Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 6:17 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

17 నేను మీపై కావలివారిని నియమించాను వారు మీతో ఇలా చెప్పారు, ‘బూరధ్వని వినండి!’ కాని మీరన్నారు, ‘మేము వినము.’

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

17 మిమ్మును కాపుకాయుటకు నేను కావలివారిని ఉంచియున్నాను; ఆలకించుడి, వారుచేయు బూరధ్వని వినబడుచున్నది.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

17 మిమ్మల్ని కనిపెట్టుకుని ఉండడానికి నేను కావలి వారిని ఉంచాను. అదిగో, వారు చేసే బూరధ్వని వినండి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

17 నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను. నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని. కాని వారన్నారు: ‘మేము వినము.’

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

17 నేను మీపై కావలివారిని నియమించాను వారు మీతో ఇలా చెప్పారు, ‘బూరధ్వని వినండి!’ కాని మీరన్నారు, ‘మేము వినము.’

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 6:17
19 Iomraidhean Croise  

దూమాకు వ్యతిరేకంగా ప్రవచనం: ఒకడు శేయీరులో నుండి నన్ను పిలుస్తున్నాడు, “కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది? కావలివాడా, రాత్రి ఇంకా ఎంత ఉంది?”


ఇశ్రాయేలు కావలివారు గ్రుడ్డివారు. వారందరికి తెలివిలేదు; వారందరు మూగ కుక్కలు, వారు మొరగలేరు; వారు పడుకుని కలలు కంటారు, నిద్రంటే వారికి ఇష్టము.


“గట్టిగా కేకలు వేయండి, ఆపకండి. బూర ఊదినట్లు మీ స్వరం వినిపించండి. నా ప్రజలకు వారు చేసిన తిరుగుబాటును తెలియజేయండి, యాకోబు వారసులకు వారి పాపాలను తెలియజేయండి.


యెరూషలేమా! నీ గోడల మీద నేను కావలివారిని నియమించాను; పగలు గాని రాత్రి గాని వారు మౌనంగా ఉండరు. యెహోవాకు మొరపెట్టే వారలారా విశ్రాంతి తీసుకోకండి,


అయితే వారంటారు, ‘మీరు చెప్పినా ప్రయోజనం లేదు. మేము మా ఆలోచనల ప్రకారమే నడుచుకుంటాం; మేమందరం మా దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరిస్తాము.’ ”


యెహోవా తన సేవకులైన ప్రవక్తలందరినీ మీ దగ్గరకు మళ్ళీ మళ్ళీ పంపినా మీరు వినలేదు లేదా పట్టించుకోలేదు.


కాబట్టి జనులారా, వినండి; సాక్షులైన మీరు, వారికి ఏమి జరుగుతుందో గమనించండి.


కాబట్టి వారితో ఇలా చెప్పు, ‘ఇది దాని దేవుడైన యెహోవాకు లోబడని దిద్దుబాటుకు స్పందించని దేశము. నమ్మకత్వం లేకుండా పోయింది; అది వారి పెదవుల నుండి మాయమై పోయింది.


అలాంటప్పుడు ఈ ప్రజలు ఎందుకు దారి తప్పారు? యెరూషలేము ఎప్పుడూ ఎందుకు వెనుదిరుగుతుంది? వారు మోసానికి అంటిపెట్టుకుని ఉంటారు; వారు తిరిగి రావడానికి నిరాకరిస్తారు.


కాని ఇశ్రాయేలీయులు మొండివారు కఠిన హృదయులు. నా మాటలు వినడానికి ఇష్టపడరు కాబట్టి నీ మాటలు కూడా వినరు.


“బూర నీ పెదవులపై పెట్టుకో! ఒక గ్రద్ద యెహోవా ఇంటి మీద వ్రాలింది. ఎందుకంటే ప్రజలు నా నిబంధనను మీరి, నా ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు.


నేను నా కావలి స్థలం దగ్గర కనిపెట్టుకుని నగర గోడపై నిలబడి ఉంటాను; ఆయన నాతో ఏమి చెప్తాడో, ఈ ఫిర్యాదుకు నేను ఏమి జవాబు చెప్పాలో చూస్తాను.


ప్రవక్తలు మీ పూర్వికులతో, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: ‘మీ చెడు మార్గాలను విడిచిపెట్టి, మీ చెడు అలవాట్లన్నింటినీ మానుకోండి’ అని చెప్పినప్పుడు వినని, పట్టించుకోని మీ పూర్వికుల్లా మీరు ఉండకండి, అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“కానీ వారు నిర్లక్ష్యం చేసి మొండిగా వెనుదిరిగి తమ చెవులను మూసుకున్నారు.


మీ నాయకులపై నమ్మకం ఉంచండి, వారి అధికారానికి లోబడి ఉండండి, ఎందుకంటే వారు మీ ఆత్మలను గురించి లెక్క అప్పగించాల్సిన వారుగా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. వారు తమ పనిని భారంగా భావించి చేస్తే, మీకు ఏ ప్రయోజనం ఉండదు, కాబట్టి వారు చేయవలసిన పనిని భారంగా కాకుండా ఆనందంగా చేసేలా చూడండి.


Lean sinn:

Sanasan


Sanasan