Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 51:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

18 అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

18 అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు విమర్శకాలమున అవి నశించిపోవును.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

18 అవి పనికిమాలినవి. వాటిని చేసే వాళ్ళు అపహాసకులు. వాటి పైకి శిక్ష వచ్చినప్పుడు అవి నశించి పోతాయి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

18 ఆ విగ్రహాలు నిరుపయోగం! ప్రజలు చేసిన ఆ విగ్రహాలు నవ్వులాట బొమ్మలు! వారికి తీర్పు తీర్చే కాలం వస్తుంది. అప్పుడా విగ్రహాలు నాశనం చేయబడతాయి.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

18 అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 51:18
18 Iomraidhean Croise  

“అదే రాత్రి నేను ఈజిప్టు దేశమంతా తిరుగుతూ ఆ దేశంలోని మనుష్యుల్లో జంతువుల్లో ప్రతి మొదటి సంతానాన్ని చంపి ఈజిప్టు దేవుళ్ళందరికి తీర్పు తీరుస్తాను. నేను యెహోవానై యున్నాను.


ఈజిప్టుకు వ్యతిరేకంగా ప్రవచనం: చూడండి, యెహోవా వేగంగల మేఘం ఎక్కి ఈజిప్టుకు వస్తున్నారు. ఈజిప్టు విగ్రహాలు ఆయన ఎదుట వణకుతాయి, ఈజిప్టు ప్రజల గుండెలు భయంతో కరిగిపోతాయి.


విగ్రహాలు పూర్తిగా అదృశ్యమవుతాయి.


బేలు మోకరిస్తుంది, నెబో క్రిందికి వంగుతుంది. వాటి విగ్రహాలను బరువులు మోసే జంతువులు మోస్తాయి. ఆ బరువైన ప్రతిమలను మోయడం కష్టం, అలసిపోయిన పశువులకు భారము.


నీ నీతిని పనులను నేను బయటపెడతాను అవి మీకు ప్రయోజనకరంగా ఉండవు.


“వారితో ఇలా చెప్పు: ‘ఆకాశాన్ని, భూమిని సృజించని ఈ దేవుళ్ళు భూమి మీద నుండి, ఆకాశం క్రిందనుండి నశించిపోతారు.’ ”


మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.


అవి పనికిరానివి, అపహాస్యం కొరకైనవి; వాటికి తీర్పు వచ్చినప్పుడు అవి నశించిపోతాయి.


వారంతా తెలివిలేనివారు, మూర్ఖులు; వారు పనికిరాని చెక్క విగ్రహాల బోధను వింటున్నారు.


అయినా నా ప్రజలు నన్ను మరచిపోయారు; పనికిమాలిన విగ్రహాలకు ధూపం వేస్తున్నారు, వాటివలన వారు తమ జీవితాల్లో తడబడ్డారు పురాతనమైన మార్గాలను వదిలిపెట్టి, సరిగా లేని అడ్డదారుల్లో నడవాలి అనుకున్నారు.


ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా అంటున్నారు: “తేబేసులోని ఆమోను దేవున్ని, ఫరోను, ఈజిప్టును దాని దేవుళ్ళను, రాజులను, ఫరోను నమ్ముకున్న వారిని శిక్షించబోతున్నాను.


మీరు మీ క్రియలను, ఐశ్వర్యాన్ని నమ్ముతారు కాబట్టి, మీరు కూడా బందీలుగా కొనిపోబడతారు, అలాగే కెమోషు దేవుడు తన యాజకులతో, అధికారులతో పాటు బందీగా వెళ్తాడు.


“దేశాల మధ్య ప్రకటన చేసి, చాటించండి, ఒక జెండాను ఎత్తి దాన్ని చాటించండి; ఏదీ దాచకుండా ఇలా చెప్పండి, ‘బబులోను స్వాధీనం చేసుకోబడుతుంది; బేలు దేవుడు సిగ్గుపరచబడతాడు, మర్దూకు దేవత పడవేయబడుతుంది. బబులోను ప్రతిమలు సిగ్గుపరచబడతాయి, దాని విగ్రహాలు పడద్రోయబడతాయి.’


మీరు ఎక్కడ నివసించినా, ఆ పట్టణాలు నిర్జనమవుతాయి, క్షేత్రాలు పడగొట్టబడతాయి, తద్వారా మీ బలిపీఠాలు అపవిత్రమవుతాయి, మీ విగ్రహాలు పగిలి శిథిలమవుతాయి, మీ ధూపవేదికలు పగులగొట్టబడతాయి, మీరు తయారుచేసినవి తుడిచివేయబడతాయి.


“విలువలేని విగ్రహాలను పూజించేవారు, తమ పట్ల దేవునికున్న ప్రేమకు దూరమవుతారు.


ఆయన భూమ్మీద ఉన్న దేవతలందరినీ నాశనం చేసినప్పుడు యెహోవా వారికి భయంకరంగా ఉంటాడు. ద్వీపాల్లో నివసించే జనులంతా తమ స్థలాల నుండి, ఆయనకు నమస్కారం చేస్తారు.


“స్నేహితులారా, మీరెందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మనుష్యులమే. మీరు ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాలను, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న సమస్తాన్ని సృజించిన సజీవుడైన దేవుని వైపు తిరగండని మేము మీకు సువార్తను ప్రకటిస్తున్నాము.


Lean sinn:

Sanasan


Sanasan