యిర్మీయా 50:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 వారిని చూసినవారు వారిని మ్రింగివేశారు; వారి శత్రువులు, ‘మేము దోషులం కాదు, ఎందుకంటే వారు తమ నీతి సింహాసనమైన యెహోవాకు, తమ పూర్వికుల నిరీక్షణయైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు’ అని అన్నారు. Faic an caibideilపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 కనుగొనినవారందరు వారిని భక్షించుచు వచ్చిరివారి శత్రువులు–మేము అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమపితరులకు నిరీక్షణాధారమునగు యెహోవామీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించెనని చెప్పుదురు. Faic an caibideilఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వారంతా వాళ్ళను మింగివేస్తూ వచ్చారు. వాళ్ళ శత్రువులు ‘మేం అపరాధులం కాము. ఎందుకంటే వీళ్ళు తమ నిజమైన నివాసం, తమ పూర్వీకులకు ఆధారం అయిన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేశారు.’ అన్నారు. Faic an caibideilపవిత్ర బైబిల్7 నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయపర్చారు. పైగా వారి శత్రువులు, ‘మేము ఏ నేరమూ చేయలేదన్నారు.’ ఆ ప్రజలు యెహోవా పట్ల పాపం చేశారు. యెహోవాయే వారి అసలైన విశ్రాంతి స్థలం. వారి తండ్రులు నమ్మిన యెహోవాయే వారి దేవుడు. Faic an caibideilBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 వారిని చూసినవారు వారిని మ్రింగివేశారు; వారి శత్రువులు, ‘మేము దోషులం కాదు, ఎందుకంటే వారు తమ నీతి సింహాసనమైన యెహోవాకు, తమ పూర్వికుల నిరీక్షణయైన యెహోవాకు విరోధంగా పాపం చేశారు’ అని అన్నారు. Faic an caibideil |