Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 8:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

16 శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం దాను నుండి వినబడుతుంది; వారి మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా వణికిపోతుంది. వారు మ్రింగివేయడానికి భూమిని, అందులోని సమస్తాన్ని, పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

16 దానునుండి వచ్చువారి గుఱ్ఱముల బుసలు వినబడెను, వారి గుఱ్ఱముల సకిలింపు ధ్వనిచేత దేశమంతయు కంపించుచున్నది, వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనముచేయుదురు, పట్టణమును అందులో నివసించువారిని నాశనము చేయుదురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

16 దాను ప్రాంతం నుండి వచ్చే వారి గుర్రాల బుసలు వినబడుతున్నాయి. వాటి సకిలింపులకు దేశమంతా అదురుతూ ఉంది. వారు వచ్చి దేశాన్ని, దానిలోని సమస్తాన్ని, పట్టణాన్ని దానిలో నివసించే వారిని నాశనం చేస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

16 దాను వంశీయుల రాజ్యంనుండి శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి. వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది. వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ నాశనం చేయాలని వచ్చియున్నారు. వారీ నగరాన్ని, నగరవాసులను సర్వనాశనం చేయటానికి వచ్చారు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

16 శత్రువుల గుర్రాల బుసలు కొట్టడం దాను నుండి వినబడుతుంది; వారి మగ గుర్రాల సకిలింపుకు దేశమంతా వణికిపోతుంది. వారు మ్రింగివేయడానికి భూమిని, అందులోని సమస్తాన్ని, పట్టణాన్ని, అందులో నివసించే వారినందరిని మ్రింగివేయడానికి వచ్చారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 8:16
22 Iomraidhean Croise  

దాని భీకరమైన గురకతో భయాన్ని సృష్టించే మిడతలా, మీరు దానిని దూకేలా చేస్తారా?


భూమి, దానిలో ఉండే సమస్తం, లోకం, దానిలో నివసించేవారు యెహోవా సొత్తు.


మిమ్మల్ని గుర్తించని దేశాల మీద, మీ పేరు పెట్టుకొనని జనాంగాల మీద మీ కోపాన్ని కుమ్మరించండి. వారు యాకోబును మ్రింగివేశారు; వారు అతన్ని పూర్తిగా మ్రింగివేశారు అతని మాతృభూమిని నాశనం చేశారు.


మన పూర్వికుల శ్రమ ఫలాలను వారి గొర్రెలను, మందలను, వారి కుమారులు, కుమార్తెలను మా యవ్వనం నుండి సిగ్గుమాలిన దేవతలు తినివేశాయి.


“ ‘అయితే నిన్ను మ్రింగివేసేవాళ్లంతా మ్రింగివేయబడతారు; నీ శత్రువులందరూ బందీలుగా కొనిపోబడతారు. నిన్ను దోచుకునేవారు దోచుకోబడతారు; నిన్ను పాడుచేసే వారందరిని నేను పాడుచేస్తాను.


“యెహోవా ఇలా అంటున్నారు: “ ‘భయంతో కూడిన కేకలు వినబడుతున్నాయి, భయమే ఉంది తప్ప, సమాధానం లేదు.


నేను పర్వతాలను చూశాను, అవి వణుకుతున్నాయి. కొండలన్నీ ఊగుతున్నాయి.


ఒక సింహం తన పొద చాటు నుండి బయటకు వచ్చింది; దేశాలను నాశనం చేసేవాడు బయలుదేరాడు. మీ దేశాన్ని పాడుచేయడానికి ఆయన తన స్థలాన్ని విడిచిపెట్టాడు. నీ పట్టణాలు నివాసులు లేకుండా శిథిలావస్థలో ఉంటాయి.


పరుగెత్తే గుర్రాల డెక్కల శబ్దానికి, శత్రు రథాల శబ్దానికి వాటి చక్రాల శబ్దానికి వారు రోదిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సహాయం చేయరు; వారి చేతులు బలహీనంగా ఉంటాయి.


వారు మీ పంటలను, ఆహారాన్ని మ్రింగివేస్తారు, మీ కుమారులను, కుమార్తెలను మ్రింగివేస్తారు; వారు మీ గొర్రెలను, మందలను మ్రింగివేస్తారు, మీ ద్రాక్ష చెట్లను, అంజూర చెట్లను మ్రింగివేస్తారు. మీరు నమ్ముకునే కోటగోడలు గల పట్టణాలను వారు ఖడ్గంతో నాశనం చేస్తారు.


వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు క్రూరులు, కనికరం లేనివారు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు వారి స్వరం సముద్ర ఘోషలా ఉంటుంది; బబులోను కుమార్తె, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వ్యూహంలోని సైనికుల్లాగా వస్తారు.


భూమి వణుకుతుంది, ప్రసవ వేదన పడుతుంది, బబులోను దేశాన్ని పాడు చేయాలని అక్కడ ఎవరూ నివసించకుండ చేయాలని యెహోవా ఉద్దేశాలలో మార్పు లేదు.


వారు విల్లు, ఈటె పట్టుకుని ఉన్నారు; వారు కౄరమైనవారు, దయ చూపరు. వారు తమ గుర్రాలపై స్వారీ చేస్తున్నప్పుడు గర్జించే సముద్రంలా వినిపిస్తారు; సీయోను కుమారీ, నీ మీద దాడి చేయడానికి వారు యుద్ధ వరుసలో ఉన్న సైనికుల్లా వస్తారు.”


కొరడాల ధ్వని, చక్రాల మోత, పరుగెడుతున్న గుర్రపు డెక్కల శబ్దం వేగంగా పరుగెడుతున్న రథాల ధ్వని వినబడుతుంది!


పర్వతాలు నిన్ను చూసి వణికాయి. నీళ్లు ప్రవాహాలుగా ప్రవహిస్తాయి; అగాధం ఘోషిస్తూ తన అలలను పైకి లేపుతుంది.


ఎందుకంటే, “భూమి, దానిలో ఉండే సమస్తం ప్రభువుకు చెందినవే.”


కాని ఎవరైనా మీతో, “ఇది విగ్రహాలకు అర్పించిన ఆహారం” అని చెబితే దాన్ని తినవద్దు. మీకు చెప్పినవాని కోసం, మనస్సాక్షి కోసం దాన్ని తినవద్దు.


దానికి ఇశ్రాయేలు కుమారుడైన దాను అని తమ పూర్వికుడైన దాను పేరు పెట్టారు; మొదట ఆ పట్టణం లాయిషు అని పిలువబడేది.


అప్పుడు ఇశ్రాయేలీయులందరు, దాను నుండి బెయేర్షేబ వరకు ఉన్నవారు, గిలాదు ప్రదేశంలో ఉన్నవారు, అంతా ఏకమై మిస్పా దగ్గర యెహోవా సన్నిధిలో సమావేశమయ్యారు.


గుర్రాల డెక్కల శబ్దాలు దద్దరిల్లాయి, బలమైన గుర్రాలు వేగంగా దూసుకెళ్లాయి.


Lean sinn:

Sanasan


Sanasan