో వ్రాశాను, కాని అవి తమకు సంబంధించినవి కావన్నట్లు పరిగణించారు.


వాడు తన తండ్రికి తల్లికి ఏమి చేయనక్కరలేదు అని చెప్తున్నారు. ఈ విధంగా మీ సంప్రదాయం కోసం దేవుని వాక్యాన్ని అర్థం లేనిదానిగా చేస్తున్నారు.


అందుకు యేసు, “మీరు గ్రుడ్డివారైతే మీమీద ఈ పాపం ఉండేది కాదు; కాని చూడగలమని మీరు చెప్పుకుంటున్నారు. కాబట్టి మీ పాపం నిలిచి ఉంటుంది” అని చెప్పారు.


వారు జ్ఞానులమని చెప్పుకున్నప్పటికీ మూర్ఖులుగా మారారు.


Lean sinn:

Sanasan


Sanasan