Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




యిర్మీయా 48:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

27 ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా? ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా, నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా ఛీ అన్నట్లుగా తల ఊపుతావు?

Faic an caibideil Dèan lethbhreac

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

27 ఇశ్రాయేలును నీవు అపహాస్యాస్పదముగా ఎంచలేదా? అతడు దొంగలకు జతగాడైనట్టుగా నీవు అతనిగూర్చి పలుకునప్పుడెల్ల తల ఆడించుచు వచ్చితివి

Faic an caibideil Dèan lethbhreac

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

27 ఇశ్రాయేలును చూసి నువ్వు నవ్వలేదా? ఎగతాళి చేయలేదా? అతణ్ణి గూర్చి మాట్లాడినప్పుడల్లా నువ్వు తల ఊపుతూ ఉన్నావే, అతణ్ణి దొంగల గుంపులో చూశావా ఏమిటి?

Faic an caibideil Dèan lethbhreac

పవిత్ర బైబిల్

27 “మోయాబూ, నీవు ఇశ్రాయేలును చూచి హేళన చేశావు. ఇశ్రాయేలు ఒక దొంగల గుంపు చేతికి చిక్కింది. నీవు ఇశ్రాయేలును గురించి మాట్లాడిన ప్రతిసారీ నీవు తలపంకించి, ఇశ్రాయేలు కంటె నీవే మెరుగైనట్లు ప్రవర్తించావు.

Faic an caibideil Dèan lethbhreac

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

27 ఇశ్రాయేలును మీరు హేళన చేయలేదా? ఆమె దొంగల మధ్య పట్టుబడిన దానిలా, నీవు ఆమె గురించి ఎప్పుడు మాట్లాడినా ఛీ అన్నట్లుగా తల ఊపుతావు?

Faic an caibideil Dèan lethbhreac




యిర్మీయా 48:27
22 Iomraidhean Croise  

నేనున్న స్థానంలో మీరు ఉంటే, నేనూ మీలాగే మాట్లాడగలను; మీకు వ్యతిరేకంగా ఎన్నో మాటలు మాట్లాడి మిమ్మల్ని చూసి తల ఊపుతూ ఎగతాళి చేయగలను.


పొరుగువారు మమ్మల్ని నిందించేలా చేశారు; మా చుట్టూ ఉన్నవారు మమ్మల్ని ఎగతాళి చేసేలా చేశారు.


ఆయన వారి సొంత నాలుకలను వారికే వ్యతిరేకంగా మార్చి వారిని పతనానికి తెస్తారు; వారిని చూసేవారందరూ ఎగతాళిగా తలాడిస్తారు.


మా పొరుగువారికి మేము అసహ్యులం అయ్యాం, మా చుట్టుపక్కల వారు మమ్మల్ని వెక్కిరించి హేళన చేస్తున్నారు.


వారి దేశం పాడైపోయి నిత్యం హేళన చేయబడేదిగా ఉంటుంది; దారిన వెళ్లేవారంతా నివ్వెరపోయి వారి తలలాడిస్తారు.


“దొంగ పట్టుబడినప్పుడు అవమానించబడినట్లు, ఇశ్రాయేలు ప్రజలు అవమానించబడ్డారు; వారు వారి రాజులు వారి అధికారులు, వారి యాజకులు వారి ప్రవక్తలు అవమానించబడ్డారు.


“దారిన పోయే మీకందరికి, ఏమీ అనిపించడం లేదా? చుట్టూ తిరిగి చూడండి. యెహోవా నా మీదికి తన కోపాగ్ని దినాన తెచ్చిన బాధలాంటి బాధ ఏదైనా ఉందా?


తన బాధలో, ఆమె నిరాశ్రయురాలిగా ఉన్న రోజుల్లో, యెరూషలేము పూర్వకాలంలో తనకు చెందిన సంపదలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటుంది. ఆమె ప్రజలు శత్రువు చేతిలో పడినప్పుడు, వారికి సాయం చేయడానికి ఎవరూ లేరు. ఆమె శత్రువులు ఆమె వైపు చూసి ఆమెకు కలిగిన నాశనాన్ని బట్టి నవ్వారు.


“ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: ‘మోయాబీయులు శేయీరు పట్టణస్థులు, “యూదా వారు కూడా ఇతర జనాల్లాగానే తయారయ్యారు” అన్నారు కాబట్టి,


ఇశ్రాయేలీయుల వారసత్వం పాడైపోయినప్పుడు నీవు సంతోషించావు, కాబట్టి నేను నీతో అలాగే వ్యవహరిస్తాను. శేయీరు పర్వతమా, నీవూ నీతో పాటు ఎదోము అంతా పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.’ ”


ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ఆహా! ప్రాచీనమైన ఉన్నత స్థలాలు మా స్వాధీనమయ్యాయి” అని శత్రువులు నీ గురించి అన్నారు.’


కాబట్టి, ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి: ప్రభువైన యెహోవా పర్వతాలతో, కొండలతో, కనుమలతో, లోయలతో, నిర్జనమైన శిథిలాలతో, మీ చుట్టూ ఉన్న మిగిలిన ఇతర జాతులచేత దోచుకోబడి అపహాస్యం చేయబడిన పాడైన పట్టణాలతో మాట్లాడుతూ,


ఈ విధంగా వారు గర్వంతో, సైన్యాల యెహోవా ప్రజలను అవమానించినందుకు, ఎగతాళి చేసినందుకు ప్రతిఫలం పొందుతారు.


“నా ప్రజల ప్రాంతంలోకి ప్రవేశించి వారిని దూషించిన, మోయాబు వారు చేసిన అవమానాల గురించి, అమ్మోనీయుల దూషణల గురించి నేను విన్నాను.


ఆ సమయంలోనే యేసు ఆ గుంపుతో, “నన్ను పట్టుకోడానికి కత్తులతో కర్రలతో వచ్చారు, నేను ఏమైన తిరుగుబాటు చేస్తున్నానా? నేను ప్రతిరోజు దేవాలయ ఆవరణంలో కూర్చుని బోధించేటప్పుడు, మీరు నన్ను బంధించలేదు.


ఆయనతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను, కుడి వైపున ఒకడిని, ఎడమవైపున ఒకడిని సిలువ వేశారు.


మీరు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకూ తీర్పు తీర్చబడుతుంది. మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు అదే కొలత కొలవబడుతుంది.


Lean sinn:

Sanasan


Sanasan