Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 51:53 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

53 బబులోను ఆకాశానికి ఎక్కి తన ఎత్తైన కోటను పటిష్టం చేసుకున్నా, నేను దాని మీదికి నాశనం చేసేవారిని పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

53 బబులోను తన బలమైన ఉన్నతస్థలములను దుర్గములుగా చేసికొని ఆకాశమునకు ఎక్కినను పాడుచేయువారు నాయొద్దనుండి వచ్చి దానిమీద పడుదురు ఇదే యెహోవా వాక్కు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

53 బబులోను తన ఎత్తయిన కోటలను ఎంత బలోపేతం చేసినా, వాళ్ళ కోటలు ఆకాశంలోకి కట్టుకున్నా వినాశకులు నానుండి ఆమె దగ్గరికి వస్తారు.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

53 ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు. బబులోను తన కోటలను పటిష్ఠం చేసికోవచ్చు కాని ఆ నగరంతో పోరాడటానికి నేను జనాన్ని పంపుతాను. ఆ ప్రజలు దానిని నాశనం చేస్తారు.” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

53 బబులోను ఆకాశానికి ఎక్కి తన ఎత్తైన కోటను పటిష్టం చేసుకున్నా, నేను దాని మీదికి నాశనం చేసేవారిని పంపుతాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 51:53
29 Iomraidhean Croise  

అప్పుడు వారు, “రండి, మన కోసం ఆకాశాన్ని అంటే గోపురం గల ఒక పట్టణాన్ని కట్టుకుని మనకు మనం పేరు తెచ్చుకుందాం; లేదా మనం భూమంతా చెదిరిపోతాం” అని అన్నారు.


భక్తిహీనుల గర్వం ఆకాశాలను అంటినా వారి తల మేఘాలను తాకినా,


చూడండి, వారి మీద దాడి చేయడానికి నేను మెదీయ వారిని రేపుతాను. వారు వెండిని లెక్కచేయరు. బంగారం మీద వారికి ఆసక్తి లేదు.


“ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు.


“బబులోనీయుల రాణి పట్టణమా, మౌనంగా కూర్చో, చీకటిలోనికి వెళ్లిపో; రాజ్యాలకు రాణివని ఇకపై నీవు పిలువబడవు.


నీవు ‘నేను ఎప్పటికీ నిత్య రాణిగా ఉంటాను!’ అని అనుకున్నావు. కాని వీటి గురించి ఆలోచించలేదు ఏమి జరగబోతుందో తెలుసుకోలేదు.


నీవు రేపిన భయాందోళనలు, నీ హృదయ గర్వం నిన్ను మోసం చేశాయి, బండ సందుల్లో నివసించేదానా, కొండ శిఖరాల మీద నివాసం ఏర్పరచుకున్నదానా, నీవు గ్రద్దలా ఎత్తైన చోట నీ గూడు కట్టుకున్నా అక్కడినుండి నేను నిన్ను క్రిందికి పడవేస్తాను” అని యెహోవా చెప్తున్నారు.


“మెరతాయీము మీద దాడి చేయండి. పేకోదులో నివసించేవారి మీద దాడి చేయండి,” వెంటాడి, వారిని చంపి పూర్తిగా నాశనం చేయండి, అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను నీకు ఆజ్ఞాపించినదంతా చేయండి.


బబులోనీయుల దేశంలో ప్రభువైన సైన్యాల యెహోవా చేయవలసిన పని ఉంది. కాబట్టి యెహోవా తన ఆయుధశాలను తెరిచి తన ఉగ్రతను తీర్చే ఆయుధాలను బయటకు తెచ్చారు.


కాబట్టి, బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో, బబులోనీయుల దేశానికి వ్యతిరేకంగా ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.


“బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు.


“నాశనం చేసే పర్వతమా, భూమి అంతటిని నాశనం చేసేదానా, నేను నీకు వ్యతిరేకిని,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నీకు వ్యతిరేకంగా నా చేయి చాపి, నిన్ను కొండలమీద నుండి దొర్లించి, నిన్ను కాలిపోయిన పర్వతంలా చేస్తాను.


అప్పుడు భూమి ఆకాశాలు వాటిలో ఉన్నవన్నీ బబులోను గురించి ఆనందంతో కేకలు వేస్తాయి, ఎందుకంటే ఉత్తర దిక్కునుండి నాశనం చేసేవారు దాని మీద దాడి చేస్తారు,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


బబులోను మీదికి నాశనం చేసేవాడు వస్తాడు; దాని యోధులు బందీలవుతారు, ఎందుకంటే వారి విల్లులు విరిగిపోతాయి. యెహోవా ప్రతీకారం చేసే దేవుడు; ఆయన పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.


సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “బబులోను దృఢమైన గోడ నేలమట్టం అవుతుంది, దాని ఎత్తైన ద్వారాలకు నిప్పు పెట్టబడుతుంది. ప్రజలు వృధాగా కష్టపడుతున్నారు, దేశాల శ్రమ అగ్ని పాలవుతుంది.”


“నా రాజ నివాసంగా నేను కట్టుకున్న ఈ మహా బబులోను పట్టణం నా బలప్రభావంతో నా వైభవాన్ని కనుపరచడానికి కట్టుకుంది కాదా?” అని తనలో తాను అనుకున్నాడు.


వారు పాతాళం లోతుల్లోనికి త్రవ్వుకొని వెళ్లినా, అక్కడినుండి నా చేయి వారిని తీసుకుంటుంది. వారు పైనున్న ఆకాశాల పైకి ఎక్కినా, అక్కడినుండి వారిని క్రిందికి తీసుకువస్తాను.


శత్రువులు వారిని బందీలుగా దేశాంతరం తీసుకెళ్లినా, అక్కడ వారిని చంపమని ఖడ్గానికి ఆజ్ఞ ఇస్తాను. “నా చూపు వారి మీద నిలుపుతాను, అది కీడుకోసమే కాని మేలుకోసం కాదు.”


“తనకు నాశనం కలుగకుండా తన నివాసాన్ని ఎత్తు చేసుకుని అన్యాయమైన సంపాదనతో తన ఇంటిని నిర్మించుకునే వారికి శ్రమ!


Lean sinn:

Sanasan


Sanasan