Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 51:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 బబులోను నిమిషమాత్రములోనే కూలి తుత్తునియ లాయెను దానిని చూచి అంగలార్చుడి అది స్వస్థతనొందునేమో దాని నొప్పికొరకు గుగ్గిలము తీసికొని రండి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 బబులోను అకస్మాత్తుగా కూలిపోతుంది. సర్వనాశనమౌతుంది. ఆమె కోసం విలపించండి! ఆమె వేదన తీరడానికి ఔషధం ఇవ్వండి. ఆమెకు ఒకవేళ స్వస్థత కలుగుతుందేమో,

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 బబులోను అకస్మాత్తుగా పడి ముక్కలై పోతుంది. దాని కొరకు విలపించండి! దాని బాధ నివారణకు మందుతెండి! బహుశః ఆమెకు నయం కావచ్చు!

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 బబులోను హఠాత్తుగా పడిపోయి విరిగిపోతుంది. దాని గురించి విలపించండి! దాని నొప్పికి ఔషధతైలం ఇవ్వండి; బహుశా దానికి నయం కావచ్చు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 51:8
20 Iomraidhean Croise  

చూడు, జతలు జతలుగా గుర్రపు రౌతులతో కలిసి రథం మీద ఓ మనిషి వస్తున్నాడు అనగా అతడు ఇలా సమాధానం చెప్పాడు: ‘బబులోను కూలిపోయింది, కూలిపోయింది! దాని దేవతల విగ్రహాలన్నీ నేలమీద బద్దలై పడి ఉన్నాయి.’ ”


విపత్తు నీ మీదికి వస్తుంది, దానిని మాయాజాలంతో ఎలా పోగొట్టాలో నీవు తెలుసుకోలేవు. ఒక కీడు నీ మీద పడుతుంది దానిని నీవు డబ్బుతో నివారించలేవు; నీకు తెలియని నాశనం నీ మీదికి అకస్మాత్తుగా వస్తుంది.


ఒక్క క్షణంలోనే ఒక్క రోజులోనే ఈ రెండు నీకు సంభవిస్తాయి: బిడ్డల్ని పోగొట్టుకుంటావు విధవరాలిగా మారతావు. నీవు చాలా శకునాలు చూసినా, అనేక కర్ణపిశాచ తంత్రాల మీద ఆధారపడినా ఈ విషాదాలు నీ మీదికి పూర్తిగా వస్తాయి.


“కన్యయైన ఈజిప్టు కుమారీ, గిలాదుకు వెళ్లి ఔషధతైలం తెచ్చుకో. కానీ నీవు అనేక మందులు వాడడం వ్యర్థమే; నీకు స్వస్థత కలుగదు.


మోయాబు కుప్పకూలిపోయి, అపకీర్తి పాలయింది. రోదించండి, బిగ్గరగా ఏడవండి! మోయాబు నాశనమైపోయిందని అర్నోనులో ప్రకటించండి.


కాబట్టి నేను మోయాబు గురించి రోదిస్తున్నాను, మోయాబు అంతటి కోసం నేను బిగ్గరగా ఏడుస్తున్నాను, కీర్ హరెశెతు ప్రజల కోసం నేను మూలుగుతున్నాను.


“దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి, ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి; ఏదీ దాచకుండా ఇలా చెప్పండి, ‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది; బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు, మర్దూకు దేవత పడవేయబడుతుంది. బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి, దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’


“భూమి అంతా మెచ్చుకునే, షేషకు ఎలా పట్టబడింది! దేశాల మధ్యలో బబులోను ఎంత నిర్జనంగా మారిందో!


గిలాదులో ఔషధతైలం లేదా? అక్కడ వైద్యుడు లేడా? ఉంటే నా ప్రజల గాయానికి స్వస్థత ఎందుకు లేదు?


“మనుష్యకుమారుడా, ప్రవచించి ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘రోదిస్తూ అనండి: “అయ్యో, శ్రమ దినం వచ్చిందే!”


కాబట్టి ఆయన వ్రాత వ్రాయడానికి ఆ చేతిని పంపారు.


మాదీయుడైన దర్యావేషు అరవై రెండేళ్ళ వయస్సులో రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నాడు.


ఏదీ నిన్ను స్వస్థపరచలేదు; మీ గాయం ప్రాణాంతకమైనది. మీ గురించిన వార్త విన్నవారందరు మీ పతనాన్ని చూసి చప్పట్లు కొడతారు, ఎందుకంటే ప్రజలందరూ మీ అంతులేని క్రూరత్వాన్ని నీ క్రూరమైన హింసను అనుభవించిన వారే.


రెండవ దేవదూత అతని వెంబడించి, “ ‘కూలిపోయింది! బబులోను మహా పట్టణం కూలిపోయింది!’ అది తన వ్యభిచార మద్యాన్ని అన్ని దేశాలకు త్రాగించింది” అని చెప్పాడు.


అతడు గొప్ప స్వరంతో ఇలా అన్నాడు, “బబులోను మహా పట్టణం కూలిపోయింది! కూలిపోయింది! అది దయ్యాలు సంచరించే స్థలంగా, ప్రతి దుష్ట ఆత్మలు సంచరించే స్థలంగా, ప్రతి అపవిత్ర పక్షి సంచరించే స్థలంగా, ప్రతి మలినమైన అసహ్యమైన క్రూరమృగాలు సంచరించే స్థలంగా మారింది.


Lean sinn:

Sanasan


Sanasan