Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 49:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

6 “అయితే, నేను అమ్మోనీయులను చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

6 –నేను నీ చుట్టునున్న వారందరివలన నీకు భయము పుట్టించుచున్నాను; మీరందరు శత్రువుని కెదురుగా తరుమబడుదురు, పారిపోవువారిని సమకూర్చు వాడొకడును లేక పోవును, అటుతరువాత చెరలోనున్న అమ్మోనీయులను నేను రప్పించెదను; ఇదే యెహోవా వాక్కు.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

6 అయితే ఇదంతా అయ్యాక నేను అమ్మోను ప్రజల భాగ్యాన్ని పునరుద్ధరిస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

6 “అమ్మోనీయులు బందీలుగా కొనిపోబడతారు. కాని అమ్మోనీయులను నేను వెనుకకు తీసికొనివచ్చే సమయం వస్తుంది.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

6 “అయితే, నేను అమ్మోనీయులను చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 49:6
8 Iomraidhean Croise  

అయినా దాని లాభం, దాని సంపాదన యెహోవాకు చెందుతుంది; వాటిని నిల్వ ఉంచరు, కూడబెట్టరు. దాని లాభాలు యెహోవా సన్నిధిలో నివసించేవారికి సమృద్ధి ఆహారం, విలువైన వస్త్రాలు అందించడానికి ఉపయోగించబడతాయి.


కానీ నేను వారిని పెళ్లగించిన తర్వాత, మళ్ళీ వారి మీద కనికరపడి, వారి వారసత్వాలకు వారి దేశాలకు వారిని తిరిగి రప్పిస్తాను.


వారిని చంపాలనుకున్న వారి చేతులకు అనగా బబులోను రాజైన నెబుకద్నెజరుకు అతని అధికారులకు నేను వారిని అప్పగిస్తాను. ఆ తర్వాత ఈజిప్టు గతంలో ఉన్నట్లే నివాసయోగ్యంగా ఉంటుంది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“అయితే నేను రాబోయే రోజుల్లో మోయాబు వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. దీనితో మోయాబుపై తీర్పు ముగిసింది.


“అయినప్పటికీ నేను రాబోయే రోజుల్లో ఏలాముకు చెందిన వారిని చెర నుండి తిరిగి రప్పిస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.


“ ‘నేను సొదొమకు దాని కుమార్తెలకు, సమరయకు దాని కుమార్తెలకు వారి సంపదతో పాటు మీ సంపదను తిరిగి ఇస్తాను.


అతడు సుందరమైన దేశాన్ని కూడ ఆక్రమిస్తాడు, ఎన్నో దేశాలు పడిపోతాయి, కాని ఎదోము, మోయాబు, అమ్మోను నాయకులు అతని చేతి నుండి విడిపించబడతారు.


Lean sinn:

Sanasan


Sanasan