Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 8:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, “సమాధానం, సమాధానం” అని వారంటారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 సమాధానము లేని సమయమున–సమాధానము సమాధానము అని వారు చెప్పుచు, నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగుచేయుదురు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 శాంతి లేని సమయంలో వారు “శాంతి సమాధానాలు, శాంతి సమాధానాలు” అని పలుకుతూ నా ప్రజల గాయాలకు పైపై పూత పూస్తారు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

11 నా ప్రజలు బాగా గాయపడ్డారు. కాని అదేదో బహు చిన్న గాయమైనట్లు ప్రవక్తలు, యాజకులు నా ప్రజలకు తగిలిన దెబ్బను మాన్పజూస్తారు. “అంతా మంచిగా వుంది; అంతా మంచిగా వుంది!” అని వారంటారు. కాని పరిస్థితి ఏమీ బాగా లేదు!

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, “సమాధానం, సమాధానం” అని వారంటారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 8:11
14 Iomraidhean Croise  

మీకాయాను పిలువడానికి వెళ్లిన దూత మీకాయాతో, “చూడు, ఇతర ప్రవక్తలందరు రాజుకు విజయం కలుగుతుందని చెప్తున్నారు. వారి మాటతో నీ మాట ఏకమై, అనుకూలంగా పలుకాలి” అన్నాడు.


కాబట్టి ఇశ్రాయేలు రాజు సుమారు నాలుగువందలమంది ప్రవక్తలను పిలిపించి, “నేను రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వెళ్లాలా? లేదా వెళ్లొద్దా?” అని వారిని అడిగాడు. “వెళ్లండి! దానిని యెహోవా రాజు వశం చేస్తారు” అని వారు జవాబిచ్చారు.


అయితే నేను, “అయ్యో, ప్రభువా యెహోవా! ప్రవక్తలు వారితో, ‘మీరు ఖడ్గాన్ని చూడరు, మీకు కరువు రాదు. నిజానికి, ఈ స్థలంలో నేను మీకు శాశ్వతమైన సమాధానం ఇస్తాను’ అని చెబుతున్నారు.”


‘మీకు సమాధానం కలుగుతుంది యెహోవా చెప్తున్నారు’ అని నన్ను తృణీకరించే వారితో అంటారు. ‘మీకు హాని జరగదు’ అని వారు హృదయ కాఠిన్యం గలవారితో అంటారు.


నా ప్రజల గాయం తీవ్రమైనది కానట్టు వారు దానికి కట్టు కడతారు. సమాధానం లేనప్పుడు, ‘సమాధానం, సమాధానం’ అని వారంటారు.


మేము సమాధానం కోసం నిరీక్షించాం, కానీ ఏ మంచి జరగలేదు, స్వస్థత కోసం ఎదురుచూశాము కానీ భయమే కలిగింది.


నీ ప్రవక్తల దర్శనాలు అబద్ధం, పనికిరానివి; చెర నుండి నిన్ను తప్పించడానికి వారు నీ పాపాన్ని బయటపెట్టలేదు. వారు నీకు చెప్పిన ప్రవచనాలు అబద్ధం, తప్పుదారి పట్టించేవి.


ఇదంతా ఎందుకంటే, నేను దుఃఖపరచని నీతిమంతుల హృదయాన్ని అబద్ధాలతో మీరు దుఃఖపెట్టారు. దుర్మార్గులు తమ చెడు మార్గాలు వదిలిపెట్టి తమ ప్రాణాలను కాపాడుకోకుండ మీరు వారిని ప్రోత్సహించారు.


ఒకవేళ అబద్ధికుడు మోసగాడు వచ్చి, ‘ద్రాక్షరసం గురించి, మద్యం గురించి నేను మీకు ప్రవచిస్తాను’ అంటే, వాడే ఈ ప్రజలకు తగిన ప్రవక్త!


ప్రజలు, మేము, “నెమ్మది కలిగి సురక్షితంగా ఉన్నాం” అని అనుకుంటున్నప్పుడు, ఒక గర్భిణి స్త్రీకి పురుటినొప్పులు వచ్చునట్లు వారి పైకి నాశనం అకస్మాత్తుగా వస్తుంది, కాబట్టి వారు దాని నుండి తప్పించుకోలేరు.


Lean sinn:

Sanasan


Sanasan