Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 49:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 దేదానులో నివసించేవారలారా, వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి, నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి వారిని శిక్షిస్తాను.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 ఏశావును విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను; దదానీయులారా, పారిపోవుడి వెనుకకు మళ్లుడి బహులోతున దాగు కొనుడి.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 దేదాను నివాసులు పారిపోండి. వెనక్కి తిరగండి. నేలపై ఉన్న కలుగుల్లో ఉండండి. ఎందుకంటే నేను ఏశావు ప్రజల పైకి ఆపదను రప్పించి అతణ్ణి శిక్షించబోతున్నాను.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

8 దదానులో నివసించే ప్రజలారా, పారిపోండి! దాగుకోండి! ఎందుకంటే, నేను ఏశావును తాను చేసిన చెడ్డ పనులు కారణంగా శిక్షిస్తాను.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 దేదానులో నివసించేవారలారా, వెనక్కి తిరిగి పారిపోయి లోతైన గుహల్లో దాక్కోండి, నేను ఏశావు మీదికి విపత్తు రప్పించి వారిని శిక్షిస్తాను.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 49:8
22 Iomraidhean Croise  

యెహోవా భూమిని వణికించడానికి లేచినప్పుడు, ఆయన భీకర సన్నిధి నుండి పారిపోయి ఆయన ప్రభావ మహాత్మ్యం నుండి వారు కొండల గుహల్లో బండ బీటల్లో దాక్కుంటారు.


అరేబియాకు వ్యతిరేకంగా ప్రవచనం: అరేబియా ఎడారిలో బసచేసే దెదానీయులైన యాత్రికులారా,


ఆకాశంలో నా ఖడ్గం దానికి కావల్సింది త్రాగింది; చూడండి, ఎదోము మీద తీర్పు తీర్చడానికి, నేను పూర్తిగా నాశనం చేసిన ప్రజలు మీదికి అది దిగుతుంది.


దేదాను, తేమా, బూజీయులు దూర ప్రాంతాల్లో ఉన్నవారందరు;


దాని శాలల్లో ఉన్న కిరాయి సైనికులు బలిసిన దూడల వంటివారు. వారు కూడా నిలబడలేక, వెనక్కి పారిపోతారు. విపత్తు రోజు వారి మీదికి రాబోతోంది, అది వారు శిక్షించబడే సమయము.


మోయాబులో నివసించేవారలారా, మీ పట్టణాలను విడిచిపెట్టి రాళ్ల మధ్య నివసించండి. గుహ ముఖద్వారం దగ్గర గూడు కట్టుకునే పావురంలా ఉండండి.


“భయాందోళన నుండి పారిపోయేవాడు గొయ్యిలో పడిపోతాడు, గొయ్యిలో నుండి తప్పించుకుని పైకి వచ్చినవాడు ఉచ్చులో చిక్కుకుంటాడు; నేను మోయాబు మీదికి దాన్ని శిక్షించే సంవత్సరాన్ని రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


పారిపోండి! మీ ప్రాణాలు కాపాడుకోండి; ఎడారిలో పొదలా ఉండండి.


“త్వరగా పారిపోండి! హాసోరులో నివసించేవారలారా, లోతైన గుహల్లో దాక్కోండి” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “బబులోను రాజైన నెబుకద్నెజరు నీకు వ్యతిరేకంగా కుట్రపన్నాడు. అతడు నీకు వ్యతిరేకంగా ఒక పథకం వేశాడు.


“వారి ఒంటెలు దోచుకోబడతాయి, వారి విస్తారమైన మందలు యుద్ధంలో కొల్లగొట్టబడతాయి. సుదూర ప్రాంతాలకు నలువైపులా వారిని చెదరగొట్టి వారి మీదికి అన్నివైపులా విపత్తు తెస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


దాని కోడెలన్నిటినీ చంపండి; వాటిని వధకు పంపండి! వారికి శ్రమ దినం వచ్చింది, వారు శిక్షించబడే సమయం వచ్చింది.


“బెన్యామీను ప్రజలారా, క్షేమం కోసం పారిపోండి! యెరూషలేము నుండి పారిపోండి! తెకోవాలో బూరధ్వని చేయండి! బేత్-హక్కెరెము మీద సంకేతం కోసం ధ్వజం నిలబెట్టండి! ఎందుకంటే ఉత్తర దిక్కునుండి విపత్తు వస్తుంది, భయంకరమైన విధ్వంసం కూడా వస్తుంది.


కాబట్టి ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ఎదోము మీద నా చేయి చాపి మనుష్యులను పశువులను చంపి సమస్తాన్ని నిర్మూలం చేస్తాను. తేమాను పట్టణం నుండి దేదాను వరకు ప్రజలంతా కత్తివేటుకు కూలిపోతారు.


ఏశావును ద్వేషించాను; నేను అతని కొండలను పాడు చేశాను. అతడు వారసత్వంగా పొందిన ప్రదేశాన్ని అడవి నక్కల పాలు చేశాను” అని యెహోవా అంటున్నారు.


ఎదోము వారు, “మేము నలుగగొట్టబడ్డాము, అయినాసరే మేము ఆ శిథిలాలనే తిరిగి కట్టుకుంటాము” అని అంటారేమో! కాని సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “వారు మళ్ళీ కట్టుకున్నా, నేను కూల్చివేస్తాను. వారిది దుర్మార్గుల దేశమని, ఎప్పటికీ యెహోవా ఉగ్రతకు గురయ్యే ప్రజలని పిలువబడతారు.


భూ రాజులు, రాకుమారులు, ప్రధానులు, ధనవంతులు, బలవంతులు, దాసులు, స్వతంత్రులు ప్రతి ఒక్కరు గుహల్లో, కొండల రాళ్ల సందుల్లో దాక్కున్నారు.


మిద్యానీయులు తమను చాలా క్రూరంగా అణచివేయడంతో ఇశ్రాయేలీయులు తమ కోసం పర్వతాల్లో, గుహల్లో, బలమైన కోటలలో సురక్షితమైన స్థలాలు సిద్ధపరచుకున్నారు.


ఇశ్రాయేలీయులు తాము క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నామని తమ సైన్యమంతా ఒత్తిడిలో ఉన్నారని తెలుసుకొని గుహల్లో ముళ్ళపొదల్లో బండ సందుల్లో గుంటల్లో నీళ్లతొట్టెల్లో దాక్కున్నారు.


Lean sinn:

Sanasan


Sanasan