Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 48:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

3 హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి.

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

3 ఆలకించుడి, హొరొనయీమునుండి రోదనధ్వని వినబడుచున్నది దోపుడు జరుగుచున్నది మహాపజయము సంభ వించుచున్నది.

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

3 వినండి! హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. అక్కడ అనర్ధం, మహా విధ్వంసం జరిగాయి.

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

3 హొరొనయీము నుండి వచ్చే ఆక్రందనలు విను. అవి కలవరపాటుకు, వినాశనానికి సంబంధించిన కేకలు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

3 హొరొనయీము నుండి ఆర్తనాదాలు వినబడుతున్నాయి, అక్కడ మహా వినాశనం, నాశనం జరుగుతున్నాయి.

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 48:3
12 Iomraidhean Croise  

దీబోను ఏడ్వడానికి గుడికి తన క్షేత్రాలకు వెళ్తుంది; నెబో మెదెబా బట్టి మోయాబు రోదిస్తుంది. ప్రతి తల క్షౌరం చేయబడింది ప్రతివాని గడ్డం గొరిగించబడింది.


మోయాబు గురించి నా హృదయం మొరపెడుతుంది; వారిలో పారిపోయినవారు సోయరు వరకు, ఎగ్లత్-షెలీషియా వరకు పారిపోతారు. వారు లూహీతు ఎక్కుతున్నప్పుడు ఆ దారిలో ఏడుస్తూ ఎక్కుతారు; హొరొనయీము వెళ్లే దారిలో తమ నాశనం గురించి విలపిస్తారు.


వారి ఆర్తనాదాలు మోయాబు సరిహద్దులలో ప్రతిధ్వనిస్తాయి; వారి రోదన ఎగ్లయీము వరకు వారి ఏడ్పు బెయేర్-ఎలీము వరకు వినబడుతుంది.


అప్పుడు నేను, “నా నుండి దూరంగా వెళ్లండి; నన్ను గట్టిగా ఏడవనివ్వండి. నా ప్రజలకు కలిగిన నాశనం గురించి నన్ను ఓదార్చడానికి ప్రయత్నించకండి” అని చెప్తాను.


యెహోవా దయ లేకుండా పడగొట్టిన పట్టణాల్లా ఆ వ్యక్తి ఉండును గాక. అతడు ఉదయాన్నే రోదనను, మధ్యాహ్నం యుద్ధఘోష వినును గాక.


యెహోవా ఇలా చెప్తున్నారు: “ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి; అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి. అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద, పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి. కాబట్టి ప్రజలంతా మొరపెడతారు; దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు.


“నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.


మోయాబు ధ్వంసమవుతుంది; దాని చిన్న బిడ్డలు బిగ్గరగా ఏడుస్తారు.


వారు కొండపై నుండి లూహీతుకు, ఏడుస్తూ వెళ్తున్నారు; హొరొనయీముకు వెళ్లే దారిలో జరిగిన విధ్వంసం వల్ల ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి.


“బబులోను నుండి ఏడ్పు వస్తుంది, బబులోనీయుల దేశం నుండి మహా విధ్వంస శబ్దం వస్తుంది.


Lean sinn:

Sanasan


Sanasan