Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 7:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 మీ తోటి ఇశ్రాయేలీయులందరిని, ఎఫ్రాయిం ప్రజలందరినీ నేను నా దగ్గర నుండి తరిమివేసినట్టు మిమ్మల్ని తరిమివేస్తాను.’

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరిని నేను వెళ్లగొట్టినట్లు మిమ్మును నా సన్నిధినుండి వెళ్లగొట్టుదును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 మీ సోదరులైన ఎఫ్రాయిము సంతానాన్ని నేను వెళ్లగొట్టినట్టు మిమ్మల్ని కూడా నా సన్నిధి నుండి వెళ్లగొడతాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

15 మీ సోదరులనందరినీ నేను ఎఫ్రాయిమునుండి వెడల గొట్టినట్లు, నానుండి మిమ్మల్ని దూరంగా వెడలగొడతాను.’

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 మీ తోటి ఇశ్రాయేలీయులందరిని, ఎఫ్రాయిం ప్రజలందరినీ నేను నా దగ్గర నుండి తరిమివేసినట్టు మిమ్మల్ని తరిమివేస్తాను.’

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 7:15
25 Iomraidhean Croise  

చివరికి యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరి ద్వారా హెచ్చరించినట్లు, వారిని తన సముఖం నుండి త్రోసివేశారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు తమ స్వదేశం నుండి బందీలుగా అష్షూరుకు వెళ్లారు, ఈనాటికీ వారక్కడ ఉన్నారు.


యెహోవా తీవ్రమైన కోపంతో వారిని తన సన్నిధి నుండి త్రోసివేసేంతగా ఈ చెడుతనం యెరూషలేము, యూదాల్లో జరిగింది. తర్వాత సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు.


అతని దేవుడైన యెహోవా ఆసాకు తోడుగా ఉండడం చూసి పెద్ద సంఖ్యలో ఇశ్రాయేలు రాజ్యాన్ని విడచి అతని పక్షం చేరారు. ఆసా తన దగ్గరకు యూదా వారందరినీ బెన్యామీను వారందరినీ వారి మధ్య నివసిస్తున్న ఎఫ్రాయిం, మనష్షే, షిమ్యోను గోత్రాల వారిని సమకూర్చాడు.


మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకండి, మీ పరిశుద్ధాత్మను నా నుండి తొలగించకండి.


ఎందుకంటే తప్పును తిరస్కరించి సరియైనది ఎంచుకునే తెలివి ఆ బాలునికి రాకముందు నిన్ను భయపెట్టే ఆ ఇద్దరు రాజుల దేశాలు పాడుచేయబడతాయి.


అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నారు: “మోషే, సమూయేలు నా ముందు నిలబడినా, నా హృదయం ఈ ప్రజల వైపుకు వెళ్లదు. వారిని నా సన్నిధి నుండి దూరంగా పంపివేయి! వారిని వెళ్లనివ్వు!


“ఈ ప్రజలు గాని ఒక ప్రవక్త గాని యాజకుడు గాని, ‘యెహోవా నుండి ఏం సందేశం వచ్చింది?’ అని నిన్ను అడిగినప్పుడు, ‘ఏ సందేశం? నేను మిమ్మల్ని విడిచిపెడతాను అని యెహోవా చెప్తున్నారు’ అని చెప్పు.


కాబట్టి, నేను మిమ్మల్ని పూర్తిగా మరచిపోతాను, నేను మీకు మీ పూర్వికులకు ఇచ్చిన పట్టణంతో పాటు మిమ్మల్ని నా సన్నిధిలో నుండి వెళ్లగొడతాను.


నేను విశ్వాసంలేని ఇశ్రాయేలుకు తన విడాకుల ధృవీకరణ పత్రాన్ని ఇచ్చి, ఆమె చేసిన వ్యభిచారాలన్నిటిని బట్టి ఆమెను పంపివేసాను. అయినప్పటికీ నమ్మకద్రోహియైన ఆమె సహోదరి యూదాకు భయం లేదని నేను చూశాను; ఆమె కూడా బయటకు వెళ్లి వ్యభిచారం చేసింది.


యెహోవా తీవ్రమైన కోపంతో వారిని తన సన్నిధి నుండి త్రోసివేసేంతగా ఈ చెడుతనం యెరూషలేము, యూదాల్లో జరిగింది. తర్వాత సిద్కియా బబులోను రాజుపై తిరుగుబాటు చేశాడు.


సీయోను నుండి రోదిస్తున్న శబ్దం వినబడుతుంది: ‘మనం పూర్తిగా పతనం అయ్యాము! మన ఘోరంగా అవమానపరచబడ్డాము! మన ఇల్లు శిథిలావస్థలో ఉన్నాయి కాబట్టి మనం మన దేశాన్ని వదిలిపెట్టాలి.’ ”


నీ సోదరి వెళ్లిన దారిలోనే నీవు వెళ్లావు; కాబట్టి నేను దాని గిన్నెనే నీ చేతిలో పెడతాను.


కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మీరు మాంసంలో ఇంకా రక్తం ఉండగానే తింటూ, మీ విగ్రహాలవైపు చూస్తూ రక్తాన్ని చిందిస్తున్నారు, అలాంటి మీరు భూమిని స్వాధీనం చేసుకోగలరని అనుకుంటున్నారా?


అప్పుడు యెహోవా హోషేయతో అన్నారు, “అతనికి యెజ్రెయేలు అనే పేరు పెట్టు, ఎందుకంటే యెజ్రెయేలులో జరిగిన రక్తపాతాన్ని బట్టి త్వరలో నేను యెహు వంశాన్ని శిక్షిస్తాను, ఇశ్రాయేలు రాజ్యాన్ని తుదముట్టిస్తాను.


ఎఫ్రాయిం గాలిని మేస్తున్నాడు; అతడు రోజంతా తూర్పు గాలిని వెంటాడుతున్నాడు, విస్తారంగా అబద్ధాలాడుతూ, దౌర్జన్యం చేస్తున్నాడు. అతడు అష్షూరుతో ఒప్పందం చేస్తున్నాడు ఈజిప్టుకు ఒలీవనూనె పంపిస్తున్నాడు.


సమరయ ప్రజలు తమ అపరాధాన్ని భరించాలి, ఎందుకంటే వారు తమ దేవుని మీద తిరుగుబాటు చేశారు. వారు ఖడ్గానికి కూలుతారు; వారి చంటి పిల్లలు నేలకు కొట్టబడతారు, వారి గర్భిణీల కడుపులు చీల్చబడతాయి.”


వారికి శ్రమ కలుగుతుంది, ఎందుకంటే నా మీద తిరుగుబాటు చేశారు! వారికి నాశనం కలుగుతుంది, ఎందుకంటే నాకు విరుద్ధంగా తిరుగుబాటు చేశారు. నేను వారిని విమోచించాలని ఆశిస్తాను, కాని వారు నా గురించి అబద్ధాలు చెప్పారు.


నేను ఎఫ్రాయిమును, అందమైన స్థలంలో నాటబడిన తూరులా చూశాను. కాని ఎఫ్రాయిం తన పిల్లలను, వధించే వాని దగ్గరకు తెస్తుంది.”


వారు యెహోవా దేశంలో నిలిచి ఉండరు, ఎఫ్రాయిం ఈజిప్టుకు తిరిగి వెళ్తుంది, అష్షూరులో అపవిత్ర ఆహారాన్ని తింటుంది.


గిబియా రోజుల్లో ఉన్నట్లు, వారు అవినీతిలో లోతుగా మునిగిపోయారు. దేవుడు వారి దుష్టత్వాన్ని జ్ఞాపకం చేసుకుని, వారి పాపాల కోసం వారిని శిక్షిస్తారు.


‘నేను మీ సన్నిధి నుండి నన్ను తరిమివేసినా మరలా నేను పరిశుద్ధ ఆలయం వైపు తిరిగి చూస్తాను’ అనుకున్నాను.


యోసేపు కుమారులు: ఎఫ్రాయిం సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.


Lean sinn:

Sanasan


Sanasan