Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 51:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

11 “బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

11 బాణములు చికిలిచేయుడి కేడెములు పట్టుకొనుడి బబులోనును నశింపజేయుటకు యెహోవా ఆలోచించు చున్నాడు మాదీయుల రాజుల మనస్సును దానిమీదికి రేపు చున్నాడు. అది యెహోవాచేయు ప్రతి దండన తన మందిరమునుగూర్చి ఆయనచేయు ప్రతి దండన.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

11 బాణాలు పదును పెట్టండి. డాళ్ళు చేత పట్టుకోండి. బబులోనును నాశనం చేయడానికి యెహోవా మాదీయుల రాజు మనస్సును రేపుతున్నాడు. అది యెహోవా తీర్చుకుంటున్న ప్రతీకారం. తన మందిరాన్ని కూలగొట్టినందుకు ఆయన చేస్తున్న ప్రతిదండన.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

11 మీ బాణాలకు పదును పెట్టండి. మీ డాళ్లను చేపట్టండి! యెహోవా మాదీయుల రాజును ప్రేరేపిస్తున్నాడు. ఆయన బబులోనును నాశనంచేయ సంకల్పించాడు. కావున ఆయన వారిని ప్రేరేపిస్తున్నాడు. బబులోను ప్రజలకు అర్హమైన శిక్షను యెహోవా విధిస్తాడు. బబులోను సైన్యం యెరూషలేములో యెహోవా ఆలయాన్ని నాశనం చేసింది. కావున వారికి తగిన దండన యెహోవా విధిస్తాడు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

11 “బాణాలకు పదును పెట్టండి, కవచాలను తీసుకోండి! యెహోవా మాదీయుల రాజులను రెచ్చగొట్టారు, ఎందుకంటే బబులోనును నాశనం చేయడమే ఆయన ఉద్దేశము. యెహోవా ప్రతీకారం తీర్చుకుంటారు, తన మందిరం కోసం ప్రతీకారం తీర్చుకుంటారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 51:11
39 Iomraidhean Croise  

తర్వాత యెహోవా ఎదోము రాజవంశానికి చెందిన ఎదోమీయుడైన హదదును సొలొమోనుకు విరోధిగా లేపారు.


దేవుడు సొలొమోను మీదికి ఎల్యాదా కుమారుడైన రెజోను అనే ఇంకొక విరోధిని లేపారు; ఇతడు తన యజమాని సోబా రాజైన హదదెజెరు నుండి పారిపోయిన వాడు.


కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును (అష్షూరు రాజైన తిగ్లత్-పిలేసెరు) పురికొల్పగా, అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రీకులను బందీలుగా తీసుకెళ్లాడు. అతడు వారిని హాలహు, హాబోరు, హారా, గోజాను అనే నదీ ప్రాంతాలకు తీసుకెళ్లాడు. ఈ రోజు వరకు వారు అక్కడే ఉన్నారు.


పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా, దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:


పర్షియా రాజైన కోరెషు పాలన మొదటి సంవత్సరంలో, యిర్మీయా చెప్పిన యెహోవా మాటను నెరవేర్చడానికి, తన రాజ్యమంతటా ఒక ప్రకటన చేసేలా దానిని వ్రాతపూర్వకంగా ఉంచేలా యెహోవా పర్షియా రాజైన కోరెషు హృదయాన్ని ప్రేరేపించారు:


ఓరేబు బండ దగ్గర మిద్యానును చంపినట్లు సైన్యాల యెహోవా తన కొరడాతో వారిని కొడతారు; ఆయన ఈజిప్టులో చేసినట్టు తన దండాన్ని సముద్రం మీద ఎత్తుతారు.


భయంకరమైన దర్శనం నాకు వచ్చింది: మోసం చేసేవారు మోసం చేస్తారు, దోచుకొనేవారు దోచుకుంటారు. ఏలామూ, వెళ్లి దాడి చేయి! మెదీయా, ముట్టడించు! దాని మూలుగు అంతటిని నేను ఆపివేస్తాను.


వారు భోజనపు బల్లలను సిద్ధం చేశారు, వారు తివాసీలు పరిచారు, వారు తిని త్రాగుతారు! అధిపతులారా! లేవండి డాళ్లకు నూనె రాయండి.


“ఉత్తరం వైపు నుండి నేను ఒకడిని రేపుతున్నాను. నా పేరిట ప్రార్థించే వాడొకడు సూర్యోదయ దిక్కునుండి వస్తున్నాడు. కుమ్మరి మట్టిని త్రొక్కినట్లు ఒకడు బురదను త్రొక్కినట్లు అతడు పాలకులను త్రొక్కుతాడు.


కోరెషు పక్షంగా దేశాలను జయించడానికి రాజులను నిరాయుధులుగా చేయడానికి అతని ఎదుట ద్వారాలు మూయబడకుండా తలుపులు తీయడానికి నేను అతని కుడిచేతిని పట్టుకున్నాను. తన అభిషిక్తుడైన ఈ కోరెషుతో యెహోవా చెప్పే మాట ఇదే:


నేను యెహోవాను, వేరే ఏ దేవుడు లేడు; నేను తప్ప ఏ దేవుడు లేడు. నీవు నన్ను గుర్తించకపోయినా నేను నిన్ను బలపరుస్తాను.


తూర్పు నుండి క్రూరపక్షిని రప్పిస్తాను; దూరదేశం నుండి నా ఉద్దేశాన్ని నెరవేర్చే వానిని పిలుస్తాను. నేను చెప్పిన దానిని నెరవేరుస్తాను; నా ప్రణాళిక ప్రకారం నేను చేస్తాను.


జిమ్రీ, ఏలాము, మాదీయుల రాజులందరూ;


“చిన్న, పెద్ద డాళ్లను సిద్ధం చేసుకుని యుద్ధానికి బయలుదేరండి.


గుర్రాలను సిద్ధం చేసుకోండి, గుర్రాలను ఎక్కండి! శిరస్త్రాణం ధరించి బయలుదేరడానికి సిద్ధపడండి! నీ ఈటెలను పదును చేయండి, మీ కవచాన్ని ధరించండి!


గుర్రాల్లారా ఎగరండి, రథాల్లారా రెచ్చిపోండి! యోధులారా, డాళ్లు మోసే కూషు వారలారా, పూతు వారలారా, బయలుదేరండి, విల్లు విసిరే లిడియా పురుషులారా ముందుకు నడవండి.


బబులోనీయుల దేశంలో ప్రభువైన సైన్యాల యెహోవా చేయవలసిన పని ఉంది. కాబట్టి యెహోవా తన ఆయుధశాలను తెరిచి తన ఉగ్రతను తీర్చే ఆయుధాలను బయటకు తెచ్చారు.


ఉత్తర దిక్కునుండి ఒక దేశం దానిపై దాడి చేసి దాని దేశాన్ని పాడుచేస్తుంది. దానిలో ఎవరూ నివసించరు; మనుష్యులు పారిపోతారు జంతువులు పారిపోతాయి.


కాబట్టి, బబులోనుకు వ్యతిరేకంగా యెహోవా ఏమి ప్రణాళిక వేశారో, బబులోనీయుల దేశానికి వ్యతిరేకంగా ఏమి ఉద్దేశించారో వినండి: మందలోని చిన్న పిల్లలు బయటకు ఈడ్చివేయబడతాయి; వారు చేసిన దానికి వారి పచ్చికబయళ్లు పాడుచేయబడతాయి.


నేను బబులోనుకు వ్యతిరేకంగా ఉత్తర దేశం నుండి గొప్ప దేశాల కూటమిని రప్పిస్తాను. వారు దానికి వ్యతిరేకంగా యుద్ధపంక్తులు తీర్చుతారు, ఉత్తరం నుండి దాన్ని పట్టుకుంటారు. వారి బాణాలు వట్టి చేతులతో తిరిగి రాని నైపుణ్యం కలిగిన యోధుల వలె ఉంటాయి.


బబులోను గోడలకు వ్యతిరేకంగా జెండా ఎత్తండి! రక్షకభటులను బలపరచండి, కావలివారిని నిలబెట్టండి, మాటుగాండ్రను సిద్ధం చేయండి! యెహోవా తన ఉద్దేశాన్ని, బబులోను ప్రజలకు వ్యతిరేకంగా తన శాసనాన్ని నెరవేర్చబోతున్నారు.


“బబులోనుకు, బబులోనులో నివసించే వారందరికి సీయోనులో చేసిన అన్యాయానికి బదులుగా మీ కళ్లముందే నేను ప్రతిఫలం చెల్లిస్తాను” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


మన శరీరానికి చేసిన హింస బబులోనుకు జరుగును గాక,” అని సీయోను నివాసులు అంటున్నారు. “మా రక్తదోషం బబులోనులో నివసించేవారి మీద ఉండును గాక,” అని యెరూషలేము అంటుంది.


కాబట్టి యెహోవా ఇలా అంటున్నారు: “చూడండి, నేను మీ పక్షంగా వాదిస్తాను, మీ కోసం ప్రతీకారం తీర్చుకుంటాను. నేను దాని సముద్రం ఆరిపోయేలా చేస్తాను, దాని నీటి ఊటలు ఎండిపోయేలా చేస్తాను.


అదే రాత్రి కల్దీయుల రాజైన బెల్షస్సరు చంపబడ్డాడు,


మీ నాగటి నక్కులను సాగగొట్టి ఖడ్గాలు చేయండి, మడ్డికత్తులను సాగగొట్టి ఈటెలుగా చేయండి. “నేను బలవంతున్ని!” అని బలహీనులు అనుకోవాలి.


దేశాల మధ్య ఈ విషయం చాటించండి, యుద్ధానికి సిద్ధపడండి! వీరులను పురికొల్పండి, పోరాడేవారందరు సమకూడి వచ్చి దాడి చేయాలి.


నిబంధన ఉల్లంఘనకు ప్రతీకారం తీర్చుకోవడానికి నేను మీపై ఖడ్గం తెస్తాను. మీరు మీ పట్టణాల్లోకి వెళ్లినప్పుడు, నేను మీ మధ్యకు తెగులును పంపుతాను, మీరు శత్రువు చేతుల్లోకి ఇవ్వబడతారు.


యెరూషలేము మీద యుద్ధం చేసిన దేశాలన్నిటి మీదికి యెహోవా రప్పించే తెగులు ఇలా ఉంటుంది: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి, వారి కళ్లు కంటి కుహరాల్లో ఉండి కూడా కుళ్ళిపోతాయి, వారి నాలుకలు వారి నోటిలోనే కుళ్ళిపోతాయి.


యెరూషలేము మీద యుద్ధం చేయడానికి అన్ని దేశాలను నేను సమకూరుస్తాను; వారు పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారు, ఇల్లు దోచుకుంటారు, స్త్రీలను అత్యాచారం చేస్తారు. పట్టణ ప్రజల్లో సగం మంది బందీలుగా వెళ్తారు. అయితే మిగిలి ఉన్న ప్రజలు నాశనం కాకుండా పట్టణంలోనే ఉండిపోతారు.


Lean sinn:

Sanasan


Sanasan