Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 7:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

7 నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

7 ఈ స్థలమున తమకు నిత్యముగా నుండుటకై పూర్వకాలమున నేను మీపితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

7 అలా అయితే మీరు శాశ్వతంగా నివసించడానికి పూర్వమే నేను మీ పూర్వికులకు ఇచ్చిన ఈ దేశంలో మిమ్మల్ని ఉండనిస్తాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

7 మీరు నా మాట మన్నిస్తే, నేను మిమ్మల్ని ఈ రాజ్యంలో నివసించేలా చేస్తాను. ఈ రాజ్యాన్ని నేను మీ పూర్వీకులకు శాశ్వతంగా ఇచ్చాను.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

7 నేను మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో, అంటే ఈ స్థలంలో, మిమ్మల్ని శాశ్వతంగా నివాసం చేయనిస్తాను.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 7:7
12 Iomraidhean Croise  

నేను ఇశ్రాయేలు ప్రజలకు మోషే ద్వారా ఇచ్చిన చట్టాలు, శాసనాలు, నిబంధనలను గురించి నేను వారికి ఆజ్ఞాపించినదంతా జాగ్రత్తగా వారు పాటిస్తే, నేను మీ పూర్వికులకు నియమించిన దేశంలో నుండి ఇశ్రాయేలీయుల పాదాలను తిరిగి వెళ్లనివ్వను” అని చెప్పారు.


“విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు.


మీరు ఇష్టపడి నా మాట వింటే, మీరు భూమి ఇచ్చే మంచి పంటను తింటారు;


వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరు మీ చెడు మార్గాలను, మీ చెడు ఆచారాలను ఇప్పటికైనా విడిచిపెట్టండి, యెహోవా మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు శాశ్వతంగా ఉండగలరు.


మీ మార్గాలను, క్రియలను, సరిచేసికొని, మీ దేవుడైన యెహోవాకు లోబడండి. అప్పుడు యెహోవా తన మనస్సు మార్చుకుని, మీ మీదికి రప్పిస్తానని ఆయన ప్రకటించిన విపత్తును ఆయన రప్పించరు.


ఆ రోజుల్లో యూదా ప్రజలు ఇశ్రాయేలు ప్రజలతో కలిసి ఉంటారు, వారు కలిసి ఉత్తర దేశం నుండి నేను మీ పూర్వికులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి వస్తారు.


నా సేవకులైన ప్రవక్తలందరినీ మళ్ళీ మళ్ళీ మీ దగ్గరికి పంపాను. వారు మీతో, “మీలో ప్రతి ఒక్కరూ మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ ప్రవర్తన సరిచేసుకోవాలి; ఇతర దేవతలను సేవించవద్దు వాటిని అనుసరించవద్దు. అప్పుడు నేను మీకు, మీ పూర్వికులకు ఇచ్చిన దేశంలో మీరు నివసిస్తారు” అని ప్రకటించారు. కానీ మీరు నా మాట వినలేదు పట్టించుకోలేదు.


“ఇశ్రాయేలూ, నీవు తిరిగి వస్తే, నా దగ్గరకు తిరిగి రండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీ అసహ్యమైన విగ్రహాలను నా దృష్టికి దూరంగా ఉంచితే ఇక దారి తొలగకుండా ఉంటే,


నేను యెరూషలేము గురించి, ‘ఖచ్చితంగా నీవు నాకు భయపడి దిద్దుబాటును అంగీకరిస్తావు! అప్పుడు దాని ఆశ్రయ స్థలం నాశనం చేయబడదు, నా శిక్షలేవీ దాని మీదికి రావు’ అని అనుకున్నాను. కాని వారు అన్ని రకాల చెడుపనులు చేయాలని ఆతృతగా ఉన్నారు.


మీకు, మీ తర్వాత మీ సంతతివారికి క్షేమం కలగడానికి యెహోవా శాశ్వతంగా మీకు ఇస్తున్న దేశంలో మీరు అధిక కాలం జీవించేలా ఈ రోజు నేను మీకు ఇస్తున్న శాసనాలను ఆజ్ఞలను పాటించండి.


Lean sinn:

Sanasan


Sanasan