Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 7:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

33 అప్పుడు ఈ ప్రజల కళేబరాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి వాటిని భయపెట్టడానికి ఎవరూ ఉండరు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

33 ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహార మగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

33 అప్పుడు ఈ ప్రజల శవాలు ఆకాశ పక్షులకూ భూజంతువులకూ ఆహారంగా మారతాయి. వాటిని తోలివేయడానికి ఎవరూ ఉండరు.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

33 తరువాత శవాలను వట్టి నేలపై పడవేస్తారు. అవి పక్షులకు ఆహారమవుతాయి. ఆ శవాలను అడవి జంతువులు పీక్కొని తింటాయి. శవాలను తినే పక్షులను, జంతువులను తోలి వేయటానికి అక్కడ బ్రతికి వున్న మనుష్యుడొక్కడూ మిగలడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

33 అప్పుడు ఈ ప్రజల కళేబరాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి వాటిని భయపెట్టడానికి ఎవరూ ఉండరు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 7:33
19 Iomraidhean Croise  

అవి పర్వత పక్షులకు, భూమిమీది మృగాలకు విడిచిపెట్టబడతాయి; వాటిని వేసవి కాలమంతా పక్షులు, శీతాకాలమంతా భూమిమీది మృగాలు తింటాయి.


నా వారసత్వం నాకు మచ్చలున్న క్రూరపక్షిలా కాలేదా? దాన్ని ఇతర పక్షులు చుట్టుముట్టి దాడి చేస్తాయి వెళ్లి క్రూర మృగాలన్నిటిని పోగు చేయండి; మ్రింగివేయడానికి వాటిని తీసుకురండి.


వారు ఎవరికి ప్రవచిస్తున్నారో ఆ ప్రజలు కరువు, ఖడ్గం కారణంగా యెరూషలేము వీధుల్లోకి విసిరివేయబడతారు. వారిని, వారి భార్యలను, వారి కుమారులను వారి కుమార్తెలను పాతిపెట్టడానికి ఎవరూ ఉండరు. నేను వారికి తగిన విపత్తును వారిపై కురిపిస్తాను.


“నేను నాలుగు రకాల బాధలను వారి మీదికి పంపుతాను. చంపడానికి ఖడ్గాన్ని, చీల్చడానికి కుక్కలను, తిని నాశనం చేయడానికి పక్షులను, అడవి జంతువులను పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“వారు ప్రాణాంతకమైన వ్యాధులతో చనిపోతారు. వారి కోసం ఎవరు దుఃఖించరు, వారిని పాతిపెట్టరు, వారి శవాలు నేలమీద పడి ఉన్న పెంటలా ఉంటాయి. వారు ఖడ్గంతో, కరువుతో నశిస్తారు, వారి శవాలు పక్షులకు అడవి జంతువులకు ఆహారంగా ఉంటాయి.”


“ ‘ఈ స్థలంలో నేను యూదా, యెరూషలేము ప్రణాళికలను నాశనం చేస్తాను. వారిని చంపాలనుకునే శత్రువుల చేతిలో వారు కత్తివేటుకు గురయ్యేలా చేస్తాను, వారి శవాలను పక్షులకు, అడవి జంతువులకు ఆహారంగా వేస్తాను.


అతడు యెరూషలేము గుమ్మాల బయటకు ఈడ్వబడి, అక్కడ విసిరివేయబడి ఒక గాడిదలా పాతిపెట్టబడతాడు.”


ఆ సమయంలో యెహోవాచేత చంపబడినవారు భూమి ఈ చివర నుండి ఆ చివర వరకు ప్రతిచోటా ఉంటారు. వారి కోసం ఎవరూ దుఃఖించరు, వారి మృతదేహాలను సేకరించి పాతిపెట్టరు, అవి నేలమీద పెంటలా పడి ఉంటాయి.


వారిని చంపాలనుకున్న వారి శత్రువుల చేతికి నేను వారిని అప్పగిస్తాను. వారి మృతదేహాలు పక్షులకు, అడవి జంతువులకు ఆహారం అవుతాయి.


మరణం మన కిటికీల గుండా ఎక్కి మన కోటల్లోకి ప్రవేశించింది; అది వీధుల్లో పిల్లలు లేకుండ బహిరంగ కూడళ్లలో యువకులు లేకుండ నాశనం చేస్తుంది.


ఇలా చెప్పు, “యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు: “ ‘మృతదేహాలు బహిర్భూమిలో పెంటలా, కోత కోసేవాని వెనుక పడి ఉన్న పనల్లా, వాటిని సేకరించడానికి ఎవరూ ఉండరు.’ ”


నిన్ను నీ నదులలోని చేపలన్నిటిని నేను అరణ్యంలో విడిచిపెడతాను. నీవు నేల మీద పడతావు నిన్ను ఎత్తేవారు గాని, తీసేవారు గాని ఉండరు. అడవి మృగాలకు ఆకాశపక్షులకు నిన్ను ఆహారంగా ఇస్తాను.


నీవు నీ సైన్యం నీతో పాటు ఉన్న అనేక జనులు ఇశ్రాయేలు పర్వతాలమీద కూలిపోతారు. వేటాడే రకరకాల క్రూర పక్షులకు, అడవి మృగాలకు నిన్ను ఆహారంగా చేస్తాను.


మీ కళేబరాలు ఆకాశపక్షులకు అడవి మృగాలకు ఆహారమవుతాయి, వాటిని వెళ్లగొట్టే వారెవరూ ఉండరు.


మీ దేవుడైన యెహోవాకు లోబడకపోతే, మీ ఎదుట ఉండకుండా యెహోవా నాశనం చేసిన దేశాల్లా మీరు నాశనమవుతారు.


Lean sinn:

Sanasan


Sanasan